ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
బయోలాజికల్ అత్యవసర పరిస్థితుల విషయంలో సన్నద్ధత , స్పందన చర్యలు
డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ (డిహెచ్ ఆర్) వారి పథకం కింద దేశవ్యాప్తంగా 138 బయోసేఫ్టీ పరిశోధన శాలలను ఏర్పాటు చేయడం జరిగింది. మహమ్మారుల నియంత్రణకు, ప్రకృతి విపత్తలును ఎదుర్కోవడానికి దేశవ్యాప్త నెట్ వర్క్ ఏర్పాటు చేయడం జరుగుతోంది.
అన్ని బయోసేఫ్టీ లేబరెటరీలు ప్రత్యేకించి బిఎస్ ఎల్ -4, బిఎస్ ఎల్ 3 ఐసిఎంఆర్ లో , నెట్ వర్క్ లేబరెటరీలలో ఏర్పాటు చేయడం జరిగింది. నెట్ వర్క్ లేబరెటరీలకు బయోసేఫ్టీ లేబరెటరీ నిర్వహణలో
శిక్షణ ఇవ్వడం జరిగింది.
Posted On:
05 AUG 2022 5:41PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన మార్గనిర్దేశం, అవసరమైన సదుపాయాలకు సంబంధించి తగిన మద్దతునిస్తుంది. సమీకృత వ్యాధి నిఘాకార్యక్రమాన్ని రాష్ట్రాలు, జిల్లా యూనిట్ల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీనిని వికేంద్రీకృత విధానంలో మహమ్మారికి దారితీసే వ్యాధులను కనుగొని అందుకు సంబంధించి తొలి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. దీనివల్ల చురుకైన ప్రజారోగ్య కార్యాచరణకు వీలు కలుగుతుంది. ఇది దేశంలో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపకరస్తుంది.
ఆరోగ్యసంబంధిత అత్యవసరాల కు సంబంధించి సన్నద్ధత, స్పందనకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ 2008లో బయోలాజికల్ విపత్తుల విషయంలో సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ( ఈ మార్గదర్శకాలు https://ndma.gov.in/sites/default/files/PDF/Guidelines/biological_disasters.pdf లింక్ లో అందుబాటులో ఉన్నాయి.).
దీనికితోడు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ , నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్లాన్ 2019ని విస్తృతంగా ప్రచారంలో పెట్టింది. ఇది బయోలాజికల్ అత్యవసరాల సమయంలో సన్నద్ధత, స్పందన కార్యక్రమాలకు సంబంధించి ఎవరి పాత్ర ఏమిటి, బాధ్యతలు ఏమిటన్నదానిపై ప్రణాళిక, వివరణలను జారీచేసింది.
డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి) నుంచి అందిన సమాచారం ప్రకారం డిబిటి, వివిధ రిస్కు గ్రూపులకు సంబంధించి ఇన్ఫెక్టివ్ సూక్ష్మజీవుల జాబితా, 2021"ని తెలియజేసింది, ఇది వివిధ రిస్క్ గ్రూప్‌లకు సంబంధించిన ఇన్ఫెక్టివ్ సూక్ష్మజీవుల జాబితాను అందించి, కార్యాచరణ పద్ధతిని నిర్ణయిస్తుంది. కనీస భౌతిక నియంత్రణ అవసరాలు ,తదనుగుణంగా, తగిన జీవ భద్రత స్థాయి సౌకర్యాల ఎంపికకు అనుమతిస్తుంది. ఇందుకు సంబంధించిన జాబితాను ఇక్కడ చూడవచ్చు.https://dbtindia.gov.in/sites/default/files/Updated%20Risk%20Group13122021.pdf .
దీనికితోడు దేశవ్యాప్తంగా డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ (డిహెచ్ ఆర్ ) పథకం కింద 138 బయో సేఫ్టీ లేబరెటరీలను ఏర్పాటు చేయడం జరిగింది.మహమ్మారుల నియంత్రణ, విపత్తులను ఎదుర్కొవడానికి దేశవ్యాప్త లేబరెటరీల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసిఎంఆర్)కు అద్భుతమైన లేబరెటరీ మౌలిక సదుపాయాలు ఉ న్నాయి. ఇది దేశానికి బయోసేఫ్టీ కల్పించడం, బయో సెక్యూరిటీ ముప్పును ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే కూడా ఇందుకు ఉపకరిస్తుంది.
డిబిటి "నియంత్రణ సౌకర్యాల స్థాపనకు మార్గదర్శకాలు: బయో సేఫ్టీ లెవెల్ 2 (BSL-2) & 3 (BSL-3) BSL-3 సదుపాయానికి సంబంధించి ధృవీకరణ , రీకాంబినెంట్ డిఎన్ ఎ పరిశోధన , బయోకంటైన్‌మెంట్ కోసం నిబంధనలు ,మార్గదర్శకాలు- 2017ను జారీచేసింది.
ఈ మార్గదర్శకాలు ,వివిధ అంతర్జాతీయ ఏజెన్సీలు రూపొందించిన జీవ భద్రత ప్రమాణాలను కలిగి ఉంటాయి.ఐసిఎంఆర్ లో నలకొల్పిన అన్ని బయోసేఫ్టీ లేబొరేటరీలు, ప్రత్యేకంగా బిఎస్ ఎల్-4 , బిఎస్ఎల్-3 , దాని నెట్‌వర్క్ లేబొరేటరీలు బయోసేఫ్టీ లేబొరేటరీ కార్యాచరణలో శిక్షణ కలిగి ఉన్నాయి.
ఐసిఎంఆర్-ఎన్ ఐవి,పూణె కీలక శాస్త్రవిజ్ఞాన సిబ్బంది కూడా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్,ప్రివెన్షన్ (సిడిసి) యు.ఎస్.ఎలో బయోసేఫ్టీ కార్యకలాపాలపై శిక్షణ పొందారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవిణ్ పవార్ లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
***
(Release ID: 1849407)
Visitor Counter : 84