భారత పోటీ ప్రోత్సాహక సంఘం
రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌లో సీపీపిఐబి కలిగి ఉన్న ఓటింగ్ హక్కుల నిష్పత్తి పెంపుకు ఆమోదం తెలిపిన సీసీఐ
Posted On:
15 JUL 2022 5:51PM by PIB Hyderabad
రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌లో సీపీపిఐబి కలిగి ఉన్న ఓటింగ్ హక్కుల నిష్పత్తి పెరుగుదలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది.
రెన్యూ ఎనర్జీ గ్లోబల్ లో క్లాస్ ఏ సాధారణ వాటాలు (ఓటింగ్ హక్కు కలిగిన వాటాలు)తిరిగి కొనుగోలు చేసినట్టు కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ పిఎల్‌సి ప్రతిపాదనను రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రకటించడంతో ప్రతిపాదిత విలీనం అమల్లోకి వచ్చింది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ లో వాటాలను కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ పిఎల్‌సి తిరిగి కొనుగోలు చేయడం వల్ల సంస్థలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ కలిగి ఉన్న వాటాల సంఖ్య తగ్గుతుంది. తద్వారా కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ పిఎల్‌సి కలిగి ఉన్న వాటాల సంఖ్య పెరుగుతుంది.
కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్గ్లోబల్ పిఎల్‌సి అనేది ఒక పెట్టుబడుల యాజమాన్య సంస్థ. కెనడా పెన్షన్ ప్లాన్ ఫండ్ ద్వారా అందుతున్న నిధులను కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ పిఎల్‌సి పెట్టుబడులు పెడుతుంది. దాదాపు 21 మిలియన్ కంట్రిబ్యూటర్లు మరియు లబ్ధిదారుల నుంచి అందే నిధుల్లో సీపీపీ ఫండ్ కు అవసరం లేని నిధులను కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్ పిఎల్‌సికి కెనడా పెన్షన్ ప్లాన్ మళ్ళిస్తుంది.
రెన్యూ, దాని అనుబంధ సంస్థలు మరియు జాయింట్ వెంచర్‌లు సంప్రదాయేతర మరియు పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యాపార రంగంలో ఉన్నాయి.
దీనికి సంబంధించిన సీసీసీ వివరణాత్మక ఉత్తర్వులు విడుదల అవుతాయి
***
(Release ID: 1841991)
Visitor Counter : 148