ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూల‌నా కార్య‌క్ర‌మం (ఎన్ ఎల్ ఇ పి) కింది ముఖ్య కార్య‌క్ర‌మాలు


రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్య‌క్ర‌మం (ఆర్‌బిఎస్‌కె0 కింద 0నుంచి 18 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు కుష్ఠువ్యాధి నిర్ధ‌ర‌ణ ప‌రిక్ష‌ల‌ను చేప‌ట్ట‌డంతో పాటు, ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం కింద 30 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారిలో కుష్ఠువ్యాధికి సంబంధించి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది.

డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ హెల్త్ స‌ర్వీసెస్ వారి సెంట్ర‌ల్ లెప్ర‌సీ డివిజ‌న్ లెక్క‌ల ప్ర‌కారం, 2022 , మే 31 నాటికి దేశ‌వ్యాప్తంగా మొత్తం 72,914 మంది కుష్ఠువ్యాధిగ్ర‌స్తులు చికిత్స‌పొందుతున్నారు.

Posted On: 05 AUG 2022 5:43PM by PIB Hyderabad

 

భార‌త ప్ర‌భుత్వం జాతీయ కుష్ఠు నిర్మూల‌నా కార్య‌క్ర‌మం (ఎన్ ఎల్ ఇ పి)ని అమ‌లు చేస్తోంది. భార‌త‌దేశాన్ని కుష్ఠు వ్యాధి ర‌హిత దేశంగా తీర్చిదిద్దే ల‌క్ష్యంతో ఈ కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తున్న‌ది. ఎన్ ఎల్ ఇ పి కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత కార్య‌క్ర‌మం. జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్ హెచ్ ఎం)కింద దీనిని అమ‌లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అన్ని రాష్ట్రాలు,
కేంద్ర పాలిత ప్రాంతాల‌లో అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది.

ఈ కార్య‌క్ర‌మ ప్ర‌ధాన ఉద్దేశం , కుష్ఠు వ్యాధి కేసుల‌ను ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించ‌డం, వారికి పూర్తి చికిత్స‌ను ఉచితంగా అందించ‌డం ద్వారా వైక‌ల్యం క‌ల‌గ‌కుండా చూడ‌డం.
ఎన్ ఎల్ ఇపి కింద చేప‌ట్టిన ప్ర‌ధాన చ‌ర్య‌లు కింది విధంగా ఉన్నాయి.
1. కుష్ఠు వ్యాధి కేసులు ఎక్కువ గాఉన్న జిల్లాల‌లో కుష్‌ఠు వ్యాధి నిర్ధార‌ణ ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌డం
2. కుష్ఠువ్యాధికి సంబంధించి త‌క్కువ కేసులు ఉన్న జిల్లాల‌లో కుష్ఠువ్యాధిపై ప్ర‌త్యేక ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌డం
3. ,చేరుకోవ‌డానికి క‌ష్ట‌త‌ర‌మైన ప్రాంతాలలో ప్రాథ‌మిక ద‌శ‌లోనే కుష్ఠువ్యాధిని క‌నుగొని, వ్యాధిగ్ర‌స్తుల‌కు త‌గిన చికిత్స అందించేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించ‌డం
4. కుష్ఠు వ్యాధికి సంబంధించిన అనుమానితుల విష‌యంలో ఎ.ఎస్‌.హెచ్‌.ఎ ఆధారిత నిఘా (ఎబిఎస్‌యుఎల్ఎస్‌)
5. స్ప‌ర్శ్ కుష్ఠువ్యాధి చైత‌న్య‌కార్య‌క్ర‌మం ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 30 న నిర్వ‌హిస్తారు.

6. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో క్రియాశీల కేసుల గుర్తింపు ,నిఘా
7. రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్య‌క్ర‌మం (ఆర్ బిఎస్ కె) కింద0-18 ఏళ్ల లోపు వారికి కుష్ఠువ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం,  30 సంవత్స‌రాల పైబ‌డిన వారికి ఆయుష్మాన్‌భార‌త్ కార్య‌క్ర‌మం కింద ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం
8. ఈ కార్య‌క్ర‌మం ప‌ర్య‌వేక్ష‌ణ‌ను జాయింట్ మానిట‌రింగ్, ఇన్వెస్టిగేష‌న్‌, అడ్వ‌యిజ‌రీ గ్రూప్ (జెఎంఐఎజి) ద్వారా ప‌ర్య‌వేక్షిస్తారు.
9. కుష్ఠు వ్యాధి నిర్మూల‌న‌ను సాధించిన జిల్లాల‌కు ప‌నితీరు ఆధారిత ప్రోత్సాహ‌కాలు, స‌ర్టిఫికెట్‌ప్ర‌దానం ఉంటాయి.
10. వ్యాధి కాంటాక్ట్ ల‌ను గుర్తించ‌డం, వ్యాప్తి చైన్‌కు అంతరాయం కలిగించడానికి ఇండెక్స్ కేసుకు రిఫాంపిసిన్ (SDR)  సింగిల్ డోస్‌తో పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (PEP) అందించబడుతుంది.

దీనికితోడు 12 పాకెట్ల మ‌ల్టీ డ్ర‌గ్ థెర‌పీ (ఎం డిటి) బ్లిస్ట‌ర్ పాక్‌ల‌ను మ‌ల్టీ బాసిల‌రీ లెప్ర‌సీ కేసుల వారికి ప్ర‌మాణీకృత చికిత్సా ప్రొటోకాల్ ప్ర‌కారం ఇవ్వ‌డం జ‌రుగుతుంది.
జాతీయ స్థాయిలో ప్రతి 10,000 జనాభాకు 1 కేసు కంటే తక్కువ ఉండాల‌న్న‌  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ 2005 నాటి ప్రమాణాల ప్రకారం కుష్టు వ్యాధిని ఒక ప్రజారోగ్య సమస్యగా భారతదేశం నిర్మూలించింది. అయినప్పటికీ, కుష్టు వ్యాధి ఇప్పటికీ ఆయా రాష్ట్రాల‌లోని కొన్ని జిల్లాల‌లో ఉంది.
డైర‌క్ట‌ర్‌జ‌న‌ర‌ల్ ఆఫ్ హెల్త్ స‌ర్వీసెస్ వారి  కేంద్ర కుష్ఠువ్యాధి డివిజ‌న్ లెక్క‌ల ప్ర‌కారం 2022 మే 31 నాటికి దేశ‌వ్యాప్తంగా 72,914 కుష్ఠువ్యాధి పేషెంట్లు ఉన్న‌ట్టు ఆయా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు నివేదించాయి.
కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్‌ప‌వార్ ఈ విషయాన్ని లోక్‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.

***



(Release ID: 1849395) Visitor Counter : 112


Read this release in: English , Urdu