రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలతో పర్యవేక్షణ అమలు
Posted On:
03 AUG 2022 1:59PM by PIB Hyderabad
గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ము కాశ్మీర్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లు తాము మోటారు వాహన చట్టంలోని నిబంధనలను అనుసరిస్తున్నామని మరియు అధికంగా ప్రమాదాలు జరిగే మరియు అధిక ట్రాఫిక్ సాంద్రత గల జాతీయ రహదారుల కారిడార్‌లలో తగిన ఎలక్ట్రానిక్ అమలు పరికరాల ఏర్పాటు కోసం ప్రకటన జారీ చేసినట్లు ధృవీకరించాయి. మిగిలిన రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకా ధృవీకరించలేదు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ రహదారుల పై ప్రయాణికుల భద్రత కోసం ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ తో ఆగస్ట్ 11, 2021 న జి ఎస్ ఆర్ (GSR) నోటిఫికేషన్ 575(E)ని జారీ చేసింది, ఈ నోటిఫికేషన్ తగిన ఎలక్ట్రానిక్ పరిశీలన అమలు పరికరాలను అధికంగా ప్రమాదాలు జరిగే మరియు అధిక ట్రాఫిక్ సాంద్రత వుండే కారిడార్‌లలో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జాతీయ రహదారులపై. మోటారు వాహన చట్టం, 1988 మరియు సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్, 1989 అమలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/UTల పరిధిలోకి వస్తాయి. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019లోని నిబంధనల అమలుకు సంబంధించి 2020 జనవరి 6వ తేదీన అన్ని రాష్ట్రాలు/యుటిలకు మంత్రిత్వ శాఖ ఒక సలహా సూచనల సంచిక కూడా జారీ చేసింది.
అధిక ట్రాఫిక్ సాంద్రత గల కారిడార్‌లలో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ATMS) సదుపాయం కల్పించబడింది, ఇది జాతీయ రహదారుల పరిధిలో సంభవించే ప్రమాదాలను సంఘటనలను త్వరితగతిన గుర్తించడంలో సహాయపడుతుంది మరియు తద్వారా అక్కడే సత్వర సహాయం అందే సమయాన్ని తగ్గిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 136 ఏ నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ మరియు రహదారి భద్రత అమలు రాష్ట్ర ప్రభుత్వం పరిది లోది.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1848126)
Visitor Counter : 140