పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో చిరుతలను మరలా ప్రవేశపెట్టడానికి కార్యాచరణ ప్రణాళిక


Posted On: 10 AUG 2022 6:22PM by PIB Hyderabad

 

* స్వతంత్ర భారతదేశంలో అంతరించిపోయిన ఏకైక పెద్ద మాంసాహార చిరుతను పునరుద్ధరించాలని భారతదేశం యోచిస్తోంది.

ఈ ప్రయత్నం కింది ఉద్దేశాలను,లక్ష్యాలను నిర్ధారిస్తుంది:

ఉద్దేశం:

భారతదేశంలో ఆచరణీయమైన చిరుత జనాభాను పెంచడం, ఇది చిరుతను వేటపై ఆధారపడి జీవించే ప్రాణిగా దాని పర్యావరణ సంతులనలో క్రియాత్మక పాత్రను నిర్వహించడానికి, దాని చారిత్రక పరిధిలో చిరుత జాతి విస్తరణకు అనుమతిస్తుంది, తద్వారా ప్రపంచవ్యాప్తంగా చిరుతల పరిరక్షణ ప్రయత్నాలకు దోహదం చేస్తుంది.

ప్రాజెక్ట్ లక్ష్యాలు-

చిరుతల పెరుగుదలను ప్రోత్సహించి, దాని చారిత్రక పరిధిలో సురక్షితమైన అటవీ నివాసనెలవులలో ఏర్పాటు చేయడం, వాటి జనాబా పెంపుదలకు అనుగుణమైన పనులు నిర్వహించడం.

వ్యవస్థల నుండి జీవవైవిధ్యం పర్యావరణ రక్షణకు ప్రయోజనం చేకూర్చే రక్షిత అటవీ, సవన్నా వ్యవస్థలను పునరుద్ధరించడానికి వనరులను సేకరించేందుకు, చిరుతను ఆకర్షణీయమైన ప్రధాన, రక్షిత జాతిగా ఎంచడం ముఖ్యం.

చిరుత సంరక్షణ ప్రాంతాలలో పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కార్యకలాపాల ద్వారా కార్బన్‌ను సీక్వెస్టర్ (వాతావరణ కార్బన్ డయాక్సైడ్‌ను సంగ్రహించే మరియు నిల్వ చేసే ప్రక్రియ. ప్రపంచ వాతావరణ మార్పులను తగ్గించే లక్ష్యంతో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని తగ్గించే ఒక పద్ధతి) చేయగల భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందించడం, తద్వారా ప్రపంచ వాతావరణ మార్పుల ఉపశమన లక్ష్యాలకు దోహదం చేయడం.

స్థానిక ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి పర్యావరణ-అభివృద్ధి, ఎకో-టూరిజం కోసం తదుపరి అవకాశాన్ని ఉపయోగించడం.

చిరుత లేదా ఇతర వన్యప్రాణుల ద్వారా ఏదైనా సంఘర్షణ ఎదురైతే చిరుత సంరక్షణ ప్రాంతాల్లోని స్థానిక కమ్యూనిటీలకు పరిహారం, అవగాహన, నిర్వహణ చర్యల ద్వారా సమాజ మద్దతును పొందడం.

చిరుతలను పెంపొందింప చేయడం అనేది అంతరించే జాతుల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రమే కాదు, వాటి పరిణామ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించిన, మూలకంతో పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించే ప్రయత్నం, పర్యావరణ వ్యవస్థలు తమ పూర్తి సామర్థ్యానికి సేవలను అందించడానికి, గడ్డి భూములు, సవన్నా బహిరంగ అటవీ వ్యవస్థల జీవవైవిధ్యాన్ని పరిరక్షించే క్రమంలో చిరుతను ఆలంబనగా ఉపయోగించుకునే ప్రయత్నం.

****

 (Release ID: 1850816) Visitor Counter : 218


Read this release in: English , Urdu , Hindi , Odia