రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
04 AUG 2022 1:07PM by PIB Hyderabad
రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఐడిటిఆర్ ల ఏర్పాటు కోసం రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తన పథకం కింద ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ( ఐడిటిఆర్) మంజూరు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన ఐడిటిఆర్(లు)తో సహా 5 కోట్ల జనాభాకు ఒక ఐడిటిఆర్ అనే ప్రమాణాల ప్రకారం రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో మరిన్ని ఐడిటిఆర్ లను ఏర్పాటు చేయడానికి 15వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్ వ్యవధిలో పథకాన్ని కొనసాగించింది. జనాభా ప్రమాణాల ప్రకారం, బీహార్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ .. ఈ 6 రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘం వ్యవధిలో కొత్త ఐడిటిఆర్ ల ఏర్పాటుకు అర్హత పొందాయి.
పథకం కింద ఉన్న నిబంధనల ప్రకారం ఐడిటిఆర్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూమి వివరాలతో సహా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కి ఈ పథకం కింద ప్రతిపాదన సమర్పించింది.
రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మూలధన పెట్టుబడిలో 100% ఏక విడత సహాయాన్ని అందిస్తుంది, ఈ క్రింది వివరాల ప్రకారం ఐడిటిఆర్ కి గరిష్టంగా రూ.17.25 కోట్లకు లోబడి ఉంటుంది:
i. సివిల్ నిర్మాణం : రూ. 14 కోట్లు
ii .ఆఫిస్, వర్క్ షాప్ పరికరాలు: రూ. 0.75 కోట్లు
iii.వాహనం సిమ్యులేటర్ : రూ.2.50 కోట్లు
ప్రాజెక్ట్ భౌతిక పురోగతి ప్రకారం ఆర్థిక సహాయాన్ని వాయిదాలలో విడుదల చేయడానికి పథకం అవకాశం ఇస్తుంది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా మంజూరైన కేంద్ర సహాయంలో 20%కి సమానమైన మొత్తాన్ని విడుదల చేయడానికి పథకం వల్ల ఆస్కారం ఉంది. మునుపటి ఇన్‌స్టాల్‌మెంట్‌కు వ్యతిరేకంగా యుటిలైజేషన్ సర్టిఫికేట్, పని భౌతిక పురోగతిపై తదుపరి వాయిదాలు విడుదల అవుతాయి. మంజూరైన ఆర్థిక సహాయంలో 15%కి సమానమైన చివరి విడత ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, యుటిలైజేషన్ సర్టిఫికేట్, ముగింపు నివేదికను స్వీకరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌గా విడుదల చేస్తారు. పథకం కింద నిధుల దుర్వినియోగం గురించి మంత్రిత్వ శాఖ దృష్టికి రాలేదు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా 15వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్ వ్యవధిలో రీజనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్ డి టి సి) ఏర్పాటు పథకాన్ని కొనసాగించింది. 2.50 కోట్ల జనాభాకు ఒక ఆర్ డి టి సి ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
(రిలీజ్ ఐడి: 1848841)
సందర్శకుల సూచీ సంఖ్య : : 158