సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
సీనియర్ సిటిజన్స్ కోసం సంక్షేమ కార్యక్రమాలు
Posted On:
03 AUG 2022 3:25PM by PIB Hyderabad
'జనాభా అంచనాలపై టెక్నికల్ గ్రూప్ నివేదిక -జూలై 2020' ప్రకారం, సీనియర్ సిటిజన్ల జనాభా 2031 నాటికి 193.4 మిలియన్లుగా అంచనా వేశారు. ' పెద్ద వారి ఆరోగ్యం కోసం జాతీయ కార్యక్రమం' పేరుతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరసమైన, అధిక-నాణ్యతతో కూడిన దీర్ఘకాలిక, సమగ్రమైన, అంకితమైన సంరక్షణ సేవలను అందించడానికి వృద్ధుల సంరక్షణకు ఉద్దేశించినది. ఈ కార్యక్రమం ప్రాథమిక, తృతీయ సంరక్షణ సేవా స్థాయిలలో అమలు జరుగుతోంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ పథకం, ‘ప్రధాన్ మంత్రి వయ వందన యోజన’ వృద్ధాప్యంలో సామాజిక భద్రతను అందిస్తుంది. అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో వారి వడ్డీ ఆదాయం తగ్గకుండా సీనియర్ సిటిజన్‌లను అండగా ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ గ్యారెంటీ ఆధారంగా సబ్‌స్క్రిప్షన్ మొత్తానికి లింక్ అయి హామీ ఉన్న పెన్షన్/రిటర్న్ అందించడం ద్వారా సీనియర్ సిటిజన్‌లకు వృద్ధాప్య ఆదాయ భద్రతను ఈ పథకం అనుమతిస్తుంది.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్లకు మార్గదర్శకత్వం, ఆత్మీయ మద్దతు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ఉచిత సమాచారం, విషయంలో క్షేత్రస్థాయి జోక్యం కోసం టోల్-ఫ్రీ (నం. 14567) జాతీయ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. సీనియర్ సిటిజన్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అండగా ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్లకు ఫిర్యాదుల పరిష్కార వేదికను కూడా అందిస్తుంది. ఇంకా, 'వృద్ధుల ఆరోగ్య సంరక్షణ జాతీయ కార్యక్రమం' మంచాన పడిన వృద్ధుల కోసం పునరావాస కార్యకర్తలు నివాసాలను సందర్శించడానికి, అటువంటి సీనియర్ సిటిజన్‌ల సంరక్షణ కోసం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కోసం ఏర్పాటు చేసింది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, దాని జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపి) ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (ఐజిఎన్ఓఏపిఎస్) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నకుటుంబాలకు చెందిన సీనియర్ సిటిజన్‌లకు వృద్ధాప్య పెన్షన్‌ను అందిస్తుంది. ఐజిఎన్ఓఏపిఎస్ కింద 60-79 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్లకు కేంద్ర సహాయం రూ. 200/-, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లకు నెలకు రూ.500/- ఇస్తారు. అయితే, రాష్ట్రాలు/యుటీలు ఎన్ఎస్ఏపి కింద కేంద్ర సహాయం కంటే ఎక్కువ టాప్-అప్‌లను అందించడానికి ప్రోత్సాహం ఉంటుంది. ప్రస్తుతం ఐజిఎన్ఓఏపిఎస్ కింద ప్రతి లబ్ధిదారునికి నెలకు ఇచ్చేది రూ. 50 నుంచి రూ. 3000.
ఈ సమాచారాన్ని సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి ప్రతిమ భూమిక్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1848130)