ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ పాలసీ
Posted On:
27 JUL 2022 2:44PM by PIB Hyderabad
నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ పాలసీ ముసాయిదా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల నుండి వ్యక్తిగతేతర డేటా మరియు అనామక డేటాను రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎకో-సిస్టమ్ ద్వారా సురక్షితంగా యాక్సెస్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
డేటా/డేటాసెట్‌లు/మెటాడేటా నియమాలు, ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు గోప్యత, భద్రత మరియు నమ్మకాన్ని నిర్ధారిస్తూ వ్యక్తిగతేతర డేటా సెట్‌లను భాగస్వామ్యం చేసేందుకు ప్రోటోకాల్‌ల కోసం సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం ఈ విధానం లక్ష్యం.
ఐడీఎంఓ ప్రతి మంత్రిత్వ శాఖలో సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా డేటా నిర్వహణను ప్రామాణీకరించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర స్కీమాటిక్ ప్రోగ్రామ్‌లతో సన్నిహితంగా సమన్వయం చేస్తుంది. ఇంకా ఇది మంత్రిత్వ శాఖలు, ప్రైవేట్ కంపెనీలలో ఉన్న వ్యక్తిగతేతర డేటాసెట్‌లను ఇండియా డేటాసెట్స్ ప్రోగ్రామ్‌లో చేర్చడాన్ని వేగవంతం చేస్తుంది.
ప్రజల సంప్రదింపుల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 26 మే 2022న నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ పాలసీ ముసాయిదాని విడుదల చేసింది. ప్రస్తుతం ముసాయిదా విధానం ఖరారు దశలో ఉంది.
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.
***
(Release ID: 1845757)