ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుర్వేద కళాశాలల్లో పరిశోధన విభాగాలు

Posted On: 29 JUL 2022 3:15PM by PIB Hyderabad

  నాణ్యమైన  వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేసి దేశ ప్రజలకు అవసరమైన సంఖ్యలో తగిన నైపుణ్యం  గల వైద్య నిపుణుల సేవలు అందించాలన్న లక్ష్యంతో   కేంద్ర ప్రభుత్వం   నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్, 2020 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్  (NCISM)  కమిషన్‌ను ఏర్పాటు చేసింది.  దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్య వ్యవస్థతో సహా అన్ని భారతీయ వైద్య విధానాలకు చెందిన  వైద్య నిపుణులు తమ రంగాల్లో తాజా అంశాలపై  పరిశోధన చేయడంపరిశోధనలను ప్రోత్సహించడానికి అవసరమైన సహాయ సహకారాలను కమిషన్ అందిస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పరిధిలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేసే బోర్డ్ ఆఫ్ ఆయుర్వేద భాతదేశంలో అన్ని వైద్య సంస్థల్లో విద్యా ప్రమాణాలుసిబ్బందిమౌలిక సదుపాయాలువిద్యా నాణ్యతలను నిర్ధారిస్తుంది. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్వస్థవృత్తా మరియు  యోగా కింద మూడవ (ఫైనల్) ప్రొఫెషనల్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ ప్రోగ్రామ్‌కు సంబంధించి పరిశోధనా విధానంవైద్య సమాచార విశ్లేషణ అంశాలపై అధ్యయనం నిర్వహించే సదుపాయం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గుర్తింపు పొందిన ఆయుర్వేద సంస్థ/కళాశాల పైన పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దేశవ్యాప్తంగా  నిర్వహిస్తున్న 453 ఆయుర్వేద కళాశాలల్లో 140 కళాశాలలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తున్నాయి.  పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్రారంభించడానికి సెంట్రల్ రీసెర్చ్ లాబొరేటరీ మరియు పరిశోధనలు చేసేందుకు అవసరమైన జంతువుల శాల కలిగి ఉండాలి.జంతువుల శాలను సంస్థ  సొంతంగా కలిగి ఉండాలి లేదా ఇతరుల  సహకారంతో నిర్వహించాలి. 

   నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్, 2020 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ( అండర్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య కోసం కనీస ప్రమాణాలు ) -2022  నిబంధనలను  నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ రూపొందించింది. ఈ నిబంధనల  ప్రకారం  ఆయుర్వేద  కళాశాల అండర్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య కోసం నిర్దేశించిన  కనీస ప్రమాణాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేద గ్రాడ్యుయేట్‌లకు అష్టాంగ ఆయుర్వేదం గురించిన లోతైన అవగాహనతో  పాటు ఆయుర్వేద రంగం లో సమకాలీన పురోగతి,  ఆరోగ్య సంరక్షణ సేవ కోసం సమర్థవంతమైన వైద్యులు మరియు సర్జన్లుగా విస్తృతమైన ఆచరణాత్మక శిక్షణతో పాటు శాస్త్రం మరియు సాంకేతికత. ఆధునిక శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అనుభవం కూడా  ఉండాలి.

మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీపై 1వ వృత్తిపరమైన కోర్సులో నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్   మూడు వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది.   2021-22 అకడమిక్ సెషన్ నుంచి 1వ వృత్తిపరమైన కోర్సుల కోసం కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CBME)ని ప్రవేశపెట్టిందిఇందులో అన్ని అడ్వాన్స్ టీచింగ్,శిక్షణతో పాటు ఇతర పద్ధతులు చేర్చబడ్డాయి.

ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (అండర్-గ్రాడ్యుయేట్ ఆయుర్వేద కళాశాలలు మరియు అటాచ్డ్ హాస్పిటల్‌లకు కనీస ప్రమాణాల అవసరాలు) నిబంధనలు, 2016 అమలులో ఉన్నాయి.   ఆయుర్వేద కళాశాలల్లోని   టీచింగ్ ఫార్మసీ మరియు క్వాలిటీ టెస్టింగ్ లాబొరేటరీ అవసరాల కోసం నిబంధనలు ఉన్నాయి . చూర్ణంవట్టి గుగ్గులుఅవస -అరిష్టస్నేహ కల్పక్షార  మరియు లవణంఅవలేహకుపిపక్వ రసాయన వంటి వివిధ రకాల ఆయుర్వేద ఔషధాల తయారీకి అవసరమైన సరైన శిక్షణ సౌకర్యాలతో ఫార్మసీ బోధనఔషధ గుర్తింపు. ఔషధ నాణ్యత పరిశీలన  కోసం కూడా లాబొరేటరీ ఉపయోగించబడుతుంది.

ఔట్-పేషెంట్ మరియు ఇన్-పేషెంట్ డిపార్ట్‌మెంట్ నుండి రిఫర్ చేయబడిన రోగులపై రొటీన్పాథాలజీబయోకెమికల్ మరియు హెమటోలాజికల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఆయుర్వేద రోగనిర్ధారణ పద్ధతులను నిర్వహించడానికి నిర్దిష్ట మౌలిక సదుపాయాలు మరియు మానవశక్తితో ఆసుపత్రి కాంప్లెక్స్‌లో క్లినికల్ డయాగ్నసిస్ మరియు పరిశోధనల కోసం క్లినికల్ లాబరేటరీ సదుపాయం ఆస్పత్రి కలిగి ఉండాలన్న నిబంధన కూడా ఉంది. 

ఆయుర్వేదంలో 16 పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రానికి తప్పనిసరి అయిన సెంట్రల్ రీసెర్చ్ లాబొరేటరీ మరియు యానిమల్ ఎక్స్‌పెరిమెంటేషన్ లాబొరేటరీ (యాజమాన్యం లేదా సహకారంతో) కాకుండాకింది అంశాలకు కూడా  ప్రయోగశాలలు తప్పనిసరి:

1. శారీర క్రియ,

2. ద్రవ్యగుణ,

3. రస శాస్త్రంభైషజ్య కల్పన

4. రోగ నిర్ధారణ  వికృతి విజ్ఞాన మరియు

5. రచనా షరీరకు డిసెక్షన్ హాల్

 భాగంగా  ప్రాథమిక సూత్రాల విభాగం మినహా అన్ని విభాగాలు క్లినికల్ లేదా ప్రయోగాత్మకంగా పరిశోధన అధ్యయనాలను నిర్వహిస్తాయి. సాహిత్య పరిశోధన కార్యక్రమాలను  ప్రాథమిక సూత్రాల విభాగం చేపడుతుంది. 

అంతేకాకుండాశాస్త్రీయ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి  పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులకు “ సైంటిఫిక్ రైటింగ్ ఎ పబ్లికేషన్ ఎథిక్స్ పై నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ శిక్షణను అందిస్తోంది.

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS) భారతదేశంలో ఆయుర్వేద పరిశోధన  సూత్రీకరణ మరియు సమన్వయం కోసం అత్యున్నత సంస్థగా పనిచేస్తోంది.   శాస్త్రవేత్తలు మరియు ఇతర నిపుణుల బృందం తో ఒక ప్రత్యేక పరిశోధన నిర్వహణ సమాచార వ్యవస్థ (RMIS)”ను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ప్రారంభించింది. ఆయుర్వేదం మరియు ఇతర సంబంధిత శాస్త్రాల రంగంలో  ఆయుర్వేద ఆధారిత అంశాలపై భారతదేశంతో పాటు ఇతర దేశాలలో పరిశోధనలు సాగిస్తున్న  పరిశోధకులకు  పరిశోధన నిర్వహణ సమాచార వ్యవస్థ సహకారం అందిస్తోంది. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆయుష్ రీసెర్చ్ పోర్టల్ (వెబ్ ఆధారిత పోర్టల్)ను కూడా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నిర్వహిస్తోందిఇందులో 35928 పరిశోధనా పత్రాలు / సారాంశాలు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.

ఈ వివరాలను  ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

***


(Release ID: 1846287)
Read this release in: English , Urdu