రైల్వే మంత్రిత్వ శాఖ
సంధానాన్ని సమకూర్చడాని కి మరియు రాక పోకల లో మెరుగుదల ను తీసుకురావడాని కిఉద్దేశించిన తరంగా హిల్-అంబాజీ-ఆబూ రోడ్డు అనే ఒక కొత్త రైలుమార్గాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
అంబాజీ వరకు కనెక్టివిటీ ని సమకూర్చాలన్న ఆ ప్రాంతం ప్రజల డిమాండు దీర్ఘకాలంగా అనిశ్చిత స్థితి లో ఉంది
ప్రతిపాదిత ప్రాజెక్టు అంబాజీ వరకు సంధానాన్ని సమకూర్చుతుంది; అంతేకాక, ఆ ప్రాంతం ప్రజల రాకపోకల లో మెరుగుదలను తీసుకువస్తుంది
ఇది అహమదాబాద్ మరియు ఆబూ రోడ్ కు నడుమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడాఅందుబాటు లోకి తీసుకురానుంది
ఈ ప్రాజెక్టు నిర్మాణ కాలం లో సుమారు గా 40 లక్షల పని దినాల ను కల్పించి, తద్వారా ప్రత్యక్ష ఉపాధి ని కూడాఅందించనుంది
ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం 2798.16 కోట్ల రూపాయలు; ఇది 2026-27 కల్లా పూర్తి అవుతుంది
Posted On:
13 JUL 2022 4:16PM by PIB Hyderabad
రైల్ వేల మంత్రిత్వ శాఖ ద్వారా 2798.16 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో తరంగా హిల్-అంబాజీ-ఆబూ రోడ్ అనే ఒక కొత్త రైలు మార్గం నిర్మాణాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది.
కొత్త రైలు మార్గం మొత్తం పొడవు 116.65 కిలో మీటర్ లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు 2026-27 కల్లా పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ కాలం లో ఇంచుమించు 40 లక్షల పని దినాల మేర ప్రత్యక్ష ఉపాధి ని కల్పించనుంది.
ఈ ప్రాజెక్టు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఒక న్యూ ఇండియా దార్శనికత కు అనుగుణం గా, కనెక్టివిటీ ని వృద్ధి చెందించడం తో పాటుగా రాక పోకల లో మెరుగుదల కు చోటివ్వడం ద్వారా ఆ ప్రాంతం యొక్క సమగ్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి దోహదం చేయనుంది.
అంబాజీ ఒక ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలం గా ఉంది. భారతదేశం లోని 51 శక్తి పీఠాల లో ఒక శక్తి పీఠం గా ఉంది. ప్రతి సంతవ్సరం గుజరాత్ తో పాటు దేశం లోని ఇతర ప్రాంతాల నుంచే కాక విదేశాల నుంచి కూడా లక్షల కొద్దీ భక్తులను ఈ శక్తిపీఠం ఆకర్షిస్తోంది. ఈ మార్గం నిర్మాణం పూర్తి అయితే గనక ఈ విధమైన లక్షల కొద్దీ భక్త జనాని కి యాత్ర సులభతరం అవుతుంది. దీనికి తోడు, తరంగా హిల్ లో (24 మంది పవిత్ర జైన తీర్థంకరుల లో ఒకరైన) అజీత్ నాథ్ జైన్ మందిరం వెలసి ఉంది. దీనిని సందర్శించే భక్తులు కూడాను ఈ కనెక్టివిటీ ద్వారా చాలా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తరంగా హిల్--ఆబూ రోడ్ నడుమ ఏర్పడే కొత్త రైలు మార్గం ఈ రెండు ప్రముఖ ధార్మిక స్థలాల ను రైల్ వే యొక్క ప్రధాన నెట్ వర్క్ తో జోడించనుంది.
ఈ రైలు మార్గం వ్యావసాయిక ఉత్పాదన ల మరియు స్థానిక ఉత్పాదన లను త్వరిత గతి న తీసుకు రావడం, తీసుకు పోవడానికి తోడ్పాటు ను అందించనుంది; అలాగే గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల లోపల, దేశం లోని ఇతర ప్రాంతాల లో సైతం ప్రజల కు మెరుగైన రాకపోకలను కూడా అందించగలుగుతుంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుత అహమదాబాద్-ఆబూ రోడ్ రైల్ వే లైను కు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అందిస్తుంది.
ప్రతిపాదిత డబ్లింగ్ పంక్తిబద్ధత రాజస్థాన్ లోని సిరోహీ జిల్లా మరియు గుజరాత్ లోని బనాస్ కాంఠా, ఇంకా మెహ్ సాణా జిల్లాల గుండా సాగుతుంది. కొత్త రైలు మార్గం నిర్మాణం పెట్టుబడుల ను ఆకర్షించడం తో పాటు గా ఆ ప్రాంతం లో సమగ్రమైనటువంటి సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి తోడ్పడగలదు.
***
(Release ID: 1841257)
Visitor Counter : 137