పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

జూన్ 21న పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు


- ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని హర్ కీ పౌరిలో జ‌రిగే ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వ‌హించ‌నున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్

- జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీ‌న‌గ‌ర్ దాల్ స‌ర‌స‌స్సు వ‌ద్ద ఎస్.కె.ఐ.సి.సి వ‌ద్ద జ‌రిగే ఐడీవై22 వేడుక‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్న‌పంచాయతీ రాజ్ శాఖ స‌హాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్

Posted On: 19 JUN 2022 4:28PM by PIB Hyderabad

“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” సంవత్సరంలో వ‌స్తోన్న ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక‌ల‌ను  భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 75 జాతీయ స్థాయి ప్ర‌ముఖ‌ ప్రదేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడీవై) నిర్వహించాలని యోచిస్తోంది.  ”బ్రాండ్ ఇండియా ఎట్ గ్లోబల్ స్టేజ్” అనే అంశంపై దృష్టిసారిస్తూ ప్ర‌ముఖ‌ ప్రదేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడీవై) నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర నగరమైన హరిద్వార్‌లో ఉన్న హర్ కీ పౌరిలో జూన్ 21, 2022న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్  నాయకత్వం వహించ‌నున్నారు, పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి జమ్మూ కాశ్మీర్‌ శ్రీన‌గ‌ర్‌లోని నగర్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న సుందరమైన ఎస్.కె.ఐ.సి.సి వద్ద జ‌రిగే 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకుశ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ నాయకత్వం వహిస్తారు. భార‌త ప్ర‌భుత్వపు  పంచాయితీరాజ్ శాఖ జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీ‌న‌గ‌ర్ దాల్ స‌ర‌స‌స్సు వ‌ద్ద ఎస్.కె.ఐ.సి.సి వ‌ద్ద ఎనిమిద‌వ అంత‌ర్జాతీయ యోగాదినోత్స‌వ వేడుక‌ల‌ను భారీ స్థాయిలో నిర్వ‌హిస్తోంది. వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకుశ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్‌తో పాటుగా జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంత‌ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా పాల్గొంటారు. వీరితో పాటుగా ఈ వేడుక‌ల‌లో జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ కుమార్ మెహతా, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ చంద్ర శేఖర్ కుమార్, జ‌మ్ము కాశ్మీర్ ప్రభుత్వం  పంచాయితీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్-కమ్-సెక్రటరీ శ్రీమతి. మన్‌దీప్ కౌర్‌తో పాటు  కేంద్ర ప్రభుత్వం మరియు జ‌మ్ము మ‌రియు కాశ్మీర్  ప్రభుత్వంలోని ఇతర సీనియర్ అధికారులు కూడా ఐడీవై -2022 వేడుక‌ల‌లో పాల్గొంటారు,
"మానవత్వం కోసం యోగా” అనే ఇతివృత్తంలో..
"మానవత్వం కోసం యోగా” అనే ఇతివృత్తంతో ఇది నిర్వ‌హించ‌బ‌డుతోంది. ప్రముఖులతో పాటుగా శ్రీనగర్‌లో జ‌రిగే ఐడీవై–2022 కార్యక్రమంలో పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికైన ప్రతినిధులు మరియు కార్యకర్తలు, యోగా మరియు అనుబంధ శాస్త్ర నిపుణులు, స్థానిక యోగా సంస్థలు, యోగా ఔత్సాహికులు, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు  కూడా పాల్గొంటారు. భారతదేశం మరియు జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం నుండి, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖ, ఆయుష్ శాఖ మరియు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్లు, స్థానిక జిల్లా పరిపాలన, పోలీసు, పారామిలిటరీ బలగాలు, వాలంటీర్లు, స్థానిక పౌరులు మరియు వివిధ రంగాలకు చెందిన ఇతర భాగస్వాములు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుంటారు. జమ్మూ మ‌రియు కాశ్మీర్ ప్రభుత్వంలోని ఆయుష్ శాఖ ద్వారా నియమించబడిన యోగా నిపుణులు వేదిక వద్ద నిర్ణీత సమయంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారితో యోగా చేయిస్తారు.
ప్ర‌ధాని ప్రసంగం వీక్ష‌ణ‌కు ఎల్ఈడీలు..
అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నేతృత్వంలో నిర్వహించబడుతున్న సామూహిక యోగా ప్రదర్శన ప్రధాన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్న కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్ నుండి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వెబ్ స్ట్రీమింగ్ చేయడానికి,  వినడానికి తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. .ఐడీవై–2022 సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని చేయ‌నున్న ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సామూహిక యోగా ప్రదర్శనల వేదిక వద్ద ఎల్ఈడీ  స్క్రీన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఐడీవై–2022 ఈవెంట్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ యొక్క సోషల్ మీడియా పేజీలలో ఈవెంట్‌ల ఔట్రీచ్‌ని పెంచడానికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యతను ఎత్తిచూపడం, యోగా సాధన పట్ల పాల్గొనే వారందరికీ నైతికత మరియు ఒరవడిని పెంపొందించే లక్ష్యంతో, అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వ‌హించ‌బ‌డుతోంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సామూహిక ఉద్య‌మంలా అంత‌ర్జాతీయ యోగా దిన‌త్స‌వ వేడుక‌లు నిర్వ‌హించ‌డం మ‌రియు యోగాకు ప్రపంచవ్యాప్త ఆమోదం పెరగడంతో.. ఈ మహత్తర సందర్భానికి గుర్తుగా  శ్రీనగర్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో యోగా ఆవ‌శ్య‌క‌త వివిధ అంశాల‌ను నిపుణులు వివ‌రిస్తారు.
స్థానికి పంచాయితీరాజ్ సంస్థ‌ల‌కు అడ్వైజ‌రీ...
జూన్ 21, 2022న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలను ఆహ్వానించాల‌ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మరియు యుటీ పంచాయతీరాజ్ శాఖలను 24 మే 2022 నాటి విడుద‌ల చేసిన అడ్వైజ‌రీలో అభ్యర్థించింది. ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ భార‌తంలో యోగా ప్రాముఖ్యానికి సంబంధించి యోగా శిక్షణ కార్యక్రమాలు/ప్రదర్శనలు, ఉపన్యాసాలు/ యోగాపై ప్రసంగాలు, యోగా ప్రాముఖ్యత గురించి వర్క్‌షాప్‌లు/ సెమినార్లు నిర్వహించాలని పంచాయతీరాజ్ సంస్థలకు సూచించింది.  పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ 2022 యోగా ఉత్సవ్‌లో భాగంగా 2022లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్క‌రించుకొని రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యతను తెలియ‌జేసేలా జూన్ 1వ తేదీ నుంచి 20 రోజుల పాటుగా..  మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో లెక్చర్-కమ్-డెమాన్‌స్ట్రేషన్ సెషన్‌ను నిర్వహించింది.
 ప్ర‌ధాన మంత్రి లేఖ పంపిణీ...
ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు కృషి చేయాలని మరియు ఈ దిశ‌గా గ్రామాల్లోని ప్రతి ఒక్కరు  సామూహిక యోగా ప్రదర్శనలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని గ్రామపంచాయతీలకు విజ్ఞప్తి చేస్తూ జూన్ 6వ తేదీ నాటి ప్ర‌ధాన మంత్రి లేఖను పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా పంపిణీ చేసింది.  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించడానికి, సామూహిక యోగా ప్రదర్శనలలో పాల్గొనడానికి సర్పంచ్(లు) తమ ప్రాంతంలోని పురాతన లేదా పర్యాటక ప్రదేశాన్ని,  నీటి వ‌న‌రులు ఉన్న ప్రదేశానికి సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలని సూచించారు. యోగా యొక్క అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) -2022 నిర్వ‌హిస్తున్నారు. ఐడీవై పంచాయతీ రాజ్ సంస్థలు ముందుకు రావడానికి మరియు పౌరులు / నివాసితులలో యోగా సాధన యొక్క ప్రతిఫలాల గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఒక సందర్భాన్ని అందిస్తుంది. మంత్రిత్వ శాఖ ఐడీవై–2022కి ముందు పంచాయతీరాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలతో పాటు గ్రామీణ ప్రజానీకానికి అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ప్రచారాన్ని చేపట్టింది.

***



(Release ID: 1835445) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi , Marathi