సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

కేవీఇసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మనోజ్ కుమార్


హస్తకళాకారులకు జీవనోపాధి కల్పించడం ఖాదీకి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే అంశాలకు ప్రాధాన్యత

Posted On: 16 JUL 2022 7:04PM by PIB Hyderabad

   కేవీఇసి చైర్మన్ గా  శ్రీ మనోజ్ కుమార్ 2022 జూలై 15 శుక్రవారం   బాధ్యతలు స్వీకరించారు.  బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన శ్రీ మనోజ్ కుమార్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ప్రాధాన్యత ఇచ్చి  బాధ్యతలు నిర్వర్తిస్తానని  శ్రీ మనోజ్ కుమార్ తెలిపారు. స్వావలంబన భారతదేశ నిర్మాణం కోసం సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో  చిన్న మరియు సూక్ష్మ యూనిట్ల స్థాపనకు  కేవీఇసి అమలు చేస్తున్న వివిధ పథకాల  ద్వారా సహకారం అందిస్తామని అన్నారు. స్వావలంబన భారతదేశ నిర్మాణం కోసం  ఎక్కువ ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే శక్తిగా అభివృద్ధి సాధించాలన్నది  కేవీఇసి లక్ష్యమని  శ్రీ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. 

గతంలో కేవీఇసి ఎక్స్‌పర్ట్ మెంబర్ (మార్కెటింగ్)గా పనిచేసిన శ్రీ మనోజ్ కుమార్ మార్కెటింగ్ మరియు గ్రామీణాభివృద్ధి రంగాల్లో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ప్రధాని నేతృత్వంలో దేశంలో ఖాదీ "నిశ్శబ్ద విప్లవం"లా వ్యాపిస్తోందని ఆయన అన్నారు . గత ఏళ్లలో "ఖాదీ ఇండియా" అత్యద్భుతమైన విజయాలు సాధించిందని ఆయన అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం నేరుగా హస్తకళాకారులకు అందేలా చూసేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీ మనోజ్ కుమార్ తెలిపారు. దీనివల్ల వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని,బలహీన వర్గాలకు చెందిన వారు ఆర్థిక స్వావలంబన సాధిస్తారని అన్నారు. ప్రతి హస్త కళాకారుడికి చేతినిండా పని దొరికేలా చూసేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఖాదీ ఇండియా బ్రాండ్‌ను నూతన  శిఖరాలకు తీసుకెళ్లేందుకు తాను సబ్కా సాత్సబ్‌కా వికాస్” మరియు ఖాదీ ఫర్ నేషన్ఖాదీ ఫర్ ఫ్యాషన్ మరియు ఖాదీ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్” అనే మంత్రాన్ని అనుసరిస్తానని శ్రీ మనోజ్ కుమార్ చెప్పారు . “  భారతదేశంలో ప్రజాదరణ పొందిన విధానంగా ప్రపంచ స్థాయిలో  ఖాదీకి  ప్రాచుర్యం లభించేలా చూసే అంశానికి  అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.  ఖాదీని "లోకల్" నుంచి  "గ్లోబల్"గా మార్చడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరుగుతాయి.  సంస్థ అమలు చేసే చర్యల వల్ల  ప్రపంచవ్యాప్తంగా ఖాదీకి డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది" అని శ్రీ మనోజ్ కుమార్ చెప్పారు.

***


(Release ID: 1842102) Visitor Counter : 194


Read this release in: English , Urdu , Hindi