విద్యుత్తు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ ప్రారంభం
ఎన్టిపిసి రామగుండం వద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా అమలు
అధునాతన సాంకేతికత మరియు పర్యావరణ అనుకూల లక్షణాలతో నిర్మితం
దక్షిణ ప్రాంతంలో ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ మొత్తం 217 మెగావాట్లకు పెరిగిన వాణిజ్య కార్యకలాపాలు
Posted On:
01 JUL 2022 1:29PM by PIB Hyderabad
భారతదేశం అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని రామగుండంలో 100 మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్ట్‌లో 20 మెగావాట్ల తుది భాగం సామర్థ్యం కమర్షియల్ నిర్వహణ జూలై 01, 2022 00:00 గంటల నుండి అమలులోకి వచ్చినట్లు ఎన్టిపిసి ప్రకటించింది.
రామగుండం వద్ద 100-మెగావాట్ల సోలార్ పివి ప్రాజెక్ట్ నిర్వహణతో, దక్షిణ ప్రాంతంలో ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ యొక్క మొత్తం వాణిజ్య కార్యకలాపాలు 217 మెగావాట్లకు పెరిగాయి. అంతకుముందు, కాయంకుళం (కేరళ) వద్ద 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ మరియు సింహాద్రి (ఆంధ్రప్రదేశ్) వద్ద 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్‌ను ఎన్టీపీసి కమర్షియల్ ఆపరేషన్‌గా ప్రకటించిందని, శ్రీ ఆనంద్ తెలిపారు.
రామగుండం వద్ద 100-మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణ అనుకూల విధానాలతో నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ 500 ఎకరాల విస్తీర్ణంలో రూ.423 కోట్లతో బిహెచ్ఈఎల్ చెందిన ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్స్ట్రక్షన్) కాంట్రాక్ట్ దీనిని నిర్మించింది. ఇది మొత్తం 40 బ్లాకులుగా విభజించబడి, ఒక్కొక్క బ్లాక్ 2.5 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రతి బ్లాక్‌లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్ మరియు 11,200 సోలార్ మాడ్యూల్‌ల శ్రేణి ఉంటుంది. ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్ మరియు ఒక హెచ్‌టీ బ్రేకర్ ఉంటాయి. సోలార్ మాడ్యూల్స్ HDPE (హై డెన్సిటీ పాలిథిలిన్) మెటీరియల్‌తో తయారు చేయబడిన ఫ్లోటర్‌లపై ఉంచబడతాయి.
మొత్తం ఫ్లోటింగ్ సిస్టమ్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బెడ్‌లో ఉంచిన డెడ్ వెయిట్‌లకు ప్రత్యేక హై మాడ్యులస్ పాలిథిలిన తాడుతో కలపబడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డు వరకు 33కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, హెచ్‌టి ప్యానెల్ మరియు పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సేకరణతో సహా అన్ని ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ఫ్లోటింగ్ ఫెర్రో సిమెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైనది. ఈ ప్రాజెక్ట్ దిగువ యాంకరింగ్ అతి తక్కువ బరువు కలిగిన కాంక్రీట్ బ్లాకుల ద్వారా కలుపబడి ఉంటుంది.
పర్యావరణ కోణంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధిత తరలింపు ఏర్పాట్లకు కనీస భూమి అవసరం. ఇంకా, తేలియాడే సోలార్ ప్యానెల్‌ల ఉనికితో, నీటి వనరుల నుండి బాష్పీభవన రేటు తగ్గుతుంది, తద్వారా నీటి సంరక్షణలో సహాయపడుతుంది. సంవత్సరానికి సుమారు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించవచ్చు. సౌర మాడ్యూల్స్ కింద ఉన్న నీటి శరీరం వాటి పరిసర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది, తద్వారా వాటి సామర్థ్యాన్ని మరియు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా, సంవత్సరానికి 1,65,000 టన్నుల బొగ్గు వినియోగాన్ని నివారించవచ్చు; సంవత్సరానికి 2,10,000 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నివారించవచ్చు.
***
(Release ID: 1838595)
Visitor Counter : 453