విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ రంగానికి సంబంధించి పునరుద్ధారిత పంపిణీరంగ పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి.
ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్య- విద్యుత్ రంగం- 2047 కార్యక్రమ ముగింపు ఉత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి.
ఎన్.టి.పి.సి కి చెందిన 5200 కోట్లరూపాయల విలువగల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి.
నేషనల్ సోలార్ రూఫ్‌టాప్ పోర్టల్‌ను ప్రారంభించచిన ప్రధానమంత్రి.
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో బిజిలీ మహోత్సవ్ ను నిర్వహణ
దేశవ్యాప్తంగా జిల్లాస్థాయిలో 1500 కుపైగా ఈవెంట్‌లు, కార్యకలాపాల ఏర్పాటు.
Posted On:
30 JUL 2022 6:30PM by PIB Hyderabad
ఆజాది కా అమృత్ మహోత్సవ్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఉజ్వల్‌భారత్, ఉజ్వల భవిషయ- విద్యుత్ 2047 ముగింపు ఉత్సవాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివిధ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి మండీ నుంచి శ్రీ హన్సరాజ్, త్రిపురలోని కోవై నుంచి కలహా రియాంగ్,
విశాఖపట్నం నుంచి శ్రీ కాగు క్రాంతికుమార్, వారణాశి నుంచి శ్రీమతి ప్రమీలా దేవి, అహ్మదాబాద్ నుంచచి శ్రీ ధీరేన్ సురేష్ భాయ్ పటేల్ లతో మాట్లాడారు. వీరంతా కుసుమ్, సౌర విద్ఉత్, డిడియుజిజెవై, ఐపిడిఎస్, సౌర పలకలకుసంబంధించిన పథకాల లబ్ధిదారులు..
కేంద్ర విద్యుత్ ,ఎన్.ఆర్.ఇ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్, కేంద్ర విద్యుత్ , భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ కృషన్ పాల్ గుర్జార్ ,ఎం.ఎన్.ఆర్.ఇ శాఖ సహాయమంత్రి శ్రీ భగవంత్ ఖుబా ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 12 మంది ముఖ్యమంత్రులు ,ముగ్గురు ఉపముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, 27 మంది రాష్ట్రమంత్కులు, 81 మంది ఇతర ప్రముఖులు, పాల్గొన్నారు. ఎం.ఎన్.ఆర్.ఇ కార్యదర్శి శ్రీ ఇందు శేఖర్ చతుర్వేది,విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్, సిఎండి,ఆర్.ఇ.సి లిమిటెడ్ శ్రీ వివేక్ కుమార్ దేవాంగన్, ఎన్.టి.పి.సి సిఎండి శ్రీ గురుదీప్ సింగ్ , ఆర్.ఇ.సి లిమిటెడ్ సిఇఒ శ్రీ ఆర్.లక్ష్మణన్, జె.ఎస్.పవర్ కు చెందిన శ్రీ విశాల్ కపూర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య ముగింపు ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించారు.ఇందుకుసంబంధించి జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 100కుపైగా వివిధ జిల్లాలనుంచి లబ్ధిదారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి, విద్యుత్ మంత్రిత్వశాఖకు సంబంధించిన పునరుద్ధారిత విద్యుత్ పంపిణీ రంగ పథకాన్ని ప్రారంభించారు. ఇది పంపిణీ పథకాలకు ఆర్థిక సుస్థిరత కల్పించేందుకు, వాటి నిర్వహణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన పథకం. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల కాలానికి 3,03,758 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపడుతున్న పథకం ఇది.ఈ పథకం డిస్కమ్‌ల ఆధునీకరణకు పంపిణీ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు విద్యుత్ పంపిణీలో నాణ్యతను పెంచేందుకు, నమ్మకమైన విద్యుత్ పంపిణీకి పూచీ పడేవిధంగా మౌలికసదుపాయాలను ఆధునీకరించుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి దీనిని నిర్దేశించారు. దేశవ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను అందించాలని కూడా ప్రతిపాదించారు.
ప్రధానమంత్రి ఈ సందరర్భంగా నేషనల్ పోర్టల్ ఫర్ రూప్‌టాప్ సోలార్‌ను కూడా ప్రారంభించారు. ఇది రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియయను ఆన్‌లైన్ ద్వారా ట్రాక్ చేయడానికి ఉపకరిస్తుంది. రెసిడెన్షియల్ వినియోగదారులు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించిన తనిఖీ అనంతరం వారి బ్యాంకు ఖాతాలకు సబ్సిడీ విడుదలకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్
నుంచి అన్ని రకాల స్థాయిలలో ఆన్ లైన్ ట్రాకింగ్ కు ఇది వీల కల్పిస్తుంది.
జాతీయ సోలార్ రూఫ్ టాప్ కార్యక్రమం కింద అంచనా వేసిన సామర్థ్యం 400 ఎం.డబ్ల్యు. ఇది దేశ సోలార్ రూఫ్ టాప్ సామర్ధ్యాన్ని సాకారంచేయడంలో ఇది ప్రధాన అడుగు. 500 జిడబ్లు సౌరవిద్యుత్‌నుఉత్పత్తి చేయాలన్న భారతదేశ లక్షక్యానికి ఇది ఉపకరిస్తుంది. కాప్ -26 కి అనుగుణంగా శిలాజేతర ఇంధన వనరుల ఉత్పత్తికి ఇండియా కట్టుబడిన దానిని సాకారం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ఎన్.టి.పి.సి కి సంబంధించి న 5,200 కోట్ల రూపాయల విలువగల ఎన్.టి.పి.సికి చెందిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ప్రధానమంత్రి తెలంగాణాలో 100 మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును , కరళలో 92 మెగావాట్ల కాయంకులం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. రాజస్థాన్ లోని 735 మెగావాట్ల నోక్ష్ సోలార్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాన చేశారు. లెహ్ లో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటి ప్రాజెక్టు, గుజరాత్‌లో సహజవాయువుతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కు సంబంధించి కవాస్ గ్రీన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
కేంద్ర విద్యుత్ , ఎన్.ఆర్.ఇ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ , ఈ సమావేశంలో పాల్గొన్న వారికి స్వాగతం పలికి , విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి సమార్ధ్యం 4,00,000 ఎం.డబ్ల్యు కంటే ఎక్కువకుపెంచామని , ఇది మన డిమాండ్ కన్న 1,85,000 ఎం.డబ్ల్యుల కన్న ఎక్కువ అని చెప్పారు. దేశవ్యాప్తంగా అదనంగా 6 లకక్షల సికెఎం ఎల్.టి.లైన్లు, 2,68,838 , 11 కెవి హెచ్ టి లైన్లు, 1,22,123 సికెఎం వ్యవసాయ ఫీడర్లతో విద్యుత్ పంపిణీ మౌలికసదుపాయాలను పెంచినట్టు తెలిపారు. 2015 లో గ్రామీణ ప్రాంతాలలో సగటు సరఫరా గంటలు 12.5 గంటలు ఉండగా, అది ప్రస్తుతం సగటున 22.5 గంటలకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రాల తో కలిసి కేంద్రం ఈ విజయాలు సాధించినట్టు తెలిపారు.
మన దేశ 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలైన ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ బిజిలీ మహోత్సవ్‌ను దేశవ్యాప్తంగా 2022 జూలై 25 నుంచి 31 వరకు నిర్వహిస్తొంది. ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్య -పవర్ 2047 కింద ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల కొలాబరేషన్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే వివిధ ఈవెంట్‌లలో విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ప్రముఖంగా ప్రజలలోకి ప్రస్తావించడం జరుగుతోంది.
బిజలీ మహోత్సవ్ దేశవ్యాప్తంగా వివిధ జిల్లాలలో 2022 జూలై 25న ప్రారంభమైంది. గత కొద్దిరోజులలో జిల్లా స్థాయిలో వివిధ జిల్లాల పాలనా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ 1500కుపైగా ఈవెంట్‌లు, కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు, ఎం.పిలు, రాష్ట్రమంత్రులు, ఎం.ఎల్.ఎలు ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రారంభించిన ప్రాజెక్టులు :
-- రామగుండం ప్రాజెక్టు. ఇది ఇండియాలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్టు. దీనిని 4.5 లక్షల మేడ్ ఇన్ ఇండియా సోలార్ పివి మాడ్యూల్స్ తో ఏర్పాటు చేశారు.
--కాయం కులం ప్రాజెక్టు రెండో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్టు . ఈ ప్రాజెక్టు కింద 3 లక్షల మేడ్ ఇన్ ఇండియా సోలార్ పివి పానళ్లు నీటిపై తేలియాడే విధంగా అమర్చారు.
---రాజస్థాన్ లోని జైసల్మేర్ లో నోఖ్ వద్ద 735 మెగావాట్ల సోలార్ పివి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇంది దేశంలోని అతిపెద్ద దేశీయ కంటెంట్ అవసరాలకు అనుగుణమైన సోలార్ ప్రాజెక్టు. ఒకే ఒక ప్రాంతంలో 1000 ఎండబ్ల్యుపి కలిగినది. ఇక్కడ హై వాటేజ్ బైఫేసియల్ పివి మాడ్యూళ్లు ట్రాకర్‌సిస్టమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది.
---లద్దాక్ లోని, లెహ్ లో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటి ప్రాజెక్టు . ఇది పైలట్ ప్రాజె్టు. లెహ్ చుట్టుపక్కల ఐదు ఫ్యూయల్ సెల్ బస్‌లు నడిచేలా చూసేందుకు సంబంధించినది. ఈ పైలట్ ప్రాజెక్టు ఫ్యూయయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజోపయోగం కోసం వాడేందుకు నిర్దేశించినది.
---ఎన్ టిపిసి కవాస్ టౌన్‌షిప్ లో గ్రీన్ హైడ్్రోజన్ బ్లెండింగ్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ఇండియాలో తొలి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్టు. సహజవాయు వినియోగాన్ని తగ్గించేందుకు నిర్దేశించినది.
నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్ టాప్ సోలార్:
ఈ పోర్టల్ ప్రారంభించడంతో, దీనితో గృహ వినియోగదారులు దరఖాస్తు చేసుకుని సోలార్ రూఫ్ టాప్ ను బిగించుకోడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారులు స్థానిక పంపిణీసంస్థను ఎంపికచేసుకుని ఏ వెండర్ వద్దనైనా రిజిస్టర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సోలార్ మాడ్యూళ్లు, సోలార్ ఇన్వర్టర్లు, ఇతర ప్లాంటు సంబంధిత, పరికరాలకు సంబంధించిన అంశాలలో వినియోగదారుకు ఎంపికకు అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో వెండర్ల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేశారరు. వీరు పిబిజి మొత్తం రూ2.5 లక్షల రూపాయలతో డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. నేషనల్ పోర్టల్ లో దీనిని అప్ లోడ్ చేయాలి. వెండర్లు తమ సమాచారాన్ని ఇవ్వడంతోపాటు, రేట్లను నేషనల్ పోర్టల్‌లో అప్ లోడ్ చేయవచ్చు.
రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను అమర్చుకోదలచిన ఏ వినియోగదారుడైనా వీరిని సంప్రదించవచ్చు, రూఫ్‌టాప్ సోలార్‌ను పరస్పరం ఆమోదిత రేట్లకు అనుగుణంగా అమర్చుకోవచ్చు. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను అమర్చుకునే వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు విడుదలచేసే సబ్సిడికి సంబంధించిన వివరాలను పోర్టల్ లో తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి కింద పేర్కొన్న అంశాలు ఇమిడి ఉన్నాయి.
1) వినియోగదారుడు తన మొబైల్, ఈ-మెయిల్ రిజిస్టర్ చేయించుకుని ఖాతాను యాక్టివేట్ చేయించుకోవాలి.
2) లాగ్ ఇన్ అయి దరఖాస్తును సమర్పించాలి. దీనితో అప్లికేషన్ దానంతట అదే స్థానిక పంపిణీ కంపెనీకి సాంకేతికంగా సాధ్యాసాధ్యాలు పరిశీలించి , ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగిన ఆమోదం కోసం వెళుతుంది.
3) ఒకసారి సాంకతిక అంశాలు పరిశీలించి సాధ్యాసాధ్యాల అనుమతి ఇచ్చిన తర్వాత, ఇది పోర్టల్ లో కనపిస్తుంది. ఇందుకు అనుగుణంగా వినియోగదారుకు ఈమెయిల్ వెళుతుంది.
4) వినియోగదారు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఆన్ లైన్ పోర్టల్‌లో తమ వివరాలను తనిఖీ కోసం సమర్పించవచ్చు. అలాగే నెట్ మీటర్ ఏర్పాటుకు నమోదు చేసుకోవచ్చు.
5) డిస్కం అధికారులు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను తనిఖీ చేసి నెట్ మీటర్ ను ఏర్పాటు చేస్తారు.
6) నెట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత డిస్కంలు వాటి వివరాలను అప్ లోడ్చేయడంతో వినియోగదారుడు సబ్సిడీ విడుదల కోసం తెలపాల్సి ఉంటుంది.
7) వినియోగదారుడి ఖాతాలో 30 రోజులలోగా సబ్సిడీ జమ అవుతుంది. దేశంలోని అందరు వినియోగదారులకు సబ్సిడీ రేటు ఒకే రీతిలో ఉంటుంది.
వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు, డిస్కమ్‌ల వద్ద వెండర్లు రిజిస్టర్ చేయించుకోవాలని నిర్దేశించడంతోపాటు, వెండర్, కనీసం 5 సంవత్సరాలపాటు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ మెయింటినెన్స్ బాధ్యతలు చేపట్టాల్సిఉంటుంది. సరళతరం చేసిన ప్రక్రియ ప్రకారం, డిస్కంలు, టెండర్లు పిలవాల్సిన , రేట్లు కనుక్కోవలసిన,వెండర్లను ఎంపానల్ చేయాల్సిన అవసరం లేదు. వెండర్లు , మంత్రిత్వశాఖ నుంచి సబ్సిడీ విడుదలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. వీరు పూర్తి మొత్తాన్ని వినియోగదారునుంచి పొందుతారు. వినియోగదారు ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. ఈ సులభతర ప్రక్రియ దేశంలో రూఫ్ టాప్ సోలార్ వ్వవస్థను నిర్దేశిత 4,000 ఎండబ్ల్యు సామర్ధ్యానికి చేర్చడాన్నివేగవంతం చేస్తుంది. రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం-2 కింద దీనిని సాధించడానికి లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల 10 లక్షల గృహదారులకు ప్రయోజనం కలుగుతుంది. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుతో గృహ వినియోగదారులు విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవడమే కాక, హరిత ఇంధనానికి సమకూర్చడంతోపాటు, జాతీయ లక్ష్యాలు చేరుకునేందుకు తోడ్పడిన వారు అవుతారు.
***
(Release ID: 1846706)
Visitor Counter : 260