ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణకు భరోసా


జాతీయ ఆరోగ్య మిషన్ కింద గిరిజన ప్రాంతాలలో పేద, బలహీన జనాభాకు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య మానవ వనరులను పెంపొందించడానికి ఆర్థిక, సాంకేతిక మద్దతు

Posted On: 29 JUL 2022 4:35PM by PIB Hyderabad

క్రమానుగతంగా గిరిజన ఆరోగ్య సంరక్షణపై డేటాను రూపొందించడానికి వివిధ ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థాగత వ్యవస్థలు, సర్వే ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. గ్రామీణ ఆరోగ్య గణాంకాలు (ఆర్హెచ్ఎస్) గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల వివరాలను అందిస్తాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) షెడ్యూల్డ్ తెగల తల్లి, శిశు ఆరోగ్యం గురించి ప్రధాన ఆరోగ్య సూచికలపై వివరాలను అందిస్తుంది. భారతదేశ జనాభా గణన గిరిజన ప్రాంతాలతో సహా జనాభా, గృహ వివరాలను అందిస్తుంది. నేషనల్ శాంపిల్ సర్వే వివిధ సామాజిక-ఆర్థిక విషయాలపై ఇంటింటి సర్వేలను చేస్తుంది.

గిరిజన ఆరోగ్యంపై నిపుణుల కమిటీ "ట్రైబల్ హెల్త్ ఇన్ ఇండియా: బ్రిడ్జింగ్ ది గ్యాప్, రోడ్‌మ్యాప్ ఫర్ ది ఫ్యూచర్" పేరుతో 2018లో నివేదిక వచ్చింది, ఇది గిరిజన ఆరోగ్యం, స్థితిగతులపై వివరాలను అందిస్తుంది. కమిటీ నివేదికలో గిరిజన జనాభా ఆరోగ్య స్థితి, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితిపై వివరణాత్మక విశ్లేషణ, వ్యాధి ప్రభావాన్ని గుర్తించడం తో పాటు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, మానవ వనరులు, ఆర్థిక సహాయం, భాగస్వామ్యం వంటి రంగాల్లోని సవాళ్లను చర్చించారు. గిరిజనుల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడానికి సిఫార్సులు చేసింది. కమిటీ ప్రధాన సిఫార్సులు - ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను స్థాపించడం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను బలోపేతం చేయడం, ద్వితీయ, తృతీయ సంరక్షణకు ప్రాప్యత కోసం బీమాను అందించడం; కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు/మిడ్-లెవల్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ల ద్వారా మానవ వనరులను మెరుగుపరచడం, ఆశ సామర్థ్యాలు/పాత్రలను మెరుగుపరచడం, టాస్క్ షేరింగ్, షిఫ్టింగ్ మొదలైనవి; కమ్యూనిటీ సమీకరణ, ఐఈసి; ఆరోగ్య సేవలకు ప్రాప్యతను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం; పాఠశాల ఆరోగ్య కార్యక్రమాన్ని బలోపేతం చేయడం; ప్రాథమిక సంరక్షణలో గిరిజన ఆరోగ్య అభ్యాసకుల ఏకీకరణ; గిరిజన ఉప ప్రణాళిక ద్వారా గిరిజన ఆరోగ్యం కోసం పెరిగిన ఫైనాన్సింగ్.

ఎన్హెచ్ఎం సార్వత్రిక విధానంపై దృష్టి సారిస్తుంది. అందువల్ల  ఎన్హెచ్ఎం  గొడుగు కింద అమలు చేసే అన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఒడిశాతో సహా అన్ని రాష్ట్రాలు/యుటీ లలో అందుబాటులో ఉంటాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద, రాష్ట్రాలు/యూటీలకు వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, రాష్ట్రాలు వారి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్‌లలో (పిఐపిలు) అందించిన అవసరాల ఆధారంగా ప్రజారోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేయడం/అప్‌గ్రేడ్ చేయడం,  సమానమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన ఆరోగ్య మానవ వనరులను పెంపొందించడం వంటి ఆర్థిక, సాంకేతిక మద్దతు అందిస్తారు

గిరిజన ప్రాంతాలలో లబ్ధిదారులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్హెచ్ఎం కింద మద్దతులు ఇలా ఉన్నాయి:

  • ఆయుష్మాన్ భారత్: కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం అయిన ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఉప-ఆరోగ్య కేంద్రాలు (ఎస్హెచ్సిలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పిహెచ్సి లు)లోన్ మార్పు తేవడం ద్వారా ఆరోగ్యం, ఆరోగ్య కేంద్రాలు (హెచ్డబ్ల్యూసిలు) స్థాపించారు. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (సిపిహెచ్సి), ఇది సార్వత్రిక, ఉచిత సేవలతో పాటు  సమాజానికి దగ్గరగా ఉండే నివారణ, ఉపశమనపునరావాస సేవలను కలిగి ఉంటుంది.
  • హాని కలిగించే ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాల ఏర్పాటుకు జనాభా నిబంధనలు సడలించారు. ఎస్హెచ్సి, పిహెచ్సి, సిహెచ్సిల ఏర్పాటుకు దుర్బల ప్రాంతాలైన మారుమూల, గిరిజన, ఎడారి, కష్టతరమైన ప్రాంతాలలో వరుసగా  5,000, 30,000,1,20,000 జనాభా బదులు నిబంధనలను 3,000, 20,000,  80,000 జనాభాగా మార్చడం జరిగింది.  
  • NHM కింద, రాష్ట్రాలు/యూటీలకు మొబైల్ మెడికల్ యూనిట్‌లను (ఎంఎంయులు) అమలు చేయడానికి వెసులుబాటు ఇచ్చారు. ముఖ్యంగా మారుమూల, అందుబాటులో లేని,  తక్కువ సేవలందించే ప్రాంతాలలో నివసిస్తున్న జనాభా కోసం అనేక రకాల ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి సంబంధిత రాష్ట్రాలు/యూటీలు గుర్తించిన అవసరాలకు అనుగుణంగా నిర్ణయించారు.
  • ఆరోగ్య సేవలపై అయ్యే ఖర్చును తగ్గించడానికి, నేషనల్ ఫ్రీ డ్రగ్స్ సర్వీస్ ఇనిషియేటివ్, నేషనల్ ఫ్రీ డయాగ్నస్టిక్ సర్వీస్ ఇనిషియేటివ్ ప్రారంభమయ్యాయి.
  • ఆషా ప్రోగ్రామ్ మార్గదర్శకాలు కొండలు, గిరిజన, కష్టతరమైన ప్రాంతాలలో నివాస స్థాయిలో ఆషా నియామకం కోసం రూపొందాయి (సుమారు 1000 జనాభాలో ఒక ఆషా ఉండడం అంటే జాతీయ ప్రమాణం కంటే చాలా తక్కువ)
  • రోగుల సౌకర్యార్థం ఉచితంగా రవాణా  సౌకర్యం అందించడానికి ఎన్హెచ్ఎం కింద జాతీయ అంబులెన్స్ సేవలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మద్దతునిస్తోంది. రాష్ట్రాలు ఈ అంబులెన్స్‌లను తక్కువ జనాభా ప్రాంతం అనే ప్రామాణికత ఆధారంగా సమయానుకూలంగా ఉంచడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాయి, తద్వారా ఈ అంబులెన్స్‌లు అందరికీ సులభంగా అందుబాటులో ఉంటాయి.
  • ఇంకా, ఉమ్మడి ఆరోగ్య సూచిక రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉన్న అన్ని గిరిజన మెజారిటీ జిల్లాలు అధిక ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా (హెచ్పిడీలు) గుర్తించడం అయింది. ఈ జిల్లాలు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఎన్హెచ్ఎం కింద తలసరి లెక్క కింద మరింత ఎక్కువ వనరులను పొందుతాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను అందించారు 

****



(Release ID: 1846618) Visitor Counter : 165


Read this release in: English , Urdu