శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన ఆరు సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాల 5వ సంయుక్త సమావేశం : ఇంటిగ్రేటెడ్ స్టార్టప్ లు ఇంటిగ్రేటెడ్ ఆర్ అండ్ డి కి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటన
40 లైన్ మినిస్ట్రీల నుండి ఎస్ అండ్ టి జోక్యం అవసరమైన 214 ప్రాంతాలను గుర్తించి, శాస్త్రీయ అనువర్తనాలు, సాంకేతిక పరిష్కారాల కోసం మ్యాప్ చేసినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి
శాస్త్రీయ అనువర్తనాల కోసం లైన్ మినిస్ట్రీల నుండి పెరుగుతున్న అభ్యర్థనలు, సాధారణ మంత్రిత్వ శాఖల సాంకేతిక , సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి సైన్స్ మంత్రిత్వ శాఖలు , విభాగాలను భాగస్వాములను చేయాలన్న ప్రధాన మంత్రి మోదీ దార్శనికతకు నిదర్శనం: డాక్టర్ జితేంద్ర సింగ్
36 రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించిన 172 ప్రధాన సమస్యలను గుర్తించగా, 163 సాంకేతిక సమస్యలను రాష్ట్రాలు 24 కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల నుండి పరిష్కారాలను కోరుతున్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
16 JUL 2022 6:53PM by PIB Hyderabad
అగాదాలను ఛేదించడానికి , సమన్వయ సమీకృత విధానాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ శాస్త్రీయ సంస్థల ఉమ్మడి సమావేశాలను నిర్వహించడం ద్వారా ప్రారంభించిన ధోరణిని కొనసాగిస్తూ, కేంద్ర సైన్స్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సి ఎస్ ఐ ఆర్, ఎర్త్ సైన్సెస్, స్పేస్ , అటామిక్ ఎనర్జీతో సహా ఆరు సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాల 5వ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఆర్ అండ్ డి అవసరాన్ని మంత్రి నొక్కిచెప్పారు.
రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో, శాస్త్ర/ సాంకేతిక జోక్యానికి అవసరమైన 214 రంగాలను అంతరిక్షం, అణుశక్తితో సహా మొత్తం ఆరు సైన్స్ డిపార్ట్ మెంట్ లు సైంటిఫిక్ అప్లికేషన్ లు, టెక్నలాజికల్ సొల్యూషన్స్ కోసం 40 లైన్ మినిస్ట్రీల నుంచి మ్యాప్ చేసినట్లు మంత్రి తెలియజేశారు.
శాస్త్రీయ అనువర్తనాలు, పరిష్కారాల కోసం లైన్ మినిస్ట్రీల నుండి పెరుగుతున్న అభ్యర్థనలు సాధారణ మంత్రిత్వ శాఖలు విభాగాల సాంకేతిక , సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి సైన్స్ మంత్రిత్వ శాఖలు విభాగాలను భాగస్వాములను చేయాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను చాటుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.లైన్ మినిస్ట్రీస్ కు శాస్త్రీయ పరిష్కారాలు , ఇన్ పుట్ లను అందిస్తూనే, బడ్జెట్ షేరింగ్ యొక్క ఒక సంపూర్ణ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
2015 లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యంతో, వివిధ మంత్రిత్వ శాఖలు , విభాగాల ప్రతినిధులు, ఇస్రో , అంతరిక్ష విభాగానికి చెందిన శాస్త్రవేత్తలతో విస్తృతమైన సంభాషణలో పాల్గొన్నామని, మౌలిక స దుపాయాల అభివృద్ధితో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడం వంటి వాటిని మెరుగుపరచడం, వేగవంతం చేసే విధానాలు రూపొందించడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునిక సాధనంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవడానికి
ఢిల్లీలో విస్తృతమైన మేధోమథనం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు.
32 మంత్రిత్వ శాఖలు, విభాగాలను 'సమస్యా ప్రకటనల' కోసం సంప్రదించినట్లు మంత్రి తెలియజేశారు. సిఎస్ ఐఆర్ 20 ఛాలెంజ్ ప్రాంతాలకు నాయకత్వం వహిస్తుంది మొత్తం ఎక్సర్ సైజ్ సి ఎస్ ఐ ఆర్ ద్వారా సమన్వయం చేయబడుతున్నందున లైన్ మినిస్ట్రీస్ ద్వారా ఎదురయ్యే 46 ఛాలెంజ్ ప్రాంతాల్లో పాల్గొంటుంది.
వ్యవసాయం, ఆహారం, విద్య, నైపుణ్యం, రైల్వేలు, రోడ్లు, జల్ శక్తి, విద్యుత్ మరియు బొగ్గు వంటి రంగాలకు వివిధ శాస్త్రీయ అనువర్తనాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇతర సైన్స్ డిపార్ట్ మెంట్ లతో పాటు , డిబిటి , ఇస్రో కూడా కొన్ని సవాళ్ల పరిష్కారాల అభివృద్ధి/విస్తరణలో నాయకత్వం వహించడానికి తమ ప్రాధాన్యతను సమర్పించాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల తరహాలో 36 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు 172 ప్రధాన సమస్యలను గుర్తించాయని, 24 కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల నుండి పరిష్కారాలను కోరుతూ రాష్ట్రాలు 163 సాంకేతిక సమస్యలను లేవనెత్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.మొత్తం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎస్ టి ఐ (సైన్స్ టెక్నాల జీ అండ్ ఇన్నోవేషన్ మ్యాపింగ్ ఎక్సర్ సైజ్ ఆరు నెలల కాలంలో పూర్తి కావడం పట్ల ఆయన సంతృప్తి వ్య క్తం చేశారు. ఇన్నోవేషన్ ర్యాంకింగ్, స్టార్టప్ ర్యాంకింగ్, ఎస్ అండ్ టీ ఆర్గనైజేషన్స్ సంఖ్య, ఆర్ అండ్ డి ల్యాబ్స్, యూనివర్సిటీలు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్ లు, ఎంఎస్ ఎమ్ ఈలు, పరిశ్రమలు, క్లస్టర్ లు, గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ మొదలైన వాటి పరంగా ఎన్ ఈతో సహా రాష్ట్రాల మ్యాపింగ్ జరిగిందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర ఎస్ అండ్ టి మంత్రుల సదస్సుకు సంబంధించిన ఎజెండా, ఇతివృత్తాలను ముందుగానే సిద్ధం చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్ని సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాలను కోరారు. రాష్ట్రాలు, పారిశ్రామిక ప్రతినిధులు ,
ఇతర భాగస్వాములతో జరిగే మొట్ట మొదటి జాతీయ సైన్స్ కాన్ క్లేవ్ లో రాష్ట్రాల ప్రత్యేక చర్చ లను చేర్చవచ్చని ఆయన చెప్పారు.
ప్రతిపాదిత సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సెంటర్ (ఎస్ టి సి సి) అమల్లోకి రావడానికి ముందు, భారతదేశ శాస్త్రీయ ప్రగతి గురించి సాధారణ అవగాహన కల్పించడానికి అన్ని శాఖల విజయ గాథలను క్రోడీకరించి, సామాన్య ప్రజలకు అందించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.విజయగాథలపై వర్క్ షాప్ లను క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, డి ఎస్ టి సెక్రటరీ, స్పేస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ, బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ సెక్రటరీ, డిఎఇ సెక్రటరీ, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సెక్రటరీ, ఇతర సైన్స్ డిపార్ట్ మెంట్ ల ప్రతినిధులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
<><><><><>
(Release ID: 1842106)
Visitor Counter : 151