ఆర్థిక మంత్రిత్వ శాఖ
వివో మొబైల్ ఇండియా ప్రై. లి. 2,217 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేతను డి ఆర్ ఐ (DRI) గుర్తించింది
Posted On:
03 AUG 2022 5:02PM by PIB Hyderabad
వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇకపై వివో ఇండియా’గా పిలుస్తారు) పై నిర్వహించిన విచారణ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దాదాపు రూ. 2,217 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేతను గుర్తించింది.
వివో మొబైల్ ఇండియా చైనా లోని గ్వాంగ్‌డాంగ్ కి చెందిన వివో కమ్యూనికేషన్ టెక్నాలజీ కం. లి., అనుబంధ సంస్థ. ఈ కంపెనీ తయారీ, అసెంబ్లింగ్, టోకు వాణిజ్యం అలాగే మొబైల్ హ్యాండ్‌సెట్‌లు మరియు ఉపకరణాల పంపిణీ వ్యాపారం చేస్తుంది.
ఈ విచారణ లో భాగంగా, వివో ఇండియా ఫ్యాక్టరీ ప్రాంగణంలో డి ఆర్ ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వివో ఇండియా మొబైల్ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరణలో ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రకటించిన సాక్ష్యాలు దొరికాయి.
ఈ తప్పుడు ప్రకటనల ఫలితంగా అక్రమంగా వివో ఇండియా రూ. 2,217 కోట్ల విలువైన అనర్హమైన సుంకం మినహాయింపు ను పొందింది. విచారణ పూర్తయిన తర్వాత, కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం వివో ఇండియా కు కస్టమ్స్ సుంకం మొత్తం రూ. 2,217 కోట్లు చెల్లించాలని షోకాజ్ నోటీసు జరిచేసారు.
వివో ఇండియా డిఫరెన్షియల్ డ్యూటీ బకాయి చెల్లించడానికి 60 కోట్ల రూపాయల మొత్తాన్ని స్వచ్ఛందంగా డిపాజిట్ చేసింది.
తాజాగా, డీఆర్‌ఐ నిర్వహించిన మరో విచారణ లో, ఒప్పో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు కూడ 4,403.88 కోట్ల బకాయిల కు నోటీసులు జారీ చేసారు.
****
(Release ID: 1848250)
Visitor Counter : 186