బొగ్గు మంత్రిత్వ శాఖ
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయంగా పరిశుభ్రమైన బొగ్గు సాంకేతికత అభివృద్ధి కృషికి ప్రోత్సాహం
Posted On:
27 JUL 2022 3:42PM by PIB Hyderabad
భారత ఇంధన వ్యవస్థలో బొగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం వరకు విద్యుత్ ఉత్పత్తి బొగ్గుఆధారిత మైనది. విద్యుత్ ఉత్పత్తితో పాటు, ఇతర రంగాలైన స్టీలు, దుక్క ఇనుము, సిమెంటు, పేపర్ తదితరాలకు కూడా బొగ్గు ను ప్రధాన ఇంధనంగా వాడుతారు.మేక్ ఇన్ ఇండియా కు సంబంధించిన చర్యలు, పెద్ద ఎత్తున ఆర్ధిక వృద్ధికి సంబంధించిన అంచనాలతో రాగల సంవత్సరాలలో బొగ్గు వాడకం గణనీయంగా పెరగనుంది. అయితే, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రస్తుతం 70 శాతంగా ఉంది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెరగడం వల్ల ఇది బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 50 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
దేశానికి ఇంధనరంగంలో భద్రత కల్పించేందుకుగాను, పరిశుభ్రమైన బొగ్గు సాంకేతికతను బొగ్గు రంగంలో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కింది చర్యలు తీసుకోనున్నది.
కోకింగ్ కోల్ ఉత్పత్తిని పెంచేందుకు కోకింగ్ కోల్ మిషన్‌ను ప్రభుత్వం చేపట్టింది. ఇది స్టీలు రంగం డిమాండ్ సరఫరాను తట్టుకునే విధంగా చూడడం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద 12 కోకింగ్ కోల్ వాషరీలను ఒక్కొక్కటి 30 ఎంటివైల సామర్ధ్యంతో నిర్మించనున్నారు.
కోల్ గాసిఫికేషన్ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. 2030నాటికి 100 ఎంటిలను గాసిఫై చేయాలన్నది లక్ష్యం. ఈ మిషన్ కింద ఉపరితల బొగ్గు, లిగ్నయిట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతోంది.
ప్రభుత్వం కోల్ నిక్షేపాలు గల ప్రాంతాలనుంచి సిబిఎం వాయువులను ఉత్పత్తిచేస్తోంది. అలాగే ప్రభుత్వం కోల్ నుంచి హైడ్రోజన్ మిషన్‌పై పనిచేస్తోంది. ఈ చర్యలన్నీ దేశ భవిష్యత్ ఇంధన భద్రతకు ఉపయోగపడనున్నాయి.
మేక్ ఇన్ ఇండియా మిషన్ కింద, ప్రభుత్వం దేశీయంగా క్లీన్ కోల్ టెక్నాలజీ ని అభివృద్దిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి లోక్‌సభకు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1845459)
Visitor Counter : 148