వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జూన్ 2021లో 52.8 బిలియన్ల డాలర్ల నుంచి జూన్ 2022 నాటికి 64.9 బిలియన్ల డాలర్లకు పెరిగిన భారతదేశ మొత్తం (సరకులు - సేవలు) ఎగుమతులు


Posted On: 27 JUL 2022 5:14PM by PIB Hyderabad

జూన్ 2021లో మొత్తం (మర్చండైజ్ ప్లస్ సర్వీసెస్) ఎగుమతులు 52.8 బిలియన్ల డాలర్ల నుంచి జూన్ 2022లో 64.9 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. మొత్తం (సరకులు - సేవలు) దిగుమతులు జూన్ 2021లో 52.9 బిలియన్ల డాలర్ల నుంచి జూన్ 2022 నాటికి 82.4 బిలియన్ల డాలర్ల కు పెరిగాయి.

ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది:

i. విదేశీ వాణిజ్య విధానం (2015-20) 30-09-2022 వరకు పొడిగించడం.

ii. ఎగుమతులను ప్రోత్సహించడానికి అనేక పథకాల ద్వారా సహాయం, అవి ఎగుమతి పథకం (TIES) , మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ (MAI) పథకం కోసం వాణిజ్య మౌలిక సదుపాయాలు.

iii. కార్మిక ఆధారిత వస్త్ర ఎగుమతి ప్రోత్సహించడానికి రాష్ట్ర , కేంద్ర పన్నులు , పన్నుల (RoSCTL) రాయితీ పథకం 07.03.2019 నుంచి అమలు కానుంది.

iv. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల ఉపశమన (RoDTEP) పథకం 01.01.2021 నుంచి అమలు చేశారు.

v. వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి , ఎగుమతిదారులచే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వినియోగాన్ని పెంచడానికి ఆరిజిన్ సర్టిఫికేట్ కోసం కామన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించారు.

vi. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అనుసరించడం ద్వారా సేవల ఎగుమతులను ప్రోత్సహించడం , వైవిధ్య పరచడం కోసం 12 ఛాంపియన్ సేవా రంగాలు గుర్తించారు.

vii. ప్రతి జిల్లాలో ఎగుమతి సామర్థ్యం ఉన్న ఉత్పత్తులను గుర్తించడం, ఈ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఉన్న అడ్డంకులను పరిష్కరించడం , జిల్లాలో ఉపాధి కల్పించడానికి స్థానిక ఎగుమతిదారులు/తయారీదారులకు మద్దతు ఇవ్వడం ద్వారా జిల్లాలు ఎగుమతి కేంద్రాలుగా ప్రారంభించారు.

viii. భారతదేశ వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత , పెట్టుబడి లక్ష్యాలను ప్రోత్సహించడంలో విదేశాలలో భారతీయ మిషన్ల క్రియాశీల పాత్ర మెరుగుపడింది.

ix. కోవిడ్ మహమ్మారి కాలంలో వివిధ బ్యాంకింగ్ , ఆర్థిక రంగ ఉపశమన చర్యల ద్వారా దేశీయ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ప్యాకేజీని ప్రకటించారు, ప్రత్యేకించి ఎగుమతుల్లో ప్రధాన వాటాను కలిగి ఉన్న MSMEలకు.

ఈ సమాచారాన్ని వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ తెలిపారు. ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

****

 



(Release ID: 1846165) Visitor Counter : 111


Read this release in: English , Urdu