రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రహదారుల మరియు ప్రధాన రహదారుల వెంట చెట్ల కొట్టివేత పై సమాచారం

प्रविष्टि तिथि: 03 AUG 2022 1:57PM by PIB Hyderabad

జాతీయ రహదారుల (NHలు) అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖ పొందిన దారి హక్కు లో భాగంగా అడ్డంకులను తొలగించడం జరుగుతుంది.  ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల విస్తరణ కోసం కనీస స్థాయి లోనే చెట్లను తొలగించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. 

గణేష్‌పూర్ నుండి డెహ్రాడూన్ వరకు ఉన్న ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ కోసం శివాలిక్ అటవీ డివిజన్‌లో మొత్తం 7,747 చెట్లను మరియు 3,258 మొక్కలను తొలగించారు. ఈ చెట్లేవీ రాజాజీ నేషనల్ పార్క్ పరిది లో లేవు.

ఉత్తరప్రదేశ్  మరియు ఉత్తరాఖండ్ అటవీ శాఖలు రూపొందించిన  అటవీకరణ పరిహార పథకం ప్రకారం సుమారు 1.76 లక్షల చెట్లను నాటాలి.  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ అటవీ శాఖలకు అటవీకరణ పరిహార పథకం మరియు నికర ప్రస్తుత విలువ కోసం రూ. 844.13 లక్షలను  జమ చేసింది. అంతే కాకుండా,  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 155 చెట్లను వేరే ప్రాంతంలో తిరిగి నాటింది.

మార్చి 2021 నాటికి 94 ప్రాజెక్టులలో 55.10 లక్షల మొక్కలు నాటారు.

ఈ సమాచారాన్ని కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.

***


(रिलीज़ आईडी: 1848123) आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu