ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
04 JUL 2022 6:00PM by PIB Hyderabad
బొగ్గు రవాణా ఇతర అనుబంధ కార్యకలాపాలతో కూడిన వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఒక గ్రూపు సంస్థపై ఆదాయపు పన్ను శాఖ 30.06.2022న సోదాలు, జప్తు కార్యకలాపాలను నిర్వహించింది. సీనియర్ ప్రభుత్వ అధికారి నివాసంలో సైతం ఈ సోదాలు నిర్వహించారు. రాయ్‌పూర్, భిలాయ్, రాయ్‌ఘర్, కోర్బా, బిలాస్‌పూర్, సూరజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 30కి పైగా ప్రాంతాలలో ఈ సోదాల కార్యక్రమాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపారు. ఆధాయపు పన్ను శాఖ శోధన ఆపరేషన్ సమయంలో అనేక నేరారోపణ పత్రాలు, వదులుగా ఉన్న షీట్లు మరియు డిజిటల్ ఆధారాలను అధికారులు కనుగొన్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అంతటా బొగ్గు రవాణాపై అన్యాయంగా నిత్యం వసూళ్ల తీరుతో గ్రూప్ అనుసరించిన మోడస్-ఆపరాండి లెక్కల్లో చూపని భారీ ఆదాయానికి దారితీసింది.
తక్కువ సమయంలోఇలా రూ.200 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేపట్టినట్లు ఆధారాలు లభించాయి. ఈ గ్రూప్‌లోని కీలక విశ్వసనీయ సహచరులు.. ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ప్రభుత్వ అధికారులకు కొన్ని నగదు చెల్లింపులు జరిపిన సందర్భాలు కూడా ఇక్కడ గుర్తించబడ్డాయి. స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల మేరకు గ్రూపు లెక్కలలో చూపని దాదాపు రూ. 45 కోట్లతో నగదుతో కోల్ వాషరీలను కొనుగోలు చేసినట్టుగా కూడా ఆధారాలు లభించాయి. అంతేకాకుండా, ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో గ్రూప్ నగదు ఖర్చు చేసినట్లు వెల్లడి చేసే ఆధారాలు కూడా ఈ సోదాలలో కనుగొనబడ్డాయి. సోదాల్లో పెద్దఎత్తున గ్రూపునకు చెందిన ఆస్తి ఒప్పందాలు లభించాయని, బినామీలుగా కనిపించే స్థిరాస్తుల కొనుగోలులలో భారీగా అప్రకటిత పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. 50 ఎకరాల స్థిరాస్తుల కొనుగోలుకు ఈ అప్రకటిత ఆదాయపు మూలంను పెట్టుబడిగా మల్లించినట్టుగా తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ అధికారికి సంబంధించిన ఉద్దేశించిన యజమానులు విషయం తదుపరి విచారణలో ఉన్నారు. ఈ సోదాలలో భాగంగా బయటకు వెల్లడించని రూ. 9.5 కోట్ల నగదు, రూ.4.5 కోట్ల మేర ఆభరణాలను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు నిర్వహించిన సమయంలో సేకరించిన అటువంటి నేరపూరిత సాక్ష్యాల ప్రాథమిక దర్యాప్తులో గ్రూప్ కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని ఎగవేసినట్లు తేలుతున్నాయి. దీనికి సంబంధించి తదుపరి విచారణలు వివిధ దశల్లో జరుగుతున్నాయి.
****
(Release ID: 1839420)
Visitor Counter : 130