సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
డిజిటల్ పరిష్కారం
Posted On:
04 AUG 2022 1:00PM by PIB Hyderabad
ఉద్యమ్, ఇ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీసెస్ (ఎన్‌సిఎస్) పోర్టల్‌ను, ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీస్, ఎంప్లాయర్ మ్యాపింగ్ పోర్టల్‌ను (ఎఎస్ఇఇఎం) అనుసంధానం చేస్తామని 1 ఫిబ్రవరి 2022న గౌరవనీయ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రకటనలో పేర్కొన్నారు. వాటి పరిధి విస్తరిస్తుందని, ఇప్పుడు అవ్వి సజీవ, ఆర్గానిక్ డాటాబేస్ పోర్టళ్ళుగా పని చేస్తూ, ప్రభుత్వం నుంచి పౌరుడు (జి2సి), వ్యాపారం నుంచి వినియోగదారుడు (బి2సి), వ్యాపారం నుంచి వ్యాపారం (బి2బి) సేవలు అందిస్తాయి. ఈ సేవలు ఆర్ధిక వ్యవస్థను మరింత క్రమబద్ధీ కరించి, అందరికీ వ్యాపార అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో రుణాల సులువు చేయడం, స్కిల్లింగ్, నియామకాలకు సంబందించిన సేవలను అందిస్తుంది.
నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సిఎస్), ఇ-శ్రమ్, ఉద్యమ్, ఎఎస్ఇఇఎం పోర్టళ్ళ విలీనీకరణను సులభతరం చేయడానికి నోడల్ మంత్రిత్వ శాఖ అయిన ఎంఎస్ఎంఇ కిందఒక సలహా కమిటీని ఏర్పాటు చేసినట్టు కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేటి వరకు, ఎన్ సిఎస్ పోర్టల్, ఇ-శ్రమ్ పోర్టళ్ళ విలీనీకరణ పూర్తి అయింది.
అదనంగా, ఎంఎస్ఎంఇల డిజిటలైజేషన్‌ను పెంచేందుకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, జిఇఎం, టిఆర్ఇడిఎస్, ఎంఎస్ఎంఇమార్ట్. కామ్, ఎంఎస్ఎంఇ సంబంధ్, ఎంఎస్ఎంఇ సమాధాన్ పోర్టళ్ళ వంటి వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నడుపుతోంది. ఈ సమాచారాన్ని లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు గురువారం నాడు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారల సహాయ మంత్రి శ్రీభాను ప్రతాప్ సింగ్ వర్మ వెల్లడించారు.
***
(Release ID: 1848424)
Visitor Counter : 135