ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మోస‌పూరితంగా రూ.8 కోట్ల ఐటిసిని వినియోగించుకున్నందుకు ఒక‌రిని అరెస్టు చేసిన సిజిఎస్‌టి ఢిల్లీ వెస్ట్ అధికారులు

Posted On: 03 AUG 2022 8:18PM by PIB Hyderabad

ఒక హెచ్చ‌రిక ఆధారంగా, ఎం/ఎ స్ నియ‌తి స్టీల్స్‌కి వ్య‌తిరేకంగా సిజిఎస్‌టి ఢిల్లీ వెస్ట్ క‌మిష‌న‌రేట్ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. పైన పేర్కొన్న సంస్థ రోజువారీ లావాదేవీల‌ను, నిర్వ‌హ‌ణ‌ను తానే చూసుకుంటాన‌ని శ్రీ క‌ర‌ణ్ కుమార్ అగ‌ర్వాల్ అనే వ్య‌క్తి త‌న స్వ‌చ్ఛంద ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఉనికిలో లేని సంస్థ‌లను అడ్డుపెట్టుకుని పైన పేర్కొన్న సంస్థ రూ. 7.7 కోట్ల మేర‌కు ఐటిసిని వినియోగించుకుంది. 
మ‌రింత లోతైన ద‌ర్యాప్తు, విశ్లేష‌ణాత్మ‌క ఉప‌క‌ర‌ణాల‌ను ఉపయోగించ‌డం ద్వారా ఆరు సంస్థ‌లు శ్రీ క‌ర‌ణ్ కుమార్ అగ‌ర్వాల్‌తో లంకెను క‌లిగి ఉన్నాయ‌ని తెలుసుకున్నారు.  ఈ సంస్థ‌లు రూ. 292 కోట్ల విలువైన స‌రుకులేని ఇన్‌వాయిస్‌ల ద్వారా సంయుక్తంగా రూ. 52 కోట్ల మేర‌కు ఉనికిలో లేని సంస్థ‌ల నుంచి అర్హ‌త లేని/ అనుమ‌తించ‌లేని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను  వినియోగించుకున్నారు. ఈ 6 సంస్థ‌ల‌లోనూ ధ్రువీక‌ర‌ణ కోసం తాను త‌న ఆధార్‌ను ఉప‌యోగించి, ఇందులో కొన్ని సంస్థ‌ల‌లో స‌రుకును అందుకోకుండానే స‌రుకులేని ఇన్‌వాయిస్‌ల‌ను జారీ చేశాన‌ని శ్రీ క‌ర‌ణ్ కుమార్ అగర్వాల్ త‌న స్వ‌చ్ఛంద ప్ర‌క‌ట‌న‌లో అంగీక‌రించారు. దానితో పాటుగా, ఇన్‌వాయిస్‌ల ప‌న్నువిధించ‌ద‌గిన విలువ‌లో 3 నుంచి 4% క‌మిష‌న్ కోసం స‌రుకులేని ఇన్‌వాయిస్‌ల‌ను జారీ చేయ‌డంలో జోక్యాన్ని క‌లిగి ఉన్నాన‌ని అంగీక‌రించారు. 
 అర్హ‌త లేని/ అనుమ‌తించ‌లేని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను  వినియోగించుకోవ‌డంలో త‌న జోక్యాన్ని స్వ‌యంగా అంగీక‌రించడం, దానికి డాటా విశ్లేష‌ణ ధృవ ప‌రిచిన క్ర‌మంలో క‌ర‌ణ కుమార్ అగ‌ర్వాల్‌ను సిజిఎస్‌టి చ‌ట్టం, 2017లోని సెక్ష‌న్‌, రెడ్ విత్ సెక్ష‌న్ 69 కిందకు వ‌చ్చే నేరాల‌కు అరెస్టు చేయ‌గా, ఎల్‌డి. ఎసిఎంఎం కోర్టు అత‌డికి 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్‌ను విధించింది. 
త‌దుప‌రి ద‌ర్యాప్తు పురోగ‌మ‌నంలో ఉంది. 

***
 


(Release ID: 1848252) Visitor Counter : 174


Read this release in: English , Urdu , Hindi