గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్ డి&పిర్) కు మరియు యునైటెడ్ కింగ్ డమ్(యుకె)లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ (యుఒఆర్)కు మధ్య సంతకాలు అయిన అవగాహన పూర్వకఒప్పంద పత్రాని (ఎమ్ఒయు) కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
27 JUL 2022 5:25PM by PIB Hyderabad
అభివృద్ధి చెందుతున్న దేశాల లో వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి రంగం లో సహకారాని కి జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్ డి & పిఆర్) కు మరియు యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ (యుఒఆర్)కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలైన సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకురావడమైంది. ఈ ఎమ్ఒయు పై 2022వ సంవత్సరం మార్చి నెల లో సంతకాలు జరిగాయి.
ప్రభావం:
ఈ ఎమ్ఒయు ఎన్ఆర్ డిపిఆర్ ఫేకల్టీ కి వారి జ్ఞానాన్ని సంపాదించుకోవడం లోను, జ్ఞానాన్ని విస్తరించుకోవడం లోను, వ్యవసాయం, పోషణ విజ్ఞానం మరియు గ్రామీణాభివృద్ధి లలో ఓ అంతర్జాతీయ స్థాయి వృత్తి కుశలత కలిగినటువంటి నెట్ వర్క్ ను అభివృద్ధి పరచడం లోను సహాయకారి కానుంది.
రెండు సంస్థలు కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా వ్యావసాయిక అర్థ శాస్త్రం లో, గ్రామీణ అభివృద్ధి లో, జీవనోపాధి మార్గాల లో మరియు పోషణ విజ్ఞానం సంబంధి అధ్యయనాల లోను చెప్పుకోదగిన స్థాయి లో పరిశోధన పరమైన ప్రావీణ్యాన్ని జోడించగలుగుతాయి. అంతర్ విభాగాల వారీ పరిశోధన మెరుగుదల కు, సామర్థ్యాల పెంపుదల కు ఈ విధమైన పరిశోధన పరమైన ప్రావీణ్యం అవసరం.
పూర్వరంగం:
అల్పాదాయ దేశాలు మరియు మధ్యాదాయ దేశాల లో వ్యవసాయ సంబంధిత జీవనోపాధి పరం గా పరిశోధనల ను నిర్వహించడం లో శక్తి రంగ వ్యయాన్ని నిర్ధారించడం, ధరించదగినటువంటి ఏక్సెలరోమెట్రిక్ సాధనాలు, ఇంకా సెన్సర్ ఆధారితం గా పని చేసే ఉపకరణాల సాయం తో పోషణ సంబంధి అంచనాల ను మెరుగు పరచడం వంటి గ్రామీణ అభివృద్ధి రంగం లోని వివిధ పరిశోధన కార్యకలాపాల నిర్వహణ లో యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ తో కలసి ఎన్ఐఆర్ డిపిఆర్ పని చేస్తున్నది. అంతేకాకుండా మహిళలు మరియు శిశువుల సంబంధిత అభివృద్ధి రంగం లో కూడా ఎన్ఐఆర్ డిపిఆర్ పాటుపడుతోంది.
***
(Release ID: 1845630)
Visitor Counter : 223