జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌ఎంసీజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దాదాపు రూ.38 కోట్ల వ్యయం గల పారిశ్రామిక మరియు మురుగునీటి కాలుష్య నివారణ ప్రాజెక్టులను ఆమోదించింది.

Posted On: 13 JUL 2022 4:39PM by PIB Hyderabad

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసీజీ) ఎగ్జిక్యూటివ్ కమిటీ 43వ సమావేశం ఎన్‌ఎంసీజీ డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్ అధ్యక్షతన ఈరోజు ఇక్కడ జరిగింది. నూతన సాంకేతికతల ద్వారా పారిశ్రామిక మరియు మురుగునీటి కాలుష్య నివారణకు సంబంధించిన ప్రాజెక్టులు, అడవుల పెంపకం, కాళింది కుంజ్ ఘాట్ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి మొదలైనవాటికి సంబంధించి దాదాపు రూ. రూ. 38 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ఈసీ మీటింగ్ ఆమోదం తెలిపింది.

image.png
'ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అటవీ కార్యక్రమాలు 2022-23' పేరుతో ఒక ప్రాజెక్ట్ రూ.10.30 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించబడింది.  ఇందులో గంగా పరీవాహక రాష్ట్రాల్లో ప్లాంటేషన్, మెయింటెనెన్స్, కెపాసిటీ బిల్డింగ్ మరియు ట్రైనింగ్ అండ్ అవేర్‌నెస్‌ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అటవీ విస్తీర్ణం మెరుగుపరచడం, అటవీ వైవిధ్యం మరియు ఉత్పాదకతను పెంపొందించడం, జీవవైవిధ్య పరిరక్షణ మరియు స్థిరమైన భూమి మరియు పర్యావరణ వ్యవస్థ నిర్వహణ కోసం పర్యావరణ వ్యవస్థ సేవల మెరుగైన ప్రవాహం, స్థిరమైన జీవనోపాధి మరియు గంగా నది పరిరక్షణ కోసం ఉద్దేశించబడింది.

కాళింది కుంజ్ ఘాట్ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధికి కూడా 'సూత్రప్రాయంగా' ఆమోదం లభించింది. ఈ కార్యక్రమాన్ని పర్యావరణ అనుకూల సీటింగ్‌లు, చెత్త డబ్బాలు, షేడ్స్, ప్లాంటేషన్‌లు, ప్రజలు-నదుల అనుసంధానాన్ని సులభతరం చేసే లక్ష్యంతో రూపొందించారు.

పారిశ్రామిక కాలుష్య నివారణ కోసం, 100 కెఎల్‌డి సామర్థ్యం గల ఎలక్ట్రో కెమికల్ టెక్నాలజీ ఆధారిత మాడ్యులర్ ఎఫ్ల్యూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం మరియు ప్రారంభించడం కోసం సుమారు రూ. 77 లక్షలతో పైలట్ ప్రాజెక్ట్‌ రూపొదించబడుతుంది. మధురలోని కొన్ని వస్త్ర పరిశ్రమల నుండి విడుదలయ్యే నీటిని యమునా నదిలో కలవకుండా ఈ ప్రాజెక్ట్  శుద్ధి  చేస్తుంది. పర్యావరణ అనుకూలమైన మరియు హరిత సాంకేతికతలను అనుసరించడం ద్వారా మురుగు నీటి విడుదలను (కాలుష్యం మరియు రసాయన భారం కూడా) తగ్గించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

రీసెర్చ్, స్టడీస్, పైలట్ & ట్రైనింగ్, వర్క్‌షాప్, సెమినార్, పబ్లికేషన్ మొదలైన వాటి కింద మైక్రో-ఏరోబిక్ ప్రక్రియలతో ఇప్పటికే ఉన్న యూఏఎస్‌బి సిస్టమ్‌ను అప్‌గ్రేడేషన్/ఇంటిగ్రేషన్' పేరుతో మరో పైలట్ ప్రాజెక్ట్ రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించబడింది. అప్-ఫ్లో వాయురహిత స్లడ్జ్ బ్లాంకెట్ (యూఏఎస్‌బి) ప్రక్రియను ఉపయోగించి మురుగునీటి శుద్ధి నుండి జీరో డిశ్చార్జ్ మరియు రిసోర్స్ రికవరీ కాన్సెప్ట్  ఈ అధ్యయనం లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ అధ్యయనం సాధ్యమైన ఫలితం ఏమిటంటే, పోషకాలను పునరుద్ధరించడం మరియు వ్యర్ధ పదార్ధాలతో బయోగ్యాస్ రూపంలో ఇంధనాన్ని తయారు చేయడం.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా గౌరీ కుండ్ మరియు తిల్వారాలో మురుగునీటి కాలుష్య  నివారణతో పాటు  (200 కెఎల్‌డి+10కెఎల్‌డి+6కెఎల్‌డి+100కెఎల్‌డి) సామర్థ్యమున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి కూడా రూ.23.37 కోట్లు ఆమోదించబడ్డాయి.


 

******


(Release ID: 1841291) Visitor Counter : 159