ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్ ( ఏఎంఆర్ ) ద్వారా ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడానికి అమలు చేస్తున్న చర్యలు ఏఎంఆర్


ఐసీఎంఆర్ నిర్వహిస్తున్న ఆసుపత్రుల వార్డులు, ఐసీయూలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం, అధిక మోతాదులో వినియోగించకుండా చూసేందుకు 20 ప్రాంతీయ సంరక్షణ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా యాంటీబయాటిక్ స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రామ్ (AMSP) అమలు

Posted On: 05 AUG 2022 5:35PM by PIB Hyderabad
భారతదేశ యాంటీ-మైక్రోబియల్ రెసిస్టెన్స్ ( ఏఎంఆర్  ) వల్ల  ఎదురయ్యే సవాళ్ళను ప్రభుత్వం గుర్తించింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ క్రింది చర్యలను అమలు చేస్తున్నది. 
1. రాష్ట్ర వైద్య కళాశాలలో ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఏఎంఆర్  పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది.  ఈ వ్యవస్థలో ఇంతవరకు 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో  36 కేంద్రాలను తీసుకు రావడం జరిగింది. 
2.  ఒకే విధమైన ఆరోగ్య సంరక్షణ విధానానికి రూపకల్పన చేయాలన్న  యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎన్ఏ - ఏఎంఆర్  ) నియంత్రణపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఏప్రిల్ 2017 లో ప్రారంభించబడింది. ప్రణాళిక అమలులో సంబంధిత మంత్రిత్వ శాఖలు/ విభాగాల సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఏఎంఆర్ నియంత్రణలో సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖల మంత్రులు  ఏఎంఆర్  ఢిల్లీ డిక్లరేషన్  పై  ఏకాభిప్రాయం తో సంతకం చేశారు.
3.. ఏఎంఆర్ పర్యవేక్షణ వ్యవస్థ :: దేశంలో ఔషధ వాడకం వల్ల సోకుతున్న ఇన్‌ఫెక్షన్‌ల వివరాలు,ప్రభావాలు  మరియు నమూనాలను సేకరించేందుకు  ప్రైవేట్ మరియు ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేస్తున్న తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో   ఏఎంఆర్  నిఘా మరియు పరిశోధనా నెట్‌వర్క్ (AMRSN)ని ఏర్పాటు చేసింది.

4. ఏఎంఆర్   పరిశోధన,  అంతర్జాతీయ సహకారం:   ఏఎంఆర్  లో వైద్య పరిశోధనలను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారాల ద్వారా కొత్త మందులు/ఔషధాలను అభివృద్ధి చేసేందుకు ఐసీఎంఆర్    చర్యలు చేపట్టింది.

• రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ నార్వే (RCN)తో కలిసి ఐసీఎంఆర్    2017లో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై పరిశోధన కోసం ఉమ్మడి కార్యాచరణకు పిలుపునిచ్చింది.
•    ఏఎంఆర్   పై పరిశోధన చేపట్టేందుకు కోసం జర్మనీ  జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ల మధ్య  ఇండో-జర్మన్ సహకార ఒప్పందం అమలులో ఉంది.
యాంటీబయాటిక్స్ దుర్వినియోగం గురించి అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం క్రింది కార్యక్రమాలు చేపట్టింది:
 
a. హాస్పిటల్ వార్డులు మరియు ఐసీయూలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం మరియు మితిమీరిన వినియోగాన్ని నియంత్రించడానికి ఐసీఎంఆర్  భారతదేశంలో 20 తృతీయ సంరక్షణ ఆసుపత్రులలో పైలట్ ప్రాజెక్ట్ గా  యాంటీబయాటిక్ స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రామ్ (AMSP)ని ప్రారంభించింది.
b.సక్రమంగా పనిచేయని  40 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌లను డీసీజీఐ  నిషేధించింది.
c.  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ మరియు ఫిషరీస్ మరియు డీసీజీఐ  సహకారంతో కోలిస్టిన్‌ను పౌల్ట్రీలో పశుగ్రాసంలో వృద్ధి ప్రమోటర్‌గా ఉపయోగించడాన్నిఐసీఎంఆర్  నిషేధించింది.
d.పాఠశాలలు, కళాశాలలు మరియు ఆరోగ్య మేళాలలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC)  సమావేశాలు , పోస్టర్ మరియు క్విజ్ పోటీలు వంటి వివిధ ఐసీఐ  కార్యకలాపాలు ద్వారా  ఏఎంఆర్,  ఏఎంఆర్   నియంత్రణ నివారణ మరియు యాంటీబయాటిక్స్ సక్రమ  వినియోగం గురించి సాధారణ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. .
e.  ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేస్తున్న వారికి  అవగాహన పెంచడానికి, వైరల్-అనారోగ్య సమయంలో యాంటీబయాటిక్స్ సహేతుక వినియోగం మరియు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చేతి పరిశుభ్రత వంటి చర్యల ద్వారా ఇన్ఫెక్షన్ నివారణపై దృష్టి సారించేలా కమ్యూనికేషన్ మెటీరియల్ పోస్టర్లు, వీడియోలు మరియు రేడియో జింగిల్స్‌తో కూడిన కార్యక్రమాలు అభివృద్ధి చేయబడ్డాయి.  .
 
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

(Release ID: 1848960) Visitor Counter : 140


Read this release in: English , Urdu