ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) పాత్ర


జనాభా వివరాలు, ఆరోగ్య సూచికలకు సంబంధించి నాణ్యత, నమ్మదగిన మరియు పోల్చదగిన సమాచారంతో పాటు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మరియు అనుబంధ రంగాలలో నూతనంగా తలెత్తుతున్న సమస్యలపై సర్వే ద్వారా అందుబాటులోకి వస్తున్న సమగ్ర వివరాలు

2019-21 సంవత్సరంలో జరిగిన ఐదో రౌండ్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) ప్రతి స్త్రీకి 2.0 పిల్లలకు తగ్గడంతో ప్రతి స్త్రీకి 2.1 పిల్లలు సంతానోత్పత్తి పునఃస్థాపన స్థాయి సాధించినట్టు వెల్లడించిన సర్వే

Posted On: 02 AUG 2022 4:57PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమగ్ర జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు అయిదు సార్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరిగింది. సర్వే ద్వారా జనాభా వివరాలు, ఆరోగ్య సూచికలతో సహా ఆరోగ్య కుటుంబ సంక్షేమం దాని అనుబంధ రంగాల్లో నూతనంగా  తలెత్తుతున్న సమస్యలకు సంబంధించిన సమగ్ర వివరాలు లభిస్తున్నాయి.  వీటిని ఆధారంగా చేసుకుని విధాన నిర్ణయాలు తీసుకునేందుకు, కార్యక్రమ అమలు లక్ష్యాలను నిర్ణయించడానికి అవకాశం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏవిధంగా సమర్థంగా అమలు జరుగుతున్నాయి అన్న  అంశానికి సంబంధించిన వివరాలు కూడా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా తెలుస్తున్నాయి. 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2019-21 కాలంలో 5వ సారి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను నిర్వహించింది.  2019-21 సంవత్సరంలో  నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే   ఐదో రౌండ్ ప్రకారం దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గిందని వెల్లడయింది. 2015-16 లో జరిగిన    జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే  నాలుగో రౌండ్  ఫలితాల   ప్రకారం దేశంలో  మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) ప్రతి స్త్రీకి 2.2 మంది పిల్లలుగా ఉంది. 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఈ రేటు   2.0 పిల్లలకు తగ్గింది. ఇది ప్రతి స్త్రీకి 2.1 పిల్లలు   సంతానోత్పత్తి స్థాయి చేరుకోవడం జరిగింది.  

 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నాలుగో రౌండ్ ఫలితాలతో   జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదవ  రౌండ్ ఫలితాలను పోల్చి చూస్తే ముఖ్యమైన ఆరోగ్య , కుటుంబ సంక్షేమ రంగాల్లో సాధించిన ప్రగతి కింది విధంగా ఉంది :

***



(Release ID: 1847612) Visitor Counter : 361


Read this release in: English , Urdu