బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎన్‌సీఎల్ పనితీరుని సమీక్షించిన బొగ్గు శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్
50 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన
Posted On:
15 JUL 2022 5:01PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్ మాట్లాడుతూ " స్థిరమైన బొగ్గు మైనింగ్‌ను ప్రోత్సహించడానికి నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) ఆసక్తిగా ఉందని, ఇది బొగ్గు మినీరత్న ద్వారా ఇటీవలి కార్యక్రమాలలో ప్రతిబింబిస్తోందని అన్నారు. కంపెనీ పనితీరును అంచనా వేయడానికి డాక్టర్ జైన్‌తో పాటు జాయింట్ సెక్రటరీ, శ్రీమతి.విస్మిత తేజ్ ఎన్‌సీఎల్‌ని సందర్శించారు.
ఎన్‌సీఎల్ సీనియర్ అధికారులతో ఇంటరాక్ట్ అయిన సందర్భగా ఇంధన రంగంలో దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి బొగ్గు ఉత్పత్తిని మరియు స్థిరమైన పద్ధతిలో కొనసాగించాల్సిన అవసరాన్ని సెక్రటరీ నొక్కిచెప్పారు. పర్యావరణంపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి మైనింగ్ ప్రక్రియలో వినూత్న పద్ధతులను అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు మరియు వ్యాపార వైవిధ్య వ్యూహాలను అనుసరించాలని ఎన్‌సీఎల్ బృందాన్ని కోరారు.ఎన్‌సీఎల్ సీఎండీ శ్రీ భోలా సింగ్,డీటి (పి&పి), సిఓవితో పాటు ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
నిగాహి ఏరియాలో 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు కూడా డాక్టర్ అనిల్ కుమార్ జైన్ శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ 129.35 హెక్టార్ల విస్తీర్ణంలో ఏటా 94 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నెలకొల్పబడుతుంది. అలాగే కార్బన్ ఉద్గారాలను సంవత్సరానికి 78020 టన్నులు తగ్గించడానికి దారి తీస్తుంది. ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు ఎన్‌సీఎల్ ద్వారా కార్యాచరణ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. నికర జీరో లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ పునరుత్పాదక వనరుల నుండి రాబోయే కాలంలో 273 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి సిద్ధంగా ఉంది.
నిగాహి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని సందర్శించి గని ఆపరేషన్‌ను కూడా డాక్టర్ జైన్ పర్యవేక్షించారు. జయంత్ ఏరియాలో కొనసాగుతున్న ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ (కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇటువంటి తొమ్మిది ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లలో రూ. 3100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఎన్‌సీఎల్ పనిచేస్తోంది. వీటిలో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2023-24 నాటికి ఈ ఎఫ్‌ఎంసీ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంతో, ఎన్‌సీఎల్ పర్యావరణ అనుకూలమైన మరియు యాంత్రిక పద్ధతిలో ఉత్పత్తి చేయబడిన మొత్తం బొగ్గును పంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
డాక్టర్ అనిల్ కుమార్ జైన్ మరియు జాయింట్ సెక్రటరీ శ్రీమతి విస్మిత తేజ్ సందర్శన సమయంలో బొగ్గు వినియోగదారులతో సహా కంపెనీకి చెందిన వివిధ వాటాదారులతో సంభాషించారు.
మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని సింగ్రౌలీ మరియు సోన్‌భద్ర జిల్లాలో ఉన్న 10 అత్యంత మెకనైజ్డ్ ఓపెన్‌కాస్ట్ గనుల నుండి ఎన్‌సిఎల్ ఏటా 122 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది.
****
(Release ID: 1841994)