ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిట్రిక్స్ సిస్టమ్స్ కొనుగోలుకు సీసీఐ ఆమోదం

Posted On: 05 JUL 2022 5:33PM by PIB Hyderabad

విస్టా ఈక్విటీ పార్టనర్స్ మేనేజ్‌మెంట్,  ఎల్ఎల్‌సీ (విస్టా) మరియు ఇలియట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఎల్‌.పి. (ఇలియట్) ద్వారా నిర్వహించబడే ఫండ్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్స్ ద్వారా సిట్రిక్స్ సిస్టమ్స్ ఇంక్. (సిట్రిక్స్) సంస్థ కొనుగోలుకు
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)  ఆమోదం తెలిపింది.  విస్టా ద్వారా నిర్వహించబడే ఫండ్‌లు మరియు ఇలియట్ ద్వారా నిర్వహించబడే ఫండ్‌లు మరియు పెట్టుబడి వాహనాల ద్వారా సిట్రిక్స్‌ను కొనుగోలు ప్ర‌తిపాద‌న‌కు 17 జూన్ 2022వ తేదీ  జరిగిన సమావేశంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. సిట్రిక్స్, పికార్డ్ పేరెంట్, పికార్డ్ మెర్జర్ సబ్, ఐఎన్‌సీ. (పికార్డ్ పేరెంట్ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) మరియు టీఐబీసీఓ సాఫ్ట్‌వేర్ ఇంక్. (టీఐబీసీఓ) మరియు వాటి మధ్య కుదిరిన ఒప్పందం మరియు విలీన ప్రణాళిక ప్రకారం ప్రతిపాదిత కలయిక అమలు చేయబడుతుంది. విస్టా
నియంత్రిత పోర్ట్‌ఫోలియో కంపెనీ టిబ్కొను సిట్రిక్స్‌తో మిళితం చేస్తారు. సిట్రిక్స్‌/ టిబ్కో  మిళిత‌మైన వ్యాపారాన్ని అంతిమంగా
విస్టా మ‌రియు ఇలియట్ లు కొనుగోలు చేసి నియంత్రిత వాటాను పొంద‌నున్నాయి.
కలయికలో ఉన్న పార్టీల పేర్లు:
(a) ఇలియట్  ఆల్టో అగ్రిగేటర్ జీపీ ఎల్ఎల్‌సీ (ఇలియట్ అగ్రిగేటర్)
(b) పికార్డ్ పేరెంట్, ఐఎన్‌సీ (పికార్డ్ పేరెంట్);
(c) పికార్డ్ హోల్డ్‌కొ ఎల్ఎల్‌సీ (హోల్డ్‌కొ);  మరియు
(d) సిట్రిక్స్ సిస్టమ్స్, ఐఎన్‌సీ. (సిట్రిక్స్).
విస్టా మరియు ఇలియట్‌లను సమిష్టిగా కొనుగోలుదారులుగా ( అక్వైరర్స్) వ్య‌వ‌హ‌రిస్తారు. అక్వైరర్స్ మరియు సిట్రిక్స్ సమిష్టిగా పార్టీలుగా వ్య‌వ‌హ‌రిస్తారు. విస్టా అనేది అమెరికా -ఆధారిత పెట్టుబడి సంస్థ. ఇది ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, డేటా మరియు టెక్నాలజీ-ఎనేబుల్డ్ వ్యాపారాల యొక్క‌ సాధికారత మరియు అవ‌స‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ల అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. వ్యాపారపు సాఫ్ట్‌వేర్ల‌ను అందించడం వంటి ఐటీ సేవలను అందించడంలో చురుకుగా ఉన్న అనేక ర‌కాల పోర్ట్‌ఫోలియో కంపెనీలను విస్టా సంస్థ నియంత్ర‌ణ‌లో ఉన్నాయి. ఇలియట్ అనేది అమెరికా-ఆధారిత పెట్టుబడి సంస్థ, దీని ముఖ్యమైన‌ ఫండ్, ఇలియట్ అసోసియేట్స్, ఎల్‌.పి., 1977లో స్థాపించబడింది. ఈక్విటీ-ఆధారిత, ప్రైవేట్ ఈక్విటీ మరియు ప్రైవేట్ క్రెడిట్, డిస్ట్రెస్డ్ సెక్యూరిటీలు, నాన్-డిస్ట్రెస్డ్ డెట్, హెడ్జ్/మధ్యవర్తిత్వం, రియల్ ఎస్టేట్-సంబంధిత సెక్యూరిటీలు, క‌మోడిటీ ట్రేడింగ్: పోర్ట్‌ఫోలియో అస్థిరత రక్షణల విభాగాల‌లో ఇలియట్ పరిమితి లేకుండా విస్తృత శ్రేణి వ్యూహాలను కలిగి ఉన్న బహుళ-వ్యూహాత్మక వ్యాపార విధానాన్ని క‌లిగి ఉంది. సిట్రిక్స్ సంస్థ అమెరికాలో ఫ్లోరిడా న‌గ‌రంలో త‌న‌ ప్రధాన కార్యాలయం కలిగిన బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీ సంస్థ‌. ఈ సంస్థ  స్థిరమైన మరియు సురక్షితమైన పని అనుభవాన్ని అందించడంలో సహాయపడటంపై దృష్టి సారించింది. సిట్రిక్స్‌ డిజిటల్ వర్క్‌స్పేస్ సొల్యూషన్‌ను అందజేస్తుంది, ఇది అన్ని పని వనరులకు (యాప్‌లు, కంటెంట్, మొదలైనవి) ఏకీకృత, విశ్వసనీయ మరియు సురక్షిత యాక్సెస్‌ను అందిస్తుంది మరియు ప్రతి పని ఛానెల్, పరికరం మరియు లొకేషన్‌లో పని అమలు మరియు సహకారాన్ని సులభతరం చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సిట్రిక్స్ ప్రధానంగా (i) డెస్క్‌టాప్ వర్చువలైజేషన్ స్పేస్, (ii) వర్క్‌స్పేస్ సొల్యూషన్‌లు మరియు (iii) నెట్‌వర్కింగ్ మరియు ఐటీ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో చురుకుగా నిమ‌గ్న‌మై ఉన్న సంస్థ‌.

***


(Release ID: 1839495) Visitor Counter : 159


Read this release in: English , Urdu , Hindi