భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
గత 3 సంవత్సరాలలో ఢిల్లీలో రుతుపవనాలకు ముందు కాలంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి : కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర నగరంలో ఉష్ణోగ్రత మార్పులను ప్రభావితం చేయడంలో, వేడి ప్రదేశంగా మారడానికి గల ప్రధానకారణాలలో పట్టణీకరణ ఒకటి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
28 JUL 2022 12:16PM by PIB Hyderabad
ఢిల్లీలో రుతుపవనాలకుముందు ఉపరితల గాలి ఉష్ణొగ్రత, భూతల ఉష్ణోగ్రతలలో గణనీయమైన పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని, కేంద్ర శాస్త్ర ,సాంకేతికశాఖ మంత్రి (స్వతంత్ర), భూ విజ్ఞాన,ప్రధానమంత్రి కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుఇంధనం, అంతరిక్షశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆయన సభముందుంచారు. గత మూడు సంవత్సరాలుగా రుతుపవనాలకు ముందు ఢిల్లీలోగరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలలో పెరుగుదల కనిపిస్తోందని అయితే ఇందుకు అనుగుణంగా తేమ పెరుగుదలలో మార్పు లేదని అన్నారు.
ఢిల్లీలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు విలువల వివరాలు, సంబంధిత తేమకు సంబంధించిన వివరాలు గత మూడు సంవత్సరాలలో కింది విధంగా ఉన్నాయి. సఫ్ధర్ జంగ్ స్టేషన్ అందించిన వివరాలు కిందివిధంగా ఉన్నాయి.
|
సంవత్సరం
|
( ̊ C)
రుతుపవనాలకుముందు
గరిష్ఠ సగటు ఉష్ణోగ్రత
|
( ̊ C)
రుతుపవనాలకుముందు
కనిష్ఠ సగటు ఉష్ణోగ్రత
|
రుతుపవనాలకు ముందు
సగటు ఆర్‌హెచ్ 0300
UTC (%)
|
రుతుపవనాలకు ముందు
సగటు ఆర్.హెచ్ 1200
UTC (%)
|
|
|
|
|
|
2020
|
34.4
|
20.7043
|
68.4
|
43.5
|
2021
|
36.0
|
21.35484
|
61.4
|
37
|
2022
|
37.9
|
21.96667
|
60
|
31
|
ఢిల్లీలో రుతుపవనాలకు ముందు ఉష్ణోగ్రతల తీరు తెన్నులు, దాని పర్యవసానాలపై పలు అధ్యయనాలు నిర్వహించడం జరిగింది. ఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రతలలో మార్పులు రావడానికి ప్రధానకారణాలలో ఒకటి, నగరీకరణ.ఢిల్లీ నగరంలో గల రెండు స్టేషన్లలో ఒకటి సఫ్దర్‌జంగ్, మరొకటి ఢిల్లీ NCR (పాలెం) శివార్లలో ఉన్న రెండు స్టేషన్‌లలో వార్షిక సగటు కనిష్ట ఉష్ణోగ్రతలో తేడాల ద్వారా ఇది ప్రతిబింబిస్తుంది. నేచర్ పత్రికలో ఇటీవల ఒక వ్యాసం ప్రచురితమైంది. 2022 వర్షాకాలనికి ముందు సుదీర్ఘకాలం పాటు వేడిగాలులు వీయడానికి గల కారణాలను విశ్లేషించింది. దీర్ఘకాలం పాటు వర్షపాతం లేకపోవడం , ఉష్ణప్రసరణ కార్యకలాపాలు , రుతుపవనేతర వర్షాలు లేకపోవడం , ఉత్తర అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ పాకిస్తాన్ , గుజరాత్‌ల మీదుగా దిగువ , మధ్య ఉష్ణమండల స్థాయిలలో వెచ్చని పొడి గాలి వంటి కారణాలను ప్రస్తావించింది. వడగాడ్పుల విషయంలో వాతావరణ విభాగం ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. దేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు, అలాగే వడగాడ్పులు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎక్కువగా కనిపించినట్టు ఆ పత్రిక తెలిపింది. ఐఎండి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి తగిన ముందస్తు ప్రణాళిక కోసం మార్చి నెల చివరి వారంలోనే ఉష్ణోగ్రతల అంచనాలను ఐఎండి విడుదల చేస్తూ వచ్చింది. ఈ సమయంలో వడగాడ్పులకు సంబంధించిన పరిస్థితులపైనా ఇది సమచారం అందిస్తూ వచ్చింది. దీనికి తోడు,
ఢిల్లీలో హీట్ వేవ్ హెచ్చరికతో సహా తీవ్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సూచన , కలర్ కోడ్ హెచ్చరికలు రెండు రోజుల అంచనా సూచనలతోను, రాగల ఐదు రోజుల వరకు రోజువారీ ప్రాతిపదికన జారీ అవుతుంటాయి.
భారత వాతావరణ విభాగం, హీట్ వేవ్ లపై ముందస్తు హెచ్చరికల ప్రదర్శన ప్రాజెక్టును (FDP)ని ప్రారంభించింది, దీని కింద వేడి గాలులకు సంబంధించి సేకరించిన సమాచారం, వేడిగాలుల వాతావరణ వ్యవస్థలు, గణాంకాల ఆధారంగా తగిన నిర్ధారణ సూచనలతో సహా వివరణాత్మక రోజువారీ నివేదిక. ఐదు రోజుల హెచ్చరికలు సిద్ధం చేస్తున్నది. ఈ బులిటన్‌ను ఆరోగ్య విభాగంతో సహా అన్ని విభాగాలకు పంపడం జరుగుతోంది. ఐఎండి వడగాడ్పులకు సంబంధించి ఉదయం 8 గంటల సమయంలో రాగల 24 గంటల కాలానికి సంబంధించి బులిటన్ ను విడుదల చేస్తున్నది. ఇది ఆరోజు కార్యకలాపాల ప్రణాళికకు ఉపకరిస్తుంది. ఈ బులిటన్‌ను సంబంధిత విభాగాలన్నింటికీ పంపడం జరుగుతోంది. ఈ బులిటన్‌లు అన్నీ ఐఎండి వెబ్‌సైట్‌లో కూడా పోస్ట్ చేస్తున్నారు. హీట్ వేవ్ పేరుతో ఒక ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేశారు.
స్థానిక ఆరోగ్య విభాగాలతో కలిసి ఐఎండి దేశంలోని వివిధ ప్రాంతాలలో హీట్ యాక్షన్ ప్లాన్‌ను చేపట్టింది. వేడి గాలులకు సంబంధించి అవగాహన కల్పించడం, ఇందుకు సంబంధించి చేపట్టవలసిన కార్యాచరణ విషయాలపై తగిన సూచనలు చేసేందుకు ఈ చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఎన్‌డిఎంఏ, ఐఎండిలు అధిక ఉష్ణోగ్రతకు అవకాశం ఉన్న, వేడి గాలుల అవకాశం ఉన్న 23 రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇవి కార్యాచరణను రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
****
(Release ID: 1846273)
Visitor Counter : 164