మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దీక్ష ప్లాట్‌ఫార్మ్
Posted On:
08 AUG 2022 5:04PM by PIB Hyderabad
అన్ని తరగతులకు (ఒక దేశం, ఒక డిజటల్ వేదిక) ద్వారా క్యూఆర్ కోడ్ తో అందుబాటులోకి వచ్చే పాఠ్యపుస్తకాల ద్వారా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో పాఠశాల విద్య కోసం నాణ్యత కలిగిన ఇ- కంటెంట్‌ను అందించే వేదిక దీక్ష (DIKSHA). దీక్ష వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్షియం (డబ్ల్యు3సి) వెబ్ కంటెంట్ సులభత మార్గదర్శకాలు (డబ్ల్యుసిఎజి)2.0 స్థాయి ఎఎకి అనుగుణంగా ఉంటుంది. ఇది, దృష్టి లోపం ఉన్నవారు స్క్రీన్ రీడర్స్ వంటి సహాయక సాంకేతికతలను ఉపయోగించి చదివేందుకు సాధికారతను ఇస్తుంది. దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్నవారి కోసం డిజిటల్లీ యాక్సెసబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (DAISY) ద్వారా సంజ్ఞా భాషలో ఎన్ఐఒఎస్ వెబ్‌సైట్ / యూట్యూబ్‌లో ప్రత్యేక కంటెంట్‌ను అభివృద్ధి చేశారు. ఐఎస్ఎల్ ఆధారిత 3,520 పాఠ్యపుస్తకాలకు సంబంధించిన వీడియోలు రికార్డు చేయగా, అందులో ఐఎస్ఎల్ వీడియాల ఆధారితంగా 597 పుస్తకాలను దీక్షలో అప్‌లోడ్ చేశారు. దానితో పాటుగా, 10,000 పదాల ఐఎస్ఎల్ డిక్షనరీని దీక్షలో అప్‌లోడ్ చేయడమే కాక, 3,474 ఆడియో పుస్తకాల అధ్యాయాలను అభివృద్ధి చేసి దీక్షలో అప్‌లోడ్ చేశారు.
ద్వితీయ / సీనియర్ సెకెండరీ స్థాయి టీచర్ల కోసం దీక్షపై నిష్ఠా 2.0 (NISHTHA 2.0) (రెండవ స్థాయి)ని 29 జులై, 2021న దీక్షలో ఆన్‌లైన్లో ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వ్యాప్తంగా ద్వితీయ శ్రేణిలో పని చేస్తున్న సుమారు 10 లక్షలమంది టీచర్లు, పాఠశాల అధిపతులకు ఈ శిక్షణా కార్యక్రమం కవర్ చేస్తుంది. ఎన్‌సిఇఆర్‌టి 12 సాధారణ మాడ్యూళ్ళను,నిష్ఠ2.0 కోసం 56 పాఠ్యాంశాల నిర్ధిష్ట మాడ్యూళ్ళతో 13 ఆన్‌లైన్ కోర్సుల ప్యాకేజీని అభివృద్ధి చేసింది. నేటి వరకు 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 10 భాషలలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. విద్యా మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ. గిరిజన మంత్రిత్వ శాఖ కింద స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కూడా దీనినే అనుసరించింది.
దీక్ష పోర్టల్‌పై నిష్ఠ 2.0 ఆన్‌లైన్‌ను 12 సాధారణ కోర్సులు, ఏడు బోధనాశాస్త్ర కోర్సులను అభివృద్ధి చేశారు. ఇందుకు అనుగుణంగా, పాఠ్య ప్రణాళిక & సమగ్ర విద్య; బోధనలో ఐసిటి, అభ్యాసం, మూల్యాంకనం, అభ్యాసకుల సమగ్రాభివృద్ధి కోసం లక్షణాలు; వ్యక్తిగత - సామాజిక లక్షణాలు, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, ద్వితీయ స్థాయి అభ్యాసకులను అర్ధం చేసుకోవడం; ఆరోగ్యం, సంక్షేమం; పాఠశాల నాయకత్వ అభివృద్ధి; వృత్తి విద్య; విద్యలో జెండర్ సమస్యలు; పాఠశాల విద్యలో చొరవలు; బొమ్మల ఆధారంగా బోధన, పాఠశాల ఆధారంగా మూల్యాంకనం సహా 68 మాడ్యూళ్ళను అభివృద్ధి చేశారు. తమ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు ఈ మాడ్యూళ్ళను అన్వయించుకోవచ్చు.
ప్రీ- ప్రమైరీ నుంచి ఐదవ తరగతి వరకు టీచర్లకు, పాఠశాల అధిపతులకు దీక్ష వేదికపై ఆన్‌లైన్ పద్ధతిలో నిష్ఠ 3.0 - ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ ఎల్‌ఎన్)ను 7 సెప్టెంబర్, 2021లో ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిల్లో పని చేస్తున్న సుమారు 25లక్షల మంది టీచర్లు, హెడ్‌మాస్టర్లను నిష్ఠ 3.0 ఎఫ్ఎల్ఎన్ కవర్ చేయాలని యోచిస్తోంది. ఎన్ఐపియుఎన్ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ఇందుకోసం ఎన్‌సిఇఆర్‌టి 12 ఆన్‌లైన్ మాడ్యూళ్ళతో ఒక ప్రత్యేక ప్యాకేజీని అభివృద్ధి చేసింది. నేటివరకూ, 33 రాష్ట్రాలు/ కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు 11 భాషలలో ప్రారంభించాయి. దీనినే విద్యా మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ. గిరిజన మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న 5 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కూడా అందిపుచ్చుకున్నాయి.
దీక్ష పోర్టల్‌పై నిష్ఠ 3.0 ఆన్‌లైన్‌లో ప్రతి బిడ్డ సమగ్ర అభివృద్ధికి టీచర్లు అనుభవాలను రూపొందించడంలో సహాయపడే లక్ష్యంతో - ఎఫ్ ఎల్ ఎన్ మిషన్ పరిచయం; యోగ్యత ఆధారిత విద్య దిశగా మార్పు; అభ్యాసకులను అర్థం చేసుకోవడం; బాలవాటిక, గ్రేడ్ 1 పిల్లల కోసం ఆటల ఆధారిత పాఠశాల సంసిద్ధత మాడ్యూల్; ప్రాథమిక భాష, అక్షరాస్యత; ప్రాథమిక అంకెలు, అభ్యాస మూల్యాంకనం; తల్లిదండ్రులు, సమాజం ప్రమేయం; బఓధనలో ఐసిటి సమగ్రత; అభ్యాసం & మూల్యాంకనం; బహుభాషా విద్య; బొమ్మల ఆధారంగా బోధన; పాఠశాల నాయకత్వం వంటి అంశాలను కలిగిన 12 మాడ్యూళ్ళను కలిగి ఉంటుంది.
నిష్ఠ కార్యక్రమం కింద అన్నిరకాల ఆన్‌లైన్ విషయాంశాలు ఎన్‌సిఇఆర్‌టికి చెందిన నిష్ఠ పోర్టల్‌లో దిగువన పేర్కొన్న లింక్‌లో అందుబాటులో ఉంటాయి. https://itpd.ncert.gov.in/
ఈ సమాచారాన్ని విద్యమంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సోమవారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాచారం ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1850096)
Visitor Counter : 215