నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

‘ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం ఎకానమీ’పై నివేదిక విడుద‌ల చేసిన నీతి ఆయోగ్‌

Posted On: 27 JUN 2022 1:36PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ సంస్థ ఈరోజు ‘ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం ఎకానమీ’ పేరుతో ఒక నివేదికను విడుద‌ల చేసింది. ఈ నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, సీఈఓ అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె రాజేశ్వరరావులు  విడుదల చేశారు. భారతదేశంలోని గిగ్-ప్లాట్‌ఫారమ్‌తో (పాక్షిక ఉద్యోగిత వేదిక‌) ఆర్థిక వ్యవస్థపై సమగ్ర దృక్కోణాలు మరియు సిఫార్సులను క్రోఢీక‌రిస్తూ ఈ త‌ర‌హాలో ఒక నివేదిక‌ను రూపొందించ‌డం ఇదే తొలిసారి‌. ఈ నివేదిక  రంగం యొక్క ప్రస్తుత పరిమాణం మరియు ఉద్యోగ-ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి శాస్త్రీయ పద్దతితో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఈ నివేదిక  అభివృద్ధి చెందుతున్న రంగం యొక్క అవకాశాల‌ను,  సవాళ్లను హైలైట్ చేసింది. సామాజిక భద్రత కోసం కార్యక్రమాలపై ప్రపంచ ఉత్తమ అభ్యాసాలను అందిస్తుంది. రంగంలోని వివిధ వర్గాల కార్మికులకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యోగ కల్పన కోసం వ్యూహాల్ని వివరించింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ మాట్లాడుతూ "ఈ నివేదిక ఈ రంగం యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో మరియు గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్క్‌పై మరింత పరిశోధన మరియు విశ్లేషణలను నిర్వహించడంలో విలువైన జ్ఞాన వనరుగా మారుతుందని" అన్నారు. ఈ సంద‌ర్భంగా సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ భారతదేశంలో పెరుగుతున్న పట్టణీకరణ, ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీలు, స్మార్ట్‌ఫోన్‌కు విస్తృతమైన ప్రాప్యత కారణంగా ఈ రంగం యొక్క ఉద్యోగ కల్పన సామర్థ్యాన్నిగురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు.  మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, శిక్షణ అందించేవారు, ప్లాట్‌ఫారమ్ కంపెనీలు, ఇతర వాటాదారులకు ఈ రంగంలో వృద్ధి మరియు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి, సహకారంతో పని చేయడానికి ఈ నివేదికలోని సిఫార్సులు కీలకమైన వనరుగా పనిచేస్తాయని ఆయన అన్నారు.


భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 1.5 శాతంగా..


ప్రత్యేక కార్యదర్శి డా.కె.రాజేశ్వరరావు నివేదికలోని కీలక ఫలితాలు, సిఫార్సులను వివ‌రించారు. 2020–21లో 77 లక్షల (7.7 మిలియన్లు) కార్మికులు గిగ్ ఎకానమీలో నిమగ్నమై ఉన్నారని నివేదిక అంచనా వేసింది. వీరు వ్యవసాయేతర శ్రామికశక్తిలో 2.6% లేదా భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 1.5 శాతంగా ఉన్నారు. 2029–30 నాటికి గిగ్ వర్క్‌ఫోర్స్ 2.35 కోట్ల (23.5 మిలియన్లు) కార్మికులకు విస్తరింస్తుంద‌ని భావిస్తున్నారు. గిగ్ కార్మికులు 2029-30 నాటికి భారతదేశంలో వ్యవసాయేతర శ్రామికశక్తిలో 6.7% లేదా మొత్తం దేశ జీవనోపాధిలో 4.1%గా ఉంటారని అంచనా. ప్రస్తుతం, గిగ్ వర్క్‌లో దాదాపు 47 శాతం మధ్యస్థ నైపుణ్యాల ఉద్యోగాల్లో, దాదాపు 22% హై స్కిల్డ్‌లో మరియు 31% తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఉన్నారు. మధ్యస్థ నైపుణ్యాలలో కార్మికుల ఏకాగ్రత క్రమంగా క్షీణిస్తున్నట్లు మరియు తక్కువ నైపుణ్యం మరియు అధిక నైపుణ్యం ఉన్నవారి సంఖ్య పెరుగుతున్న‌ట్టుగా ట్రెండ్ చూపిస్తుంది.


ప్ర‌ధాన స్ర‌వంతితో అనుసంధానించాలి..


గిగ్-ప్లాట్‌ఫారమ్ రంగం యొక్క సామర్థ్యాన్ని త‌గు విధంగా ఉపయోగించుకోవడానికి, ప్లాట్ఫారమ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తుల ద్వారా ఫైనాన్స్ యాక్సెస్‌ను వేగవంతం చేయాలని, ప్రాంతీయ మరియు గ్రామీణ వంటకాలు, వీధి ఆహారం విక్రేయం మొదలైన వ్యాపారాల‌లో నిమగ్నమై ఉన్న స్వయం ఉపాధి వ్యక్తులను ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానించాలని కూడా నివేదిక సిఫార్సు చేసింది. పట్టణాలు మరియు నగరాల్లోని విస్తృత మార్కెట్‌ల‌లో వారు తమ ఉత్పత్తులను విక్రయించేలా వీలు కల్పించాలని ఈ నివేదిక‌లో సూచించింది.  ఈ ప్లాట్‌ఫారమ్ నేతృత్వంలోని పరివర్తన మరియు ఫలితాల ఆధారిత నైపుణ్యం, కార్మికులు మరియు వారి కుటుంబాలకు జెండ‌ర్ సెన్సిటైజేన్‌ మరియు యాక్సెసిబిలిటీ అవగాహన కార్యక్రమాల ద్వారా సామాజిక చేరికల‌ను మ‌రింత‌గా మెరుగుపరచడం మరియు సామాజిక భద్రత 2020 కోడ్‌లో ఊహించిన విధంగా భాగస్వామ్య మోడ్‌లో త‌గ‌ని సామాజిక భద్రతా చర్యలను విస్తరించడం వంటివి చేప‌ట్టాలని నివేదిక సూచించింది.  నివేదిక చేసిన ఇతర సిఫార్సులలో గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్క్‌ఫోర్స్ పరిమాణాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక గణన క‌స‌ర‌త్తు చేపట్లాల‌ని పేర్కొంది.  గిగ్ వర్కర్లను గుర్తించడానికి అధికారిక గణనల సమయంలో (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే) సమాచారాన్ని సేకరించడం వంటివి చేప‌ట్టాల‌ని సూచించింది.


నివేదికను https://www.niti.gov.in/sites/default/files/2022-06/25th_June_Final_Report_27062022.pdf లింక్‌పై క్లిక్ చేసి పొంద‌వ‌చ్చు. 

 


(Release ID: 1837392) Visitor Counter : 353


Read this release in: English , Urdu , Hindi , Tamil