ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల (ఏబీహెచ్ఏ) స్వీకరణ వేగవంతానికి చర్యలు


- ఇంటర్నెట్ అనుసంధాన‌త‌ లేని సుధీర ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా ఆఫ్‌లైన్ ఏబీహెచ్ఏ

- ఏబీహెచ్ఏను ఒక వ్యక్తి ఆధార్ సంఖ్య లేదా డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా సృష్టించేందుకు త‌గిన ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2022 4:56PM by PIB Hyderabad

 

దేశంలోని పౌరులు వారి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (నంబ‌రు) (ఏబీహెచ్ఏ)ని సృష్టించుకోవ‌చ్చు. ఇది ఆరోగ్య పర్యావరణ వ్యవస్థలో ఒక పౌరుడికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం, ఏబీహెచ్ఏను ఒక వ్యక్తి వారి ఆధార్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా సృష్టించుకోవచ్చు. బహుళ విధానాలు మరియు వాటాదారుల సమ్మతితో వారి డిజిటల్ ఆరోగ్య రికార్డులను లింక్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి ఏబీహెచ్ఏ దోహ‌దం చేస్తుంది. ఇది  ఆరోగ్య సంరక్షణ ప్రదాతలలో  ఆరోగ్య రికార్డుల్ని రూపొందించడంలో ఇది సహాయపడుతుంది, ఇది వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి వీలు కల్పిస్తుంది. దేశంలో ఏబీహెచ్ఏ  స్వీకరణను వేగవంతం చేయడానికి మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది. నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) ఏబీహెచ్ఏ సృష్టిని వేగవంతం చేయడానికి అనేక ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రభుత్వ ఆరోగ్య పరిష్కారాలు/ అప్లికేషన్‌లు, ప్రైవేట్ ఇంటిగ్రేటర్‌లకు సహకరిస్తోంది. పరిమిత లేదా ఇంటర్నెట్ స‌దుపాయం అందుబాటులో లేని రిమోట్ లొకేషన్‌లలో ఏబీహెచ్ఏ సృష్టి కోసం, ఏబీడీఎం ఆఫ్‌లైన్ ఏబీహెచ్ఏ  క్రియేషన్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియ‌జేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 1847614) సందర్శకుల సూచీ సంఖ్య : : 195
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu