భారత పోటీ ప్రోత్సాహక సంఘం
సిటిఎస్ టెక్ విడుదల చేసిన మొత్తం వాటాలలో 30% వాటాలను పరోక్ష పెట్టుబడి ద్వారా సేకరించేందుకు బైన్ కాపిటల్ అండ్ బైన్ క్రెడిట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సీసీఐ
Posted On:
15 JUL 2022 5:49PM by PIB Hyderabad
సిటిఎస్ టెక్ విడుదల చేసిన మొత్తం వాటాలలో 30% వాటాలను పరోక్ష పెట్టుబడి ద్వారా సేకరించేందుకు బైన్ కాపిటల్ అండ్ బైన్ క్రెడిట్ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. సిటిఎస్ టెక్ మొత్తం ఆర్థిక వ్యవహారాల్లో 50కి మించి బైన్ కాపిటల్ ఇన్వెస్టర్స్, ఎల్ ఎల్ సి (బైన్ కాపిటల్), బైన్ కాపిటల్ క్రెడిట్ మెంబర్, ఎల్ ఎల్ సి అండ్ బైన్ కాపిటల్ క్రెడిట్ మెంబెర్ II ( బైన్ క్రెడిట్) ఆధీనంలో ఉన్నాయి.
బైన్ కాపిటల్: బైన్ కాపిటల్:అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, చిల్లర వర్తకం, వినియోగ వస్తువులు, కమ్యూనికేషన్స్,ఆర్థిక, మరియు పారిశ్రామిక/ఉత్పత్తి లాంటి వివిధ రంగాల్లో సంస్థకి చెందిన నిధులను పెట్టుబడి పెడుతున్న ఒక ప్రైవేట్ పెట్టుబడి సంస్థ.
బైన్ క్రెడిట్: బైన్ క్రెడిట్ అనేది రుణ పరపతి రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ. మూలధన అవసరాలు, పరపతి రుణాలు, ఎక్కువ ఆదాయం లభించే బాండ్‌లు, ప్రైవేట్ రుణాలు, నిర్మాణాత్మక ఉత్పత్తులు, నాన్-పెర్ఫార్మింగ్ లోన్‌లు మరియు ఈక్విటీలతో సహా వివిధ పరపతి వ్యూహాల రంగంలో పెట్టుబడులు పెడుతుంది. 240 కంటే ఎక్కువ మంది నిపుణులతో కూడిన బైన్ క్రెడిట్ బృందం ప్రపంచవ్యాప్తంగా వేలాది కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల వ్యవహారాలకు స్వతంత్ర విశ్లేషణ ద్వారా విలువలు జోడిస్తుంది.
సిటిఎస్ టెక్: సిటిఎస్ టెక్ హెల్త్ కేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లో 80% వాటాను సిటిఎస్ టెక్ కలిగివుంది. అయితే, ఎటువంటి వ్యాపార కార్యక్రమాలను సిటిఎస్ టెక్ నిర్వహించడం లేదు.ఆరోగ్య సంరక్షణ సిటీ ఇండియా సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ సర్వీసెస్, హెల్త్‌కేర్ QA టెస్ట్ ఆటోమేషన్, హెల్త్‌కేర్ టెక్నాలజీ కన్సల్టింగ్, హెల్త్‌కేర్ బీఐ / అనలిటిక్స్ మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో వ్యాపారం, అవుట్‌సోర్సింగ్ సేవలను అందిస్తుంది.
దీనికి సంబంధించిన సీసీసీ వివరణాత్మక ఉత్తర్వులు విడుదల అవుతాయి.
***
(Release ID: 1841996)
Visitor Counter : 133