పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
షెడ్యూల్ చేయబడిన దేశీయ విమానయాన సంస్థలలో 'వెబ్ చెక్-ఇన్'కు అదనపు రుసుము లేదు
Posted On:
01 AUG 2022 4:45PM by PIB Hyderabad
పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్ (ఏటీసీ)-01 ఆఫ్ 2021ను "షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ ద్వారా సేవలు మరియు రుసుములను వెల్లడి" పేరుతో విడుదల చేసింది, దీని ప్రకారం సాధారణ ప్రయాణికుల నుండి ప్రిఫరెన్షియల్ సీటింగ్ వంటి కొన్ని సేవల్ని విడదీయడానికి, వాటికి విడిగా వసూలు చేయడానికి అనుమతించబడింది.
అటువంటి అన్‌బండిల్ చేయని సేవలు ఎయిర్‌లైన్స్ ద్వారా "ఆప్ట్-ఇన్" ఆధారంగా ప్రయాణికులకు అందించబడతాయి. అవి తప్పనిసరి కాని సేవలు. షెడ్యూల్డ్ సమయానికి విమానం బయలుదేరడానికి ముందు వెబ్ చెక్-ఇన్ కోసం ఏ సీటును ఎంచు కొంటే.. ప్రయాణీకులకు సీటు కేటాయించే నిబంధన కూడా ఉంది. షెడ్యూల్ చేయబడిన దేశీయ విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ఎటువంటి రుసుమును వసూలు చేయనవసరం లేదు. విమానాశ్రయాలలో చెక్-ఇన్ విషయానికొస్తే ఎయిర్‌పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్‌లలో బోర్డింగ్ పాస్‌లను జారీ చేయడానికి అదనపు మొత్తాన్ని వసూలు చేయవద్దని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని షెడ్యూల్ చేసిన విమానయాన సంస్థలకు సూచించింది, ఎందుకంటే ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 135 కింద. ముందుగా అందించిన విధంగా 'టారిఫ్'లో భాగంగా పరిగణించబడదు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ / డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయానానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఈ విషయంలో ఏర్పాటు చేయబడిన యంత్రాంగం / ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఆయా ఫిర్యాదులు పరిష్కరించబడతాయి.ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి. కె. సింగ్ (రిటైర్డ్) ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1847170)
Visitor Counter : 173