ఆర్థిక మంత్రిత్వ శాఖ
పూర్తి అయిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్) వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ
ఎన్ఐఎన్ఎల్‌ను స్వాధీనం చేసుకున్న టాటా స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్ లిమిటెడ్
Posted On:
04 JUL 2022 3:50PM by PIB Hyderabad
నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్) అనేది ఎంఎంటిసి ( 49.78% వాటా), ఎన్ ఎండిసి (10.10%), బిహెచ్ ఇఎల్ (0.68%), ఎంఇసిఒఎన్ (0.68%), 2 ఒడిషా ప్రభుత్వ పిఎస్‌యులైన ఒఎంసి (20.47%), ఐపిఐసిఒఎల్ (12.0%) అన్న నాలుగు సిపిఎస్ఇల జాయింట్ వెంచర్ (ఉమ్మడి వ్యాపార) కంపెనీ.
జాయింట్ వెంచర్ భాగస్వాముల (4 సిపిఎస్ఇలు +2 ఒడిషా ప్రభుత్వ రంగ సంస్థలు)కు చెందిన 93.71% షేర్లను (వాటాలను) వ్యూహాత్మక కొనుగోలుదారు ఎం/ఎ స్ టాటా స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్ లిమిటెడ్‌కు బదిలీ చేయడంతో ఎంఎన్ఐఎన్ఎల్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీ సోమవారం పూర్తి అయింది. వ్యూహాత్మక కొనుగోలుదారు చెల్లించిన వ్యాపార విలువ రూ. 12,100 కోట్లు. ఈ చెల్లింపును ఎస్‌పిఎ ప్రకారం ఉద్యోగులకు , నిర్వహణ రుణదాతలు, సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ (హామీలను తీసుకుని రుణాలనుఇచ్చేవారు), విక్రేతల (నిర్వహణ, ఆర్థిక బకాయిలు)బకాయల చెల్లింపుకు, ఎస్‌పిఎ ప్రకారం వాటాదారులు అమ్ముతున్న ఈక్విటీకి చెల్లిస్తారు.
అత్యధిక దరకు వేలంపాడిన ఎం/ ఎస్ టాటా స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ 31 జనవరి 2022న ఆమోదం పొందిన తర్వాత 2 ఫిబ్రవరి 2022న వేలంలో విజయం సాధించిన ఈ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేయడం జరిగింది. వాటాల కొనుగోలు ఒప్పందం (ఎస్‌పిఎ)పై 10 మార్చి 2022న సంతకాలు చేశారు. ఆ తర్వాత వ్యూహాత్మక భాగస్వామి ఎన్ఐఎన్ఎల్, ఆరుగురు వాటాల అమ్మకందార్లు ఎస్‌పిఎలో నిర్వచించిన నిర్వహణ రుణదాతల బకాయిలు, ఉద్యోగుల బకాయిలు, వక్రేతల నిర్వహణ బకాయిలు, సెల్లర్స్ ఫైనాన్షియల్ బకాయిల ధృవీకరణ సహా అన్ని షరుతలను నెరవేర్చే దిశగా పని చేశారు. అప్పటి నుంచి ఈ షరుతులు పరస్పరం సంతృప్తి కలిగించే స్థాయిలో నెరవేరాయి.
***
(Release ID: 1839423)
Visitor Counter : 179