ఉక్కు మంత్రిత్వ శాఖ
ఘనంగా ముగిసిన ఆర్ఐఎన్ఎల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారోత్సవాలు
- ఉక్కు గురించి అవగాహన కల్పించేందుకు స్కూల్ విద్యార్థులు బీచ్ రోడ్‌లో వాకథాన్
Posted On:
10 JUL 2022 5:55PM by PIB Hyderabad
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జూలై 4 నుండి 10, 2022 వరకు పాటిస్తున్న ఐకానిక్ వారోత్సవంలో భాగంగా ఆర్ఐఎన్ఎల్ కార్పొరేట్ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ ఆర్ఐఎన్ఎల్ ఐకానిక్ వారోత్సవాలలో ఉక్కుపై అవగాహన కల్పించేం విధంగా ఈ రోజు పాఠశాల విద్యార్థులచే బీచ్ రోడ్డులో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంతో వారోత్సవాలు ముగిశాయి. విశాఖపట్నం స్టీల్ చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్-కార్పొరేట్ సర్వీసెస్) జి. గాంధీ, స్పోర్ట్స్ జనరల్ మేనేజర్ ఎంఎస్ కుమార్, చీఫ్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ శాంత కుమార్, ఆర్‌పి శర్మ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) ఐ/సీ ఈ వాకథాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ గుర్తింపు పొందిన కార్మిక సంఘం అధ్యక్షుడు కె.ఎస్.ఎన్. రావు కూడా పాల్గొన్నారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా ఉక్కు మంత్రిత్వ శాఖ జూలై 4 నుండి 10 2022 వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన వార్షికోత్సవంలో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారం జూలై 4 నుండి 10 వరకు ఐకానిక్ అనేక కార్యక్రమాలను నిర్వహించింది.
ఐకానిక్ వీక్‌లో భాగంగా మొబైల్ ఎగ్జిబిషన్-టేబ్లియన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో దేశ నిర్మాణం, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వాటి అమలు వివిధ జాతి విజయాలు దేశ నిర్మాణంలో వివిధ ప్రతిష్టాత్మక భారీ ప్రాజెక్ట్‌లలో వాటి వినియోగాలలో ఆర్ఐఎన్ఎల్ పాత్రను ప్రదర్శించారు. ఉక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఇది పర్యటించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ వారోత్సవాన్ని జన-ఉత్సవ్‌గా జరుపుకుంటున్నందున అన్ని కార్యకలాపాలు జన్-భాగిదారి (ప్రజల భాగస్వామ్యం) యొక్క సరైన స్ఫూర్తితో అమలు చేయబడ్డాయి. అంతే కాకుండా ఈ వారోత్సవాలలో భాగంగా వివిధ శాఖలు, టౌన్‌షిప్‌లు, బయట గనుల కార్యాలయాల్లో ఉద్యోగులు మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ఉత్సాహంగా చేపట్టారు. ఆర్ఐఎన్ఎల్ భద్రత ఇంజనీరింగ్ విభాగం మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోనే కాకుండా వైజాగ్ వెలుపల ఉన్న ఆర్ఐఎన్ఎల్ యొక్క మైన్స్ యూనిట్‌లలో కూడా అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, పాదయాత్రలు మరియు నినాదాల ద్వారా భద్రత సంబంధిత అంశాలను ప్రచారం చేసింది. సురక్షిత ఉక్కు తయారీ మరియు భద్రత & ఆరోగ్యం గురించి స్థానిక మరియు ప్రపంచ నాణ్యతా పద్ధతులను పంచుకోవడం పట్ల భద్రతా అవగాహన ప్రచారం మరియు “జీరో యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్” సాధించే దిశగా అవగాహన కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా నిర్వహించబడ్డాయి.
ఉక్కు వినియోగాన్ని నిర్ధారించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కు వినియోగాన్ని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై
ఐఎన్ఎస్‌డీఏజీ మద్దతుతో ఒక సెమినార్ కూడా నిర్వహించబడింది. పర్యావరణం మరియు సుస్థిరతపై పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం/ వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం మరియు దాని ఉక్కునగరం టౌన్‌షిప్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న అనేక చర్యలలో భాగంగా స్టీల్ సిటీ ప్రజలకు జౌళి బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ మహానగర పాలక సంస్థ జోనల్ కమిషనర్ పి సింహాచలం, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం దిశగా విశాఖ ఉక్కు యాజమాన్యం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డా.బి.వి.సత్యవతి, గాజువాక ఎమ్మెల్యే శ్రీ.తిప్పల నాగిరెడ్డి ఐకానిక్ వీక్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఆర్ఐఎన్ఎల్ ఐకానిక్ వీక్ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు మొత్తం సంస్థ సోదర వర్గాన్ని, వివిధ కార్మిక సంఘాలు, పార్లమెంట్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు, అధికారులు, విద్యార్థులు, విక్రేతలు మరియు స్థానిక ప్రజలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ .సీఎండీ శ్రీ అతుల్ భట్ అభినందనలు తెలిపారు..
*****
(Release ID: 1840648)
Visitor Counter : 152