రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
డైఅమ్మోనియం ఫాస్ఫేట్ (డిఏపి)లో భారతదేశం ఆత్మనిర్భర్‌గా మారనుంది.
సెనెగల్‌లో మైనింగ్ మరియు డిఏపి ఉత్పత్తి భారతదేశంలో జరుగుతుంది
10 ఎల్‌ఎంటి డిఏపి మరియు ఎన్‌పికే తయారు చేయబడుతుంది
Posted On:
03 AUG 2022 5:36PM by PIB Hyderabad
ఎరువులలో స్వయం సమృద్ధిని ప్రోత్సహించడానికి ఆత్మ నిర్భర్ భారత్ చొరవలో భాగంగా భారత ప్రభుత్వం బ్యాకెండ్ సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి భారతీయ ఎరువుల కంపెనీలకు సలహాలు మరియు మద్దతునిస్తోంది. రాక్ ఫాస్ఫేట్ మరియు ఫాస్పోరిక్ యాసిడ్ వంటి ముడిసరుకుపై దేశం అధికంగా ఆధారపడటం వలన పెట్టుబడులు మరియు బహుళ-సంవత్సరాల దిగుమతి ఒప్పందాల ద్వారా ఖనిజాలు అధికంగా ఉన్న దేశాలలో తన ప్రవేశాన్ని విస్తరించడం ద్వారా సరఫరాలను మరియు ధరల పెరుగుదల నుండి దేశానికి రక్షణ కల్పించాలని యోచిస్తోంది.
ఈ దిశగా భారతదేశంలోని ప్రముఖ ఫాస్ఫేటిక్ ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సెనెగల్‌లో ఉన్న రాక్ ఫాస్ఫేట్ మైనింగ్ కంపెనీ అయిన బావోబాబ్ మైనింగ్ అండ్ కెమికల్స్ కార్పొరేషన్ (బిఎంసిసి)లో 45% ఈక్విటీ వాటాను ఈ రోజు అధికారికంగా కొనుగోలు చేసింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మరియు రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బిఎంసిసి అధికారులు కోరమాండల్‌కు సెనెగల్ ప్రభుత్వం నుండి అంగీకార పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ “ఖనిజ సంపన్న భౌగోళిక ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం ముడిసరుకు సరఫరా భద్రతను పటిష్టం చేస్తోందన్నారు. దేశ ఎరువుల అవసరాలను తీర్చడానికి సరఫరా భద్రతా లక్ష్యాలను సాధించడానికి ఇటువంటి పెట్టుబడులను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం పరిశ్రమతో భాగస్వామ్యం కలిగి ఉంది. మన రైతులకు ఎరువుల లభ్యతను నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము మరియు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మరియు ఇతర దేశాలతో భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తూనే ఉంటాము.
అలాగే డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ “భారతదేశానికి ఫాస్పోరిక్ యాసిడ్‌ను సరఫరా చేసే ప్రముఖ దేశాలలో ఒకటైన సెనెగల్‌తో భారతదేశం సత్సంబంధ ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉంది. సెనెగల్‌లోని రాక్ మైన్స్‌లో పెట్టుబడులు రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటాయని మరియు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. మైనింగ్ సెనెగల్‌లో జరుగుతుంది మరియు డిఏబి ఉత్పత్తి భారతదేశంలో జరుగుతుంది. 10 ఎల్‌ఎంటి డైఅమ్మోనియం ఫాస్ఫేట్ (డిఏపి) మరియు నైట్రోజన్-ఫాస్పరస్-పొటాషియం (ఎన్‌పికె) తయారు చేయబడుతుంది.
కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ అరుణ్ అలగప్పన్ మాట్లాడుతూ ఎరువులకు అవసరమైన కీలకమైన ముడి పదార్థాల సరఫరాకు అనుసంధానాలను ఏర్పాటు చేయడంలో భారత ప్రభుత్వం నిరంతర మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహనికికృతజ్ఞతలు తెలిపారు. "బిఎంసిసిలో పెట్టుబడి మా రాక్ ఫాస్ఫేట్ అవసరాలలో మూడింట ఒక వంతు వరకు సురక్షితం చేస్తుంది, మా సోర్సింగ్ బేస్‌ను వైవిధ్యపరుస్తుంది మరియు మా కార్యకలాపాలలో స్వయం సమృద్ధిని పెంచుతుంది. ఫాస్ఫేటిక్ ఎరువులలో సరఫరా భద్రతను నిర్మించడం కోసం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మేము పెట్టుబడిని కొనసాగిస్తాము" అని తెలిపారు.
****
(Release ID: 1848122)
Visitor Counter : 212