ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

హెచ్ ఎమ్ఐఎస్/ఎల్ ఎం ఐఎస్ వంటి ఎబిడిఎమ్ కంప్లైంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ను అక్రిడేట్ చేసేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ)తో చేతులు కలిపిన నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ఎ)


వివిధ పరామీటర్లపై ఏ బి డి ఎం ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సొల్యూషన్ లను అక్రిడేట్, రేట్ చేయనున్న ఎన్ ఎ బి హెచ్ , క్యు సి ఐ : సంభావ్య కొనుగోలుదారుడు (ఆసుపత్రి/ల్యాబ్) సమాచారాంతర నిర్ణయం/ఎంపిక చేసుకోవడానికి దోహదం

Posted On: 04 AUG 2022 6:12PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)తో అనుసంధానమైన హెచ్ఎంఐఎస్ (హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)/ ఎల్ఎంఐఎస్ (లేబొరేటరీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) పరిష్కారాలకు గుర్తింపు ఇవ్వడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ) క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ని ఆరు నెలల పాటు ఆన్ బోర్డ్ చేసింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ ఎబిహెచ్), క్యూసిఐ కి భాగస్వామ్య బోర్డు ఆరోగ్య సంరక్షణ రంగంలో జాతీయ అక్రిడిటేషన్ కు బాధ్యత వహిస్తుంది. వినియోగ సౌలభ్యం, యూజర్ ఇంటర్ ఫేస్, ధర, మాడ్యూల్స్/ఫీచర్ల సంఖ్య ,డబ్బు/ధరతో సహా వివిధ పరామీటర్లపై బి డి ఎం కంప్లైంట్ సొల్యూషన్ లను అక్రిడిటేషన్ చేయడం , రేటింగ్ చేసే బాధ్యతను ఎన్ బి హెచ్ చేపడుతుంది, తద్వారా సంభావ్య కొనుగోలుదారులు విశ్వసనీయమైన సమాచారాన్ని పొందవచ్చు.

 

చొరవ యొక్క ఉద్దేశ్యం గురించి డాక్టర్ ఆర్.ఎస్. శర్మ, సి , ఎన్ హెచ్ మాట్లాడుతూ, " బి డి ఎం తో, ఆరోగ్య సాంకేతిక సేవల డెలివరీని గణనీయమైన రీతిలో క్రమబద్ధీకరించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. హెల్త్ కేర్ సొల్యూషన్ లు అక్రిడిటేషన్రేట్ చేయబడ్డాయని , ఒక పరిష్కారాన్ని మరోదానిపై ఎంచు కోవడానికి వినియోగదారులకు తగినంత సమాచారం లభ్యం అయ్యేలా ధృవీకరించడం కోసం మేం ఒక ఫ్రేమ్ వర్క్ ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దీని కోసం, మేము ఒక సమీక్షా ప్రణాళికను అభివృద్ధి చేయడానికి , రాబోయే ఆరు నెలల్లో బి డి ఎం తో విజయవంతంగా ఇంటిగ్రేట్ చేయబడిన కనీసం 10 హెచ్ ఎం ఎస్  పరిష్కారాల (పబ్లిక్ -ప్రైవేట్) అక్రిడిటేషన్ , సమీక్షను పూర్తి చేయడానికి క్యు సి తో భాగస్వామ్యం నెరపుతున్నాము.‘‘

అన్నారు.

 

సి ఛైర్మన్ శ్రీ ఆదిల్ జైనుల్ భాయ్  చొరవ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, " ఎన్ హెచ్ తన డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా భారతదేశంలో ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రాప్యతను విప్లవాత్మకంగా మారుస్తున్న విధానం ఎంతో అసాధారణమైనది. ఆసుపత్రులు, ల్యాబ్ లు ,క్లినిక్ నిర్వహణ కోసం బి డి ఎం కింద సాఫ్ట్ వేర్ సొల్యూషన్ అక్రిడిటేషన్ కు కార్యక్రమం భారతదేశంలో హెల్త్ టెక్ కు ఒక పెద్ద అడుగు.

కార్యక్రమాన్ని రూపొందించడంలో క్యు సి , ఎన్ బి హెచ్ లు ఎన్ హెచ్ ఎతో చేతులు కలపడం సంతోషాన్ని కలిగిస్తోంది. అక్రిడేటెడ్ హెల్త్ టెక్ సొల్యూషన్స్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు తమ రోగి ప్రయాణాలుకార్యకలాపాలను బి డి ఎం ప్రమాణాలకు అనుగుణంగా మరింత క్రమబద్ధంగా నిర్వహించడానికి సహాయపడతాయి. అంతిమంగా, చొరవ భారతదేశ పౌరులు మరింత మెరుగ్గా ,సకాలంలో ఆరోగ్య సంరక్షణ పొందడానికి సహాయపడుతుంది. ఇంకా  ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను డిజిటలైజేషన్ చేయడంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయపడుతుంది.

 

అక్రిడిటేషన్ ప్రక్రియ దశలవారీగా నిర్వహించబడుతుంది. ఫేజ్ I,

బి డి ఎం టి విజయవంతంగా ఇంటిగ్రేట్ చేయబడ్డ హెచ్ ఎం ఎస్ సొల్యూషన్ అక్రిడిటేషన్ , రేటింగ్ పై దృష్టి సారిస్తుంది. తదుపరి దశల్లో ఎల్ ఎం ఎస్, హెల్త్ లాకర్ లు, హెల్త్ టెక్, పి హెచ్ ఆర్ (పర్సనల్ హెల్త్ రికార్డ్స్) యాప్ లు మొదలైన ఇతర సబ్జెక్టివ్ పరామీటర్ లు ,ఇతర కేటగిరీల హెల్త్ కేర్ సొల్యూషన్ లు చేర్చబడతాయి.

 

చొరవలో భాగంగా, ఎన్ బి హెచ్, సి తమ బి డి ఎం ఇంటిగ్రేషన్ ని విజయవంతంగా పూర్తి చేసిన వివిధ కేటగిరీల ప్రొడక్ట్ (ఉదా. హెచ్ ఎం ఎస్, ఎల్ ఎం ఎస్, హెల్త్ లాకర్ మొదలైనవి) అంతటా డిజిటల్ హెల్త్ సొల్యూషన్ కోసం ఒక అక్రిడిటేషన్ స్టాండర్డ్ ని అభివృద్ధి చేయడానికి డిజిటల్ హెల్త్ ఎక్స్ పర్ట్ లను ఆన్ బోర్డ్ చేస్తుంది.సమీక్షా పరామీటర్ల కోసం టెస్ట్ ఎన్విరాన్ మెంట్ ఎన్ హెచ్ ద్వారా అందించబడుతుంది. పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ లు, సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ లు, ఆసుపత్రులు, ల్యాబ్ లు, హెల్త్ కేర్ అగ్రిగేటర్లు మొదలైన దరఖాస్తుదారులు అక్రిడిటేషన్ పొందాలనుకునేవారు అక్రిడిటేషన్ ప్రమాణాలు ,ఎబిడిఎమ్ ఆవశ్యకతలకు అనుగుణంగా తమ 'అక్రిడిటేషన్ అప్లికేషన్'ని ఎన్ బి హెచ్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 

ఖరారు అయిన అక్రిడిటేషన్ ప్రమాణాలపై (ఆరోగ్య సంరక్షణ సాఫ్ట్ వేర్ ఎకోసిస్టమ్ లో అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా అదేవిధంగా ఎన్ హెచ్   ద్వారా అందించబడ్డ సాంకేతిక ప్రమాణాల సూచనాత్మక జాబితా ఆధారంగా) పరిష్కారాలు సమీక్షించబడతాయి  క్యు సి ద్వారా భాగస్వామ్య నిపుణుల స్వతంత్ర బృందం తరువాత గుర్తింపు పొందిన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలకు రేటింగ్ ఇస్తుంది ఇంకా వారి నిర్వహణ పరమైన పనితీరు, మార్గదర్శకాలకు అనుగుణంగా కనీస ఆచరణీయ ఆవశ్యకతలను పాటించడం, ప్రమాణాల నిర్వహణ ,వినియోగదారు అనుభవం కోసం వాటిని నియతానుసారంగా పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ ని కూడా సబ్మిట్ చేయగలరు, ఇది రేటింగ్ మెకానిజంకు జోడించబడుతుంది. వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ ని కూడా సబ్మిట్ చేయగలరు, ఇది రేటింగ్ మెకానిజంకు జోడించబడుతుంది. పరిష్కారాల కోసం రేటింగ్ లు ,రివ్యూ లను  క్యు సి ద్వారా సిఫారసు చేయబడ్డ ప్లాట్ ఫారంతో పాటుగా బి డి ఎం వెబ్ సైట్ పై పబ్లిష్ చేస్తారు.

 

చొరవతో, అదే కేటగిరీ కిందకు (హెచ్ ఎమ్ ఎస్, ఎల్ ఎమ్ ఎస్, హెల్త్ లాకర్, హెల్త్ టెక్ మొదలైనవి).వచ్చే ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను పోల్చడం ద్వారా సంభావ్య కొనుగోలుదారుడు ఒక వివేచనాత్మక నిర్ణయం తీసుకో గలగడం ఎన్ హెచ్ లక్ష్యంగా పెట్టుకుంది. క్యు సి అనేది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడ్డ ,గుర్తింపు పొందిన ఉత్పత్తులు, సేవలు ,ప్రక్రియల తృతీయపక్ష మదింపు కోసం విశ్వసనీయమైన, నమ్మకమైన యంత్రాంగాన్ని అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ వాణిజ్య ,పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటయిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.

 

బి ది ఎం కంప్లైంట్ డిజిటల్ హెల్త్ కేర్ పరిష్కారాలపై మరిన్ని వివరాలు ఇక్కడ లభ్యం అవుతాయి: https://abdm.gov.in/our-partners

 

****



(Release ID: 1848772) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Hindi