పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్వాలియర్ కోటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం - 2022 ను నిర్వహించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ


చారిత్రాత్మక ప్రదేశంలో జరిగిన యోగా దినోత్సవ వేడుక కు నాయకత్వం వహించిన పౌర విమానయాన శాఖ
మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా

Posted On: 21 JUN 2022 2:23PM by PIB Hyderabad

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2022 జూన్ 21 న చారిత్రాత్మక గ్వాలియర్ కోటలో రెండు వేల మందికి పైగా ఔత్సాహికులతో భారీ యోగా ప్రదర్శనను నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా తో పాటు గ్వాలియర్ పార్లమెంటు సభ్యుడు శ్రీ వివేక్ నారాయణ్ షెజ్వాల్క ర్ , మధ్యప్రదేశ్

ప్రభుత్వ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ప్రధుమాన్ సింగ్ తోమర్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ) కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్ , ఎంఒసిఎ సంయుక్త కార్యదర్శులు

శ్రీ ఉషా పాధి,  శ్రీ రుబీనా అలీ, శ్రీ ఎస్ కె మిశ్రా, శ్రీ అంబర్ దూబే , ఇంకా ఎంఒసిఎ,  రాష్ట్ర ప్రభుత్వ , స్థానిక పాలనా యంత్రాంగాల  ప్రతినిధులు.ee కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి వెలిగించి యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వర్చువల్ ప్ర ప్రసంగాలను వేదిక వద్ద ప్రసారం చేశారు.

శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా మాట్లాడుతూ, యోగా ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. "జూన్ 21 భారతదేశానికి ఒక మైలురాయి రోజు, ఈ సంవత్సరం, యోగా పండుగను దేశవ్యాప్తంగా 75 చారిత్రాత్మక ప్రదేశాలలో జరుపుతున్నారు. భారతదేశం లేదా విదేశాలలో నివసిస్తున్న ప్రతి భారతీయుడికి ఇది ఒక ముఖ్యమైన రోజు. యోగా శరీరం , ఆత్మ రెండింటికీ పనిచేస్తుంది భగవంతుడికి ,  మానవుడికి మధ్య ఒక పరస్పర అనుసంధానంగా పనిచేస్తుంది.

మానవ శరీరం నుండి ఒత్తిడి, వ్యాధులను పూర్తిగా వదిలించుకోవడానికి యోగా సహాయపడుతుంది, ఇది సమాజంలో శాంతి పెంపొందడానికి సహాయపడుతుంది. ఈ రోజు, ప్రపంచం మొత్తం యోగా చేస్తోంది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక శక్తి నీ చాటుతోంది‘‘  అని అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2014లో జూన్ 21వ తేదీని అంత ర్జాతీయ యోగా దినోత్స వం (ఐడివై)గా ప్రకటిస్తూ చారిత్రాత్మక

నిర్ణయం తీసుకుంది. భారత దేశ సాంస్కృతిక,  ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగం.ayina యోగాను ప్రపంచవ్యాప్తంగా ఆమోదించడం మన దేశానికి గర్వకారణం,

ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" సంవత్సరంలో జరుగుతున్నందున ఇందుకు గుర్తుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశం మొత్తం లోని 75 ఐకానిక్ ప్రదేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

 

ఈ సంవత్సరం ఐడివై ను "మానవత్వం కోసం యోగా" అనే ఇతివృత్తం తో నిర్వహిస్తున్నారు. ఇది కోవిడ్-19 మహమ్మారి ఉచ్ఛదశలో ఉన్నప్పుడు, మానవాళికి బాధలను తగ్గించడంలోనూ, కోవిడ్ అనంతర భౌగోళిక-రాజకీయ వాతావరణం లో కూడా ప్రజలలో కరుణ, దయ, ఐక్యతా భావాన్ని పెంపొందించడం లోనూ,  ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఐక్యతను పెంపొందించడం లోనూ యోగా ఎలా ఉపయోగపడిందో వివరిస్తుంది.

ఈ సందర్భంగా గ్వాలియర్ కోట లో కామన్ యోగా ప్రోటోకాల్, యోగాపై నిపుణుల ప్రసంగాలు, రాణి లక్ష్మీబాయి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు చెందిన యోగా నిపుణుల యోగాసనాలు  మొదలైన వాటిని ప్రదర్శించారు.

 

*****


(Release ID: 1835998) Visitor Counter : 115
Read this release in: English , Urdu , Hindi