గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంజిఎన్ఆర్ఈజిఏ సిబ్బంది హాజరు విధానంలో మార్పు

Posted On: 27 JUL 2022 4:10PM by PIB Hyderabad
రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( ఎంజిఎన్ఆర్ఈజిఏ) మరింత పారదర్శకంగా అమలు జరిగేలా చూసేందుకు సిబ్బంది హాజరును పని జరుగుతున్న ప్రాంతంలో 2021 మే 21వ తేదీ నుంచి జియో-ట్యాగ్ చేయబడిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్యాప్ సహాయంతో సమయం ముద్రించే ఫోటో తో సహా రోజుకు ఒకసారి తీసుకోవడం జరుగుతున్నది. 20 లేదా అంతకు మించి ఉన్న కార్మికులకు ఈ విధానం అమలు జరుగుతున్నది. దీనివల్ల పథకంలో ప్రజల భాగస్వామ్యం పెరిగి పనులు అమలు జరుగుతున్న తీరును ప్రజలు గమనించేందుకు అవకాశం కలగడమే కాకుండా చెల్లింపులు కూడా వేగంగా జరుగుతాయి. 
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన సలహాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని 20 లేదా అంతకు మించి లబ్ధిదారులు  పనిచేస్తున్న ప్రాంతాలలో సిబ్బంది హాజరును 16.05.2022 నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
పనిచేస్తున్న మహిళలు ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి హాజరును తీసుకొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కోరిన నాటి నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసే విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వ శాఖ శిక్షణ ఇస్తుంది. ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు ఎన్ఐసి సహకారంతో పరిష్కరించడం జరుగుతుంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన సలహాలు, సూచనలను అమలు చేయడం జరుగుతుంది. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. 
రాష్ట్రాల నుంచి అందిన అభ్యర్ధనల మేరకు తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాలు కింద ఇవ్వబడ్డాయి.  
1. హాజరు, మొదటి ఫోటో అప్‌లోడ్ చేసిన 4 గంటల తర్వాత రెండో ఫోటో తీయడానికి వీలుగా ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ సవరించబడింది.దీనిలో నిర్ణీత సమయంలో మాత్రమే ఫోటో, హాజరు సేకరించే నిబంధన సులభతరం అవుతుంది. .మొదటి ఫోటోతో పాటు ఉదయం హాజరు ఆఫ్‌లైన్ మోడ్‌లో నమోదు చేయబడుతుంది.  నెట్‌వర్క్‌ పరిధి లోకి  పరికరం వచ్చిన తర్వాత అప్‌లోడ్ చేయబడుతుంది. 
2. అసాధారణమైన పరిస్థితుల కారణంగా హాజరు అప్‌లోడ్ చేయలేని పక్షంలో, మాన్యువల్ హాజరును అప్‌లోడ్ చేయడానికి జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కి అధికారం ఇవ్వబడింది.

ఎన్ఎంఎంఎస్   మొబైల్ యాప్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళంలో అందుబాటులో ఉంది.
ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 1845447) Visitor Counter : 220


Read this release in: English , Urdu