ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలు
ఆయుష్మాన్ భారత్ - హెల్త్ & వెల్‌నెస్ సెంటర్స్ (AB-HWC) పథకం కింద సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి 12-ప్యాకేజీలలోని భాగాలలో 'గర్భధారణ మరియు ప్రసవ సంరక్షణ' ఒకటి.
Posted On:
29 JUL 2022 4:36PM by PIB Hyderabad
జాతీయ ఆరోగ్య మిషన్ కింద, మాతా, శిశు ఆరోగ్యం, రాష్ట్ర అవసరాల ఆధారంగా కార్యక్రమ అమలు ప్రణాళికల (PIPs) రూపంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాలకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఆవిష్కరణలు, ఆమోదాలు రాష్ట్రాలు/యుటిలకు రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ (RoP)గా ఇవ్వబడ్డాయి.
ఆయుష్మాన్ భారత్ - హెల్త్ & వెల్‌నెస్ సెంటర్ల (AB-HWC) పథకం కింద సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి 12-ప్యాకేజీల భాగాలలో “గర్భధారణ మరియు ప్రసవంలో సంరక్షణ” ఒకటి. దీనితో పాటు ఈ ప్యాకేజీలో ఉండేవి:
- గర్భం ముందస్తు నిర్ధారణ, నమోదు మరియు ఐడీ నంబర్ కేటాయించడం, మాత, శిశు రక్షణ కార్డు జారీ చేయడం
- హైపర్‌టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్, రక్తహీనత, హెచ్ఐవి, హెపటైటిస్ బి, హైప్/హైపర్-థైరాయిడిజం, సిఫిలిస్ మొదలైన వాటి కోసం థైరాయిడ్ ప్రొఫైల్‌తో సహా అధిక రిస్క్ ప్రెగ్నెన్సీలకు సంబంధించిన నాలుగు యాంటెనాటల్ కేర్ చెక్‌లను నిర్ధారించడం.
- అధిక రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల కోసం రెఫరల్ మరియు ఫాలో అప్.
- పోషకాహార అవసరాల సమాచారంతో సహా గర్భధారణ సమయంలో సంరక్షణకు సంబంధించిన కౌన్సెలింగ్
- సంస్థాగత డెలివరీని సులభతరం చేయడం మరియు జనన ప్రణాళికకు మద్దతు ఇవ్వడం
గర్భిణీ స్త్రీల పరీక్షలు మరియు స్క్రీనింగ్‌ను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలు/కార్యక్రమాలను రూపొందించింది, అవి క్రింది విధంగా ఉన్నాయి:
- సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ (SUMAN) ఎటువంటి ఖర్చు లేకుండా భరోసాతో కూడిన, గౌరవప్రదమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ప్రజారోగ్య సదుపాయాలను సందర్శించేటటువంటి ప్రతి స్త్రీ, నవజాత శిశువులకు అన్ని నివారించగలిగే మాతా మరియు నవజాత మరణాలను తగ్గించే సేవలను నిరాకరించడాన్ని సహించదు.
- ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (PMSMA) గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల 9వ తేదీన స్పెషలిస్ట్/మెడికల్ ఆఫీసర్ ద్వారా నిర్ణీత రోజు, ఉచితంగా మరియు నాణ్యమైన ప్రసవానంతర పరీక్షను అందజేస్తుంది.
- నెలవారీ గ్రామ ఆరోగ్యం, పారిశుధ్యం మరియు పోషకాహార దినోత్సవం (VHSND) అనేది ఐసీడీఎస్‌తో కలిసి పౌష్టికాహారంతో సహా మాతా మరియు శిశు సంరక్షణను అందించడం కోసం అంగన్‌వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేసే కార్యక్రమం.
- MCP కార్డ్ మరియు సురక్షిత మాతృత్వ బుక్‌లెట్ గర్భిణీ స్త్రీలకు ఆహారం, విశ్రాంతి, గర్భం యొక్క ప్రమాద సంకేతాలు, ప్రయోజన పథకాలు మరియు సంస్థాగత ప్రసవాలపై అవగాహన కల్పించడం కోసం పంపిణీ చేయబడతాయి.
- పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం (RCH) పోర్టల్ అనేది గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువుల కోసం ఒక వెబ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్, తద్వారా వారికి ప్రసవానంతర సంరక్షణ, సంస్థాగత ప్రసవం సహా పూర్తి సేవలను సులభంగా అందించడం.
- గిరిజన ప్రాంతాలకు లేదా చేరుకోలేని ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి ఔట్‌రీచ్ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. దీని ద్వారా ప్రసూతి & శిశు ఆరోగ్య సేవలపై అవగాహన పెంచడానికి, కమ్యూనిటీ సమీకరణతో పాటు అధిక ప్రమాదకర గర్భాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1846607)
Visitor Counter : 172