వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ వాణిజ్యసంస్థ 12వ మినిస్టీరియల్ సదస్సులో వ్యవసాయంపై జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటన.
Posted On:
14 JUN 2022 10:31PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి పియూష్ గోయల్ , జెనీవాలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ 12 వ మినిస్టీరియల్ సదస్సులో వ్యవసాయంపై ఈ రోజు జరిగిన సమావేశంలో చేసిన ప్రకటన పాఠం ఇలా ఉంది.
“మనం సంప్రదింపులలో ఉన్న అత్యంత కీలక అంశాలను చర్చిస్తున్నాము. వీటిప్రభావం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిప్రజల జీవితాలపై ప్రత్యక్షంగా ఉంటుంది. వర్ధమాన దేశాలలో వ్యవసాయం అనేది చాలామంది రైతులకు, రైతు కూలీలకు కేవలం జీవనాధారం మాత్రమే కాదు, ఇది వారి ఆహారభద్రతకు, పౌష్టికాహారానికి ఎంతో కీలకమైనది.అంటే ఇది వర్ధమాన దేశాల అభివృద్ధికి అక్కడి ప్రజల అభివృద్ధికి కీలకమైనది.
కోవిడ్ -19 మహమ్మారి, ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల వల్ల తలెత్తిన ఆహార సంక్షోభం వల్ల చాలా దేశాలుతీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఈజిప్టు, శ్రీలంకనుంచి నా మిత్రులు దీనిని గురించి నిన్న మాట్లాడారు, ముసాయిదా ప్రకటనలు, పరిశీలనలో ఉన్న నిర్ణయాలు వారి దేశాలలో ఆహారం అందుబాటు మెరుగుపడడానికి తోడ్పడుతుందేమో చూడాలి.
అయితే ఈ ఇద్దరు సభ్యులు ముసాయిదా ఆహార భద్రతా ప్రకటనతో ఏకీభవించలేదు. అయితే వీరు పబ్లిక్ స్టాక్ హొల్డింగ్ అంశంపై అత్యవసర, శాస్వత పరిష్కారానికి పిలుపునిచ్చారు.
తాత్కాలిక పరిష్కారాలు ఆయా దేశాలకు పనికి వచ్చే స్థితిలో మనం లేము. పబ్లిక్ హోల్డింగ్‌కు సంబంధించిన శాస్వత పరిష్కారం 9 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. దీనిని ఒక కొలిక్కి తేచ్చే ప్రయత్నాలను ముగింపు దశకు తీసుకురాలేదు.
ఇండియా ఆహార కొరతగల దేశం నుంచి , ఆహార సమృద్దిగల దేశంగా రూపుదిద్దుకున్న అనుభవం ఉంది. ఈ స్వయం సమృద్ధి సాధించడం వెనుక మా ప్రభుత్వ అందించిన సబ్సిడీలు, అది పోషించిన పాత్ర కీలకమైనవి. అందువల్ల మేం నడిచి వచ్చిన మార్గం, మా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మేం వర్ధమాన దేశాలు, ఎల్‌డిసి ల తరఫున సమష్టిగా పోరాడుతున్నా. ఇక ఉరుగ్వే రౌండ్ నుంచి ఇప్పటివరకు జరిగిన దానిని చూడండి. 1985-86 నుంచి 1994 వరకు 8 సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం మారకేష్ ఒప్పందం జరిగిన తర్వాత డబ్ల్యు టిఒ ఏర్పడింది. వ్యవసాయం ఎప్పుడూ తగిన ప్రాధాన్యత పొందడంలేదు. అసమతుల్యతతో కూడిన ఫలితాలు, భారీ సబ్సిడీలు మంజూరు చేసి మార్కెట్ లను గాడితప్పిస్తూ, తమ సబ్సిడీలను రాబట్టుకోగలిగారు. ఇలాంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. ఈ అవకాశం ఇతర దేశాలకు లేకుండా పోయింది. వర్ధమాన దేశాలు తమ సామర్ధ్యం మేరకు పురోగమించి తమ ప్రజలకు సుసంపన్నత తెచ్చిపెట్టే పరిస్థితి లేకుండా ఉండింది.
మనం చర్చిస్తున్నవి అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువగా సరిపడే నిబంధనలకు సంబంధించిన ఒప్పందాలు. ఇవి వారి సామాజిక ఆర్థిక స్థితిగతులకో సం పనిచేస్తాయి. ఇది అభివృద్ధి చెందిన ప్రపంచం ఎక్కువ పొందడానికి వీలు కల్పిస్తుంది. వర్ధమాన దేశాలను వేస్తున్న ప్రశ్నలు సరైనవి కావు. ఇవి 35 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితులకు సంబంధించినవి. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మారుతున్న పరిస్థితులు , వీటన్నిటితో 86లో ఉన్న పరిస్థితులలోనే ఇవి ఉండి పోయాయి., ఇవాళ మనం వాటి ఫలితాలను అనుభవిస్తున్నాం.
ఈ రోజు ఇంతకుముందు నా ప్రస్తావనలో ,ఫిషరీస్‌లో మళ్లీ ఇలాంటిదే చేయాలని కోరుతున్నామని గదిలోని మా ఇతర స్నేహితులను హెచ్చరించడానికి మాత్రమే నేను దీనిని ప్రస్తావించాను.
11 డిసెంబర్ 2013 నాటి మంత్రుల స్థాయి సమావేశం ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంది అనే పదాన్ని నేను పునరుద్ఘాటిస్తున్నాను.
శాస్వత పరిష్కారం కోసం 11వ మంత్రుల స్థాయి సమావేశంలో తగిన తీర్మానం చేయడానికి, ఇందుకు చర్చలకోసం ఒక తాత్కాలిక యంత్రాంగం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఖరారు చేయడం జరిగింది. మనం అందరం దీనిపై అంగీకారం తెలిపాం.
అభివృద్ధి చెందిన దేశాలతో సులభతర వాణిజ్య ఒప్పందానికి బదులుగా దీనినిచేపట్టాము. ఈ విషయంలో మనం రాజీ పడ్డాము, వారి వాణిజ్య సులభతర ఒప్పందంపై అంగీకారం తెలిపాం. పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్‌కు శాశ్వత పరిష్కారం కోసం సిద్దపడ్డాము.
8 వ పేరా ప్రకారం, శాస్వత పరిష్కారం సాధనకు తగిన సూచనలు చేసే ఉద్దేశంతో వ్యవసాయంపై ఏర్పాటైనకమిటీలో ఒక కార్యాచరణకార్యక్రమాన్ని చేపట్టేందుకు సభ్యులు అంగీకరించారు. పేరా 9 ప్రకారం11వమంత్రుల సమావేశం నాటికి మించకుండా ఈ వర్క్ ప్రోగ్రాంను ముగించేందుకు సభ్యులు కట్టుబడి ఉండాలి. పేరా 10 ప్రకారం, 10 వ మినిస్టీరియల్ సదస్సుకు వర్క్ ప్రోగ్రాంపై పురోగతిని జనరల్ కౌన్సిల్ రిపోర్టు చేయాలి. నేను మీకు దీనిని ఎందుకు గుర్తుచేస్తున్నానంటే,
మేము ఈ సమస్యపై మరోసారి చర్చలు ప్రారంభించాలని మనకు సూచించడం జరిగింది, ఇది 28 నవంబర్ 2014 జనరల్ కౌన్సిల్ డాక్యుమెంట్‌లో పునరుద్ఘాటించబడింది , అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆహార భద్రత ప్రయోజనాల కోసం పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ ఉంటుందని అది ఫైనల్ అని పేర్కొంది.
వాస్తవానికి, 2015లో కూడా 10వ సెషన్‌లో జరిగిన మంత్రుల స్థాయి సమావేశం, 2014 జనరల్ కౌన్సిల్ నిర్ణయాన్ని పునరుద్ఘాటించాలని నిర్ణయించింది . ఈ నిర్ణయాన్ని అంగీకరించడానికి ,ఆమోదించడానికి అన్ని సమిష్టి ప్రయత్నాలను చేసే కార్యకలాపాలలో నిర్మాణాత్మకంగా పాల్గొనడానికి మంత్రుల స్థాయి సదస్సుఅంగీకరించింది.
నేను దీనిని ఆవేదనతో చెబుతున్నాను. మనం ఇప్పటికే 12 వ మంత్రుల స్థాయి సమావేశంలో ఉన్నాం. ఇది కూడా ఆలస్యంగా జరుగుతున్న సమావేశం.సాంకేతికంగా చూసినపుడు, ఇప్పటికే 13 వ సమావేశం జరగవలసి ఉంది. అయినా మనం ఇప్పటికీ శాస్వత పరిష్కారాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఇది సాధ్యమేనని నేను అనుకుంటున్నాను. మనకు పటుతరమైన యంత్రాంగం ఉంది. తగిన డాక్యుమెంట్లు ఉన్నాయి.దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. దీనితో మనం సంబంధిత కీలక అంశానికి సంబంధించిన పరిష్కారానికి ముగింపు పలకవచ్చు
డబ్లు.టి.ఒ అనేది వాణిజ్యానికి సంబంధించిన సంస్థ . అయితే వాణిజ్యానికంటే ముందు ఆకలి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఖాళీ కడుపుతో వాణిజ్యమార్గం పట్టలేరు.
12వ మంత్రుల స్థాయి సమావేశం దిశగా, 80 కి పైగా దేశాలు పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అంశానికి ముగింపు పలికేందుకు , ఆహార అభద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు సంఘటితమయ్యాయి.
వ్యవసాయంపై ఒప్పందం (ఎఒఎ) అభివృద్ధి చెందిన దేశాలు , అగ్రిగేట్ మెజర్ ఆఫ్ సపోర్ట్ ( ఎఎంఎస్ ) కింద భారీ సబ్సిడీలను ఇచ్చేందుకు అవకాశం ఇస్తుండడం విచారకరం. దీనికితోడు ఈ సబ్సిడీలు కొన్ని ఉత్పత్తులపై ఏమాత్రం పరిమితిలేకుండా ఉంటున్నాయి. ఇదే వెసులు బాటు ఎల్ డి సిల తోపాటు మెజారిటీ అభివృద్ధి చెందుతున్నదేశాలకు అందడం లేదు.
వాణిజ్య వక్రీకరణ పేరుతో,వర్ధమాన దేశాలు కల్పించే మద్దతుపై వ్యక్తం చేసే భయాందోళనలు అర్థరహితం.
ప్రపంచ వాణిజ్య సంస్థ గుర్తించిన దాని ప్రకారం, వాస్తవానికి దేశీయంగా ఆయా దేశాలు రైతులకు కల్పిస్తున్న వాస్తవ మద్దతు విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య ఈ వ్యత్యాసం 200 రెట్లు ఉంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు చాలా వరకు వర్ధమాన దేశాలు ఇవ్వగలిగిన దానికంటే 200 రెట్ల కంటే ఎక్కువ మద్దతునిస్తున్నాయి.
ఇదే కాకుండా, కొందరు సభ్యుల, తక్కువ ఆదాయం గల పేద రైతులకు ప్రభుత్వ మద్దతులో వారికి దక్కే చిన్న వాటాను కూడా అందకుండా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
వర్ధమాన దేశాలపట్ల ప్రత్యేకంగా, వేరుగా చూడడం మనకు కీలకమైన అంశం. అందువల్ల దీనిని సంప్రదింపుల పరిధికింకి తేవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
వ్యవసాయంపై ముసాయిదా నిర్ణయాలు ఖర్చుతోకూడుకున్నవి. ఇవి దోహా రౌండ్ నిర్ణాయాలకు అతీతమైనవి. ఇది ఇప్పటివరకు సాధించిన పురోగతిని గుర్తించదు.
చివరగా, ఇండియా , ఆహారసమస్య ను ఎదుర్కొంటున్నదేశాలకు ఆహారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటూఉంది. ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఎగుమతుల ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వాలన్న ప్రతిపాదన విషయంలో, మేం ఈ మినహాయింపులను సమర్ధిస్థాం. మనం ఆహార భద్రత కల్పించే విధంగా జిటుజి లావాదేవీలకు అవకాశంకల్పించాలి. ఇది అంతర్జాతీయంగా, దేశీయంగా జరగాలి.ఇది విశాల దృక్పథంతోసాగాలి. ప్రత్యేకించి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం స్థాయి, ఫండింగ్, ను దృష్టిలో ఉంచుకున్నప్పుడు దాని పరిమితులు దానికి ఉన్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ 12 వ మంత్రుల స్థాయి సమావేశంలో పబ్లిక్ స్టాక్ హొల్డింగ్‌కు శాస్వత పరిష్కారం కల్పిచడం ఖరారు అయ్యే విధంగా చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. మనం పేదల సంరక్షణకు పాటుపడుతున్నామని, నిరుపేదల బాగు కోసం కృషిచేస్తున్నామని, మనం ఆహార భద్రతకు కృషిచేస్తున్నామని, మిగతాప్రపంచానికి సంబంధించి మరింత సమతుల్యతతో కూడిన, న్యాయంతో కూడిన భవిష్యత్‌కు పూచీపడుతున్నామన్నసందేశాన్ని పంపవలసి ఉంది.
***
(Release ID: 1834819)
Visitor Counter : 218