ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారతీయ రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఇన్ వాయిసింగ్ , చెల్లింపులకు ఆర్ బి ఐ అనుమతి
Posted On:
02 AUG 2022 7:41PM by PIB Hyderabad
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ )
" భారతీయ రూపాయిల ( ఐ ఎన్ ఆర్ ) లో అంతర్జాతీయ ట్రేడ్ సెటిల్మెంట్ " పై 11.07.2022 నాటి సర్క్యులర్ నెంబరు. 10 ఆర్బిఐ / 2022-2023/90 ద్వారా భారతీయ రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఇన్వాయిసింగ్ , చెల్లింపులను అనుమతించింది. ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసాన్ రావ్ కరాడ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
సర్క్యులర్ లోని పేరా 10 ప్రకారం, ప్రత్యేక ఐఎన్ఆర్ వోస్ట్రో ఖాతాలను తెరవడానికి, భాగస్వామ్య దేశాల బ్యాంకులు భారతదేశంలోని అధీకృత డీలర్ (ఎడి) బ్యాంకులను సంప్రదించవచ్చని, ఈ సదుపాయం వివరాలతో ఆర్బిఐ నుండి ఆమోదం పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు.
ఎఫ్ఎటిఎఫ్ కోరిన కౌంటర్ చర్యల పై హై రిస్క్ , నాన్ కో-ఆపరేటివ్ న్యాయపరిధి కి సంబంధించి అప్ డేట్ చేయబడిన ఎఫ్ఎటిఎఫ్ పబ్లిక్ స్టేట్ మెంట్ లో. కరస్పాండెంట్ బ్యాంక్ ఒక దేశం లేదా న్యాయపరిధికి చెందినది కాదని ప్రత్యేక ఐఎన్ఆర్ వోస్ట్రో ఖాతాను నిర్వహించే ఎడి బ్యాంక్ నిర్ధారించుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.
****
(Release ID: 1847659)