ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) పౌరుల ఆరోగ్య రికార్డులను వారి ఎబీహెచ్ఏ నంబర్‌లతో డిజిటలైజ్ చేయడంలో, అనుసంధానం చేయడంలో స్థిరమైన పురోగతి
ఎన్‌హెచ్ఏ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ను మరింత ప్రోత్సహించడానికి, పథకం కింద ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు/యూటీలు, జిల్లాలు, ఆరోగ్య సౌకర్యాలు, ఇంటిగ్రేటర్ల గుర్తింపు
Posted On:
02 AUG 2022 5:36PM by PIB Hyderabad
నేషనల్ హెల్త్ అథారిటీ ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద దేశం కోసం సమగ్ర డిజిటల్ ఆరోగ్య ఎకోసిస్టమ్‌ను తయారు చేస్తోంది. సెప్టెంబరు 2021లో దేశవ్యాప్తంగా ప్రారంభించినప్పటి నుండి, ఎడీబీఎం 23 కోట్ల ఎడీబీఎం సంఖ్యలతో (గతంలో హెల్త్ ఐడీలుగా పిలువబడేది), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ లో నమోదైన 1.14 లక్షల ఆరోగ్య సదుపాయాలు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ (హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ) కింద 33 వేల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు (హెచ్‌ఎఫ్‌ఆర్)తో గణనీయమైన వృద్ధిని సాధించింది. 6.6 లక్షల ఎబీహెచ్ఏ యాప్ డౌన్‌లోడ్‌లు, 3.4 లక్షల ఆరోగ్య రికార్డులు వ్యక్తుల ఎబీహెచ్ఏకి అనుసంధానం చేయబడ్డాయి.
ఎక్కువ మంది వ్యక్తులు, వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ వంటి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, వెల్నెస్ సెంటర్లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు వంటి ఆరోగ్య సదుపాయాలు ఎబీడీఎంలో చేరడంతో, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ ఇప్పుడు సాధ్యమైంది. పాత ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ కోసం, వ్యక్తులు తమ రికార్డులను స్కాన్ చేయడానికి, సేవ్ చేయడానికి యాప్ లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత ఆరోగ్య రికార్డు (PHR) యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ డిజిటల్ రికార్డులను వారి ఎబీహెచ్ఏకి లింక్ చేయడం ద్వారా, వ్యక్తులు డిజిటల్‌గా నిపుణులు మరియు సౌకర్యాలతో కలవడం జరుగుతుంది. భౌగోళిక దూరంతో సంబంధం లేకుండా నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సేవలను పొందగలరు.
ఇప్పటివరకు పథకం పురోగతికి గణనీయమైన సహకారం అందించిన అనేక రాష్ట్రాలు/యుటిలు:
ఆరోగ్య రికార్డులతో అనుసంధానించిన ఎబీహెచ్ఏలు
|
క్రమ
సంఖ్య.
|
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
అనుసంధానించిన ఎబీహెచ్ఏలు
|
1
|
ఆంధ్ర ప్రదేశ్
|
69,683
|
2
|
దాద్రా, నగర్ హవేలి, డయ్యూ, డామన్
|
28,186
|
3
|
లఢక్
|
15,672
|
4
|
చంఢీఘడ్
|
14,391
|
5
|
అండమాన్ నికోబార్ దీవులు
|
9,775
|
ఆన్‌బోర్డ్ చేసిన ఆరోగ్య సౌకర్యాల సంఖ్య
|
క్రమ
సంఖ్య
|
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
వెరిఫై చేసిన ఆరోగ్య సౌకర్యాలు
|
1
|
ఉత్తర్ ప్రదేశ్
|
26,824
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
13,346
|
3
|
మహారాష్ట్ర
|
12,787
|
4
|
బిహార్
|
12,270
|
5
|
మధ్య ప్రదేశ్
|
12,109
|
ఆన్‌బోర్డ్ చేసిన ఆరోగ్య రంగ నిపుణులు
|
క్రమ
సంఖ్య
|
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
వెరిఫై చేసిన ఆరోగ్య రంగ నిపుణులు
|
1
|
ఆంధ్ర ప్రదేశ్
|
16,194
|
2
|
మహారాష్ట్ర
|
3,153
|
3
|
జమ్ము కశ్మీర్
|
2,709
|
4
|
చత్తీస్ గఢ్
|
1,971
|
5
|
చంఢీఘడ్
|
1,788
|
కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం, స్థోమత మెరుగుపరచడంలో సంబంధిత రాష్ట్రాలు & యూటీల సహకారం, ప్రమేయాన్ని గుర్తించి, ఎన్‌హెచ్ఏ వారి సహకారం కోసం అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు/యూటీలు, జిల్లాలు మరియు ఆరోగ్య సౌకర్యాలను (పబ్లిక్ మరియు ప్రైవేట్) గుర్తించింది. ఏబీడీఎం కింద, 01.08.2022 నుండి 19.09.2022 వరకు 50 రోజుల వ్యవధిలో అధిక సహకారం అందిస్తున్న రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాలను ఈ పథకం యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ క్రింది విధంగా 4 కేటగిరీల క్రింద గుర్తించారు:
ఎ క్యాటగిరి: ప్రతి లక్ష జనాభా కలిగిన రాష్ట్రం/యూటీలో 01.08.2022 నుండి 19.09.2022 వరకు అత్యధిక ఆరోగ్య రికార్డులను కలిగి ఉన్న రాష్ట్రాలు/యూటీలు ఎబీహెచ్ఏ(లు)కి లింక్ చేయబడ్డాయి.
బీ క్యాటగిరి: ప్రతి లక్ష జనాభాకు 01.08.2022 నుండి 19.09.2022 వరకు జిల్లాలో ఎబీహెచ్ఏ(లు)కి అనుసంధానించబడిన అత్యధిక ఆరోగ్య రికార్డులు కలిగిన జిల్లాలు.
సీ క్యాటగిరి: 19.09.2022 నాటికి ప్రైవేట్, పబ్లిక్ రంగంలోని హెచ్ఎఫ్ఆర్ హెచ్‌పీఆర్ రిజిస్ట్రీల జనాభాలో అత్యధిక శాతం సంతృప్తతను సాధించిన రాష్ట్రాలు/యూటీలు.
డీ క్యాటగిరి: 01.08.2022 నుండి 19.09.2022 వరకు 50-రోజుల వ్యవధిలో ఎబీహెచ్ఏ(లు)కి అత్యధిక సంఖ్యలో ఆరోగ్య రికార్డులను కలిగి ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన సౌకర్యాలు.
పై వర్గాలతో పాటు, 01.08.2022 నుండి 19.09.2022 వరకు 50 రోజుల వ్యవధిలో ఎబీహెచ్ఏ నంబర్‌లకు లింక్ చేయబడిన ఆరోగ్య రికార్డుల సంఖ్య ఆధారంగా ఎన్‌హెచ్ఏ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఎబిడిఎం ఇంటిగ్రేటర్‌లను (స్కీమ్‌తో అనుసంధానించబడిన డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్) గుర్తిస్తుంది. ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ నుండి అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఇంటిగ్రేటర్లు ప్రత్యేక కేటగిరీలలో గుర్తించబడతారు.
ఎబిడిఎంకు సంబంధించిన మరింత సమాచారం: https://abdm.gov.in/. ఎబిడిఎం కింద రాష్ట్రాల వారిగా సాధించిన పనితీరు కోసం డ్యాష్ బోర్డ్: https://dashboard.abdm.gov.in/abdm/
****
(Release ID: 1847678)
Visitor Counter : 138