ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మూడేళ్లలో 16.67కోట్ల రుణ ఖాతాలకు రూ. 9.98లక్షల కోట్లు మంజూరు!


కోటీ 12లక్షల అదనపు ఉపాధి
అవకాశాల కల్పనలో
పి.ఎం.ఎం.వై. కీలకపాత్ర

Posted On: 02 AUG 2022 7:39PM by PIB Hyderabad

     ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శక సూత్రాల ప్రకారం, ఎవరైనా వ్యక్తి, రుణం తీసుకోవడానికి అర్హతలు కలిగి ఉండి, ఏదైనా వ్యవసాయేతర వ్యాపార ప్రణాళికను కలిగి ఉన్నపక్షంలో, అలాంటి వారికి,.. ప్రధానమంత్రి ముద్రా యోజన (పి.ఎం.ఎం.వై.) కింద రుణం పొందడానికి అర్హత ఉంటుంది. తయారీ రంగం, వాణిజ్యం, సేవారంగం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, వంటి ఆదాయం ఉత్పాదక రంగాల్లో వారు రూ. 10లక్షల వరకూ రుణం తీసుకోవడానికి అర్హత, అవకాశం ఉంటుంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావు కరాడ్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.

   పి.ఎం.ఎం.వై. పథకం కింద రుణాలను మూడు కేటగిరీల వారికి అందిస్తారని మంత్రి తెలిపారు. శిశు కేటగిరీలో (రూ. 50,000 వరకూ రుణాలు), కిశోర్ కేటగిరిలో (రూ. 50,000నుంచి రూ. 5లక్షల వరకూ), తరుణ్ కేటగిరిలో (రూ. 5లక్షల పైచిలుకునుంచి రూ. 10లక్షల వరకూ) రుణాలు అందిస్తారన్నారు.  పి.ఎం.ఎం.వై. పథకం కింద అందించే రుణాలపై మరిన్ని వివరాలను కేంద్రమంత్రి తెలిపారు. ఈ రుణాలపై గత 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ కింది వివరాలను ఆయన తెలియజేశారు.

 

ఆర్థిక సంవత్సరం

రుణఖాతాల సంఖ్య (కోట్లలో)

మంజూరైన మొత్తం (లక్షల కోట్లలో)

2019-20

6.22

3.37

2020-21

5.07

3.22

2021-22

5.38

3.39

మొత్తం

16.67

9.98

ఇక, పి.ఎం.ఎం.వై. పథకం కింద జాతీయ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఉపాధి కల్పనా అవకాశాలను గురించి అంచనా వేసేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నమూనా సర్వేని నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. సర్వే అందించిన ఫలితాల ప్రకారం, దాదాపు 3 సంవత్సరాల వ్యవధిలో (అంటే,.. 2015నుంచి 2018వరకూ) నికరంగా కోటీ 12లక్షల అదనపు ఉపాధి అవకాశాలను కల్పించినట్టు తేలింది. 

  ముద్రా పథకం కింద ఏర్పాటైన సంస్థల్లో జరిగిన అదనపు ఉపాధి కల్పనలో శిశు కేటగిరీ రుణాల పాత్ర 66శాతం వరకూ ఉన్నట్టు  సర్వేలో తేలిందని కేంద్రమంత్రి తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో కిశోర్ కేటగిరీ రుణాలు (19శాతం), తరుణ్ కేటగిరి రుణాలు (15శాతం) ఉన్నాయని ఆయన తెలిపారు. 2022 జూలై ఒకటవ తేదీ వరకూ, .. పి.ఎం.ఎం.వై. పథకం అమలు మొదలైన నాటినుంటి ఆ పథకం కింద కొత్త ఔత్సాహిక వ్యాపారవేత్తలకు, ఖాతాలకు రూ. 6.12కోట్ల మొత్తానికి సంబంధించి 7.66కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయినట్టు తెలిపారు. అయితే, పి.ఎం.ఎం.వై. పథకం కింద ఏర్పడిన ఉపాధి అవకాశాలకు సంబంధించి కేంద్రీయ స్థాయి సమాచారాన్ని మాత్రం నిర్వహించలేదని ఆయన తెలిపారు.   రుణదాతా సంస్థలు ముద్రా పోర్టల్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం,..  వివిధ కేటగిరీలవారీగా, దేశవ్యాప్తంగా మంజూరైన పి.ఎంఎం.వై. రుణాల వివరాలను మంత్రి  తెలియజేశారు. 2022 జూలై ఒకటవ తేదీనాటికి వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. :-

 

రుణ ఖాతాల సంఖ్య (కోట్లలో)

 

జనరల్

17.59

 

ఎస్.సి.

6.10

 

ఎస్.టి.

2.06

 

ఒ.బి.సి.

10.13

 

భారతదేశంలో మొత్తం

35.88

 

పై వారిలో

మైనారిటీలు

3.99

 

 

ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు

 

24.54

 

   రిజర్వ్ బ్యాంకు (ఆర్.బి.ఐ.) సమాచారం ప్రకారం 2022 జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 1,107 ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు. ఇక, దేశంలోని గ్రామీణ ప్రజల్లో ఔత్సాహిక, వాణిజ్య, పారిశ్రామిక తత్వాన్ని అలవర్చేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను ఈ ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలు నిర్వహిస్తాయి. దీనికి తోడు, గ్రామీణ యువతలో నైపుణ్యాల నవీకరణ, పారిశ్రామిక, వాణిజ్య తత్వం అభివృద్ధి వంటి కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహిస్తాయి. తమకు అనుబంధించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థల ద్వారా (ఆర్.ఎస్.ఇ.టి.ఐ.ల ద్వారా) బ్యాంకులు ఈ శిక్షణను అందిస్తాయి.

  గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి.ల) సభ్యులకు నైపుణ్యాల నవీకరణ కార్యక్రమాలను జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ప్రోత్సహిస్తూ వస్తోందని మంత్రి తెలిపారు. మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు (ఎం.ఇ.డి.పి.లు), లైవ్లీహుడ్-ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల (ఎల్.ఇ.డి.పి.ల) ద్వారా  నాబార్డ్ ఈ పథకాలను ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. స్వయం సహాయక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ స్థాయి సంస్థలు ప్రారంభిచేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

   వ్యవయాయేతర రంగాల్లో గ్రామీణ పేదవర్గాల వారు గ్రామస్థాయిలో సంస్థలను ఏర్పాటు చేసేందుకు తగిన సహాయం అందించడానికి స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ కార్యక్రమాన్ని (ఎస్.వి.ఇ.పి.ని) అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. దినదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (డి.ఎ.వై.-ఎన్.ఆర్.ఎల్.ఎం.) పథకం పరిధిలో ఉప పథకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 

 

***


(Release ID: 1848756) Visitor Counter : 144


Read this release in: English , Urdu