రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల పై టోల్ ప్లాజాలను దాటేందుకు నెలవారీ పాసులు
Posted On:
27 JUL 2022 2:43PM by PIB Hyderabad
జాతీయ రహదారులపై జాతీయ రుసుము నిబంధనల (నేషనల్ ఫీ రూల్స్)కు అనుగుణంగా సంబంధిత రాయితీ ఒప్పందంతో పాటుగా వినియోగదారు రుసుమును వసూలు చేయడం జరుగుతోంది. జాతీయ రహదారుల రుసుము (ధరల, వసూలు నిర్ణయం) నిబంధనలు, 2008 ప్రకారం, జతీయ రహదారులలో ఒక భాగాన్ని, శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగంను ఉపయోగించే ఒక డ్రైవరు, యజమాని లేదా యాంత్రిక వాహన ఇన్‌చార్జి అయిన వ్యక్తి జరిపిన ఒక నెల రోజులలో టోల్ ప్లాజా నుంచి గరిష్టంగా యాభైసార్లు ప్రయాణించవలసి వచ్చినప్పుడు రాయితీ రుసుమును ఎంచుకొని చెల్లించవలసిన రుసుములో మూడు వంతుల రుసుమును చెల్లించి ప్రయాణించవచ్చు. దీనితో పాటుగా వినియోగదారు రుసుము నెలవారీ పాసుల రూపంలో అందుబాటులో ఉండి జాతీయ రహదారుల రుసుము నిబంధనలు, సంబంధిత రాయితీ ఒప్పందం ప్రకారం వర్తిస్తుంది. జాతీయ రహదారుల రుసుము (ధరల, వసూలు నిర్ణయం) నిబంధనలు, 2008 ప్రకారం, వాణిజ్యేతర ప్రయోజనాల కోసం ఒక మెకానికల్ వాహన సొంతదారు అయిన వ్యక్తి జతీయ రహదారులలో ఒక భాగాన్ని, శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగంను ఉపయోగించేటప్పుడు, 2007-08 సంవత్సర భూమికగా తీసుకున్న రేటు ప్రకారం ఒక నెలకు నూట యాభై రూపాయలను, రుసుముల నిబంధనల ప్రకారం ఏటా సవిరించిన మొత్తాన్ని చెల్లించి టోల్ ప్లాజాను దాటేందుకు అధికారాన్ని పొందినప్పుడు ఆ పాసును కేవలం డ్రైవరుకు, యజమానికి, లేదా అటువంటి మెకానికల్ వాహనం ఇన్‌చార్జి అయిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఈ వాహనం, వ్యక్తి ఆ టోల్ ప్లాజాకు ఇరవై కిలోమీటర్ల లోపు నివసించే వారై ఉండాలి. కాగా, క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ వ్యవస్థ ఆధారంగా పాస్‌ను జారీ చేసినప్పుడు అటువంటి రాయితీలు ఇవ్వడం జరగదు. అలాగే, అటువంటి డ్రైవరు, యజమాని లేదా మెకానికల్ వాహన ఇన్‌చార్జికి సర్వీసు రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రోడ్డు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఈ రాయితీ వర్తించదు.
జాతీయ రహదారుల రుసుము నిబంధనలు, 2008 ప్రకారం, వాణిజ్యేతర ప్రయోజనాల కోసం మెకానికల్ వాహనాన్ని నమోదు చేసుకొని, జాతీయ రహదారిపై ఒక భాగంలో, శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగంలో దానిని నడిపేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూడు వందల పదిహేను రూపాయిల రుసుమును చెల్లించడం ద్వారా పాస్‌ను పొందవచ్చు. అటువంటి పాసును టోల్ ప్లాజాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో నివసించే మెకానికల్ ఇన్ చార్జి అయిన వ్యక్తి, యజమాని, డ్రైవరుకు జారీ చేస్తారు.
ఈ సమాచారాన్ని కేంద్ర రహదారి రవాణా & హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
****
(Release ID: 1845526)