జల శక్తి మంత్రిత్వ శాఖ

బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు

Posted On: 04 AUG 2022 6:04PM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీన్) [ఎస్బిఎం (జి)] అక్టోబర్ 2, 2014 న ప్రారంభించబడిందిఈ కార్యక్రమం ద్వారా అక్టోబర్ 02, 2019 నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్గా మార్చాలన్న లక్ష్యంతో అన్ని గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్లను అందించడం  ప్రారంభించబడింది. కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో అన్ని రాష్ట్రాలు/యూటీలు ప్రత్యేక సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ మరియు జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్. గ్రామ స్థాయిలో జీపీ లేదా దాని ఉప-కమిటీ అంటే గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ కార్యక్రమం అమలుకు బాధ్యత వహిస్తుంది. ముఖ్య వనరుల కేంద్రాలు, డెవలప్‌మెంట్ పార్టనర్‌లు, మాస్టర్ ట్రైనర్‌లు మొదలైనవాటి ద్వారా డ్రింకింగ్ వాటర్ మరియు శానిటేషన్ శాఖ మరియు రాష్ట్రాలచే కార్యకర్తలకు శిక్షణ ఇవ్వబడింది. ఓడీఎఫ్ ఫలితాన్ని సాధించడం ద్వారా ఈ కార్యక్రమం 2020-21 నుండి 2024-25 వరకు దీని రెండో దశగా కొనసాగుతోంది.ఓడీఎఫ్ స్థితి స్థిరత్వంపై దృష్టి సారించడం మరియు అన్ని గ్రామాలను ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణతో కవర్ చేయడం అనగా 2024-25 నాటికి గ్రామాలను ఓడీఎఫ్‌ నుండి ఓడీఎఫ్‌ ప్లస్‌గా మార్చడం. ఫేజ్-II అమలకు ప్రోగ్రామ్  ఫేజ్-కింద రాష్ట్రం/జిల్లా/జీపీ స్థాయిలో ఏర్పాటు చేయబడిన సంస్థాగత నిర్మాణం కొనసాగించబడింది.

 

అక్టోబర్ 02, 2019 నాటికి దేశంలోని అన్ని గ్రామాలు తమను తాము ఓడీఎఫ్గా ప్రకటించుకున్నాయి. ఎస్బీఎం (జి ఫేజ్-II కింద గ్రామాల ఓడీఎఫ్‌ స్థితిని కొనసాగించడం మరియు అన్ని గ్రామాల్లో ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఓడీఎఫ్‌ నుండి ఓడీఎఫ్‌ ప్లస్‌గా మార్చడం కోసం దేశంలోని అన్ని గ్రామాలను ఎస్బీఎం (జి ఫేజ్-II కింద కవర్ చేస్తున్నారు.

 

(ఆన్‌లైన్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎంఐఎస్)పై రాష్ట్రాలు నివేదించిన ప్రకారం ఎస్బీఎం (జికింద 11 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు మరియు 2.13 లక్షల కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు నిర్మించబడ్డాయి. అక్టోబర్ 2,2019వ తేదీ నాటికి అన్ని గ్రామాలు తమను తాము ఓడీఎఫ్గా ప్రకటించుకున్నాయి.  ఇంకా96,622 గ్రామాలు ఆగస్టు 01, 2022 వరకు తమను తాము ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించుకున్నాయి.

 

ఎస్బీఎం (జికింద భారత ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు మరియు గత మూడు సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరంలో వాటి వినియోగం క్రింది విధంగా ఉన్నాయి:

(రూ. కోట్లలో)

సంవత్సరం

కేటాయించిన

 నిధులు

వినియోగించిన నిధులు

2019-20

11938.22

11845.71

2020-21

6000.00

4947.92

2021-22

6000.00

3111.36

2022-23

7192.00

578.36

 

గ్రామాలన్నీ ఇప్పటికే ఓడీఎఫ్‌గా ప్రకటించుకున్నాయి.

ఈ రోజు లోక్‌సభలో కేంద్రసహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

***



(Release ID: 1848752) Visitor Counter : 117


Read this release in: English , Urdu