సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
''ఏక్ భారత్ శ్రేష్ట భారత్'' లో భాగంగా పంజాబ్ విద్యార్థుల విశాఖ పట్నం సందర్శన విజయవంతం
05 రోజుల పర్యటన ముగించుకుని తిరిగి సొంత రాష్ట్రానికి పయనమైన విద్యార్థి బృందం
Posted On:
11 JUL 2022 6:36PM by PIB Hyderabad
విజయవాడ, తేదీ: 11.07.2022
''ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ '' ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విశాఖపట్నం సందర్శనకు వచ్చిన పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన 52 మంది విద్యార్థుల బృందం పర్యటనను విజయవంతంగా ముగించుకుని తన స్వంత రాష్ట్రానికి తిరుగు ప్రయాణమైంది. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా తొలుత జూలై 5న విశాఖపట్నం లోని లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కి చేరుకున్న ఈ బృందం, 5 రోజుల పాటు విశాఖపట్నంతో పాటు, సమీప పరిసర ప్రాంతాలను సందర్శించింది.
విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమలక్ష్యం యువతలో జాతీయ భావాల్ని పెంపొందించడం. ఈ పర్యటనలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉత్తర ఆంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లను సందర్శించడం ద్వారా ఆయా ప్రాంతాల సాంప్రదాయాలు, భాషలు, మాండలికాలు, హస్తకళలు మరియు కళారూపాలు పై అవగాహన పెంపొందించుకున్నారు. విశాఖ పట్నంలో ఉన్న వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించి ఆయా ప్రాంతాల్లోని అనేక స్థానిక వంటకాలను రుచి చూశారు.
ఈ సందర్భంగా పర్యటనకు విచ్చేసిన యువ విద్యార్థులను ఉద్దేశించి అఖిల భారత విద్యా మండలి చైర్మన్ అనిల్ సహస్రబుద్ది మాట్లాడుతూ భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి, సాంప్రదాయ విలువల గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. భారతదేశపు నిజమైన స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో విద్యార్థుల ఈ 05 రోజుల సందర్శన లో ఫలవంతమైనట్లు తాను భావిస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంజాబ్ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి తమ సంస్థను ఎంపిక చేసుకున్నందుకు ఆల్ ఇండియా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ వి.వి. రామారెడ్డి, వైస్ ప్రిన్సిపల్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హరిబాబు తమ్మినేని కృతజ్ఞతలు తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ జాయింట్ కమిషనర్ శ్రీమతి నీతా, లెఫ్టినెంట్ కమల్, అమర్జీత్, మీనాక్షి వర్మ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1840799)
Visitor Counter : 148