సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సాంప్రదాయ ప్రాంతీయ థియేటర్ యొక్క 5 నాటకాల సిరీస్ ముగింపు వేడుక
15 ఆగస్ట్ 2022న భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, అప్పుడు ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం ఎగురవేద్దాం: శ్రీ కిషన్ రెడ్డి
Posted On:
05 JUL 2022 8:25PM by PIB Hyderabad
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నేడు హైదరాబాద్‌లోని శ్రీ వినాయక నాట్యమండలి సురభి థియేటర్ ద్వారా సాంప్రదాయ ప్రాంతీయ థియేటర్ యొక్క 5 నాటకాల ముగింపు వేడుకను ఘనంగా జరుపుకుంది. ఐదు నాటకాలలో మాయాబజార్, భక్త ప్రహ్లాద, పాతాళ భైరవి, యశోద కృష్ణ మరియు శ్రీనివాస కళ్యాణం ఉన్నాయి.
కార్యక్రమానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఐజిఎన్సిఎ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద జోషి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురభి నాటక మండలి దక్షిణ భారతదేశంలోని గొప్ప సంస్కృతిని దిల్లీకి పరిచయం చేసిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు కన్న ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ను కూడా నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
"భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2022 ఆగస్టు 15 రోజున, ప్రతి ఇంట్లో మనమందరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం" అని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాంప్రదాయ ప్రాంతీయ థియేటర్‌ను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి కోరారు.
"భారత్ స్వాతంత్ర్యం పొంది ఈ సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది, దేశం అమృత మహోత్సవాలను జరుపుకుంటోంది, కాబట్టి మనం మన గొప్ప సంస్కృతిని దేశానికి మరియు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది" అని కూడా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ క్రింద ఒక ముఖ్యమైన సాంస్కృతిక సంస్థ. వివిధ కార్యక్రమాలు మరియు పథకాలతో ఎన్ఎస్‌డీ ఇప్పుడు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటోంది. దాని వినూత్న ఆలోచనలు మరియు కార్యక్రమాలతో ఈ వేడుకలో పాల్గొంటుంది, ఇది చాలా మంది స్వాతంత్ర్య సమరయోధుల విజయాలను గుర్తించడమే కాకుండా, భారతదేశం గురించి గర్వపడేలా భారతీయులను ప్రేరేపిస్తుంది.
*****
(Release ID: 1839497)
Visitor Counter : 139